జగన్ వ్యాఖ్యల్లో తప్పేంటి??

YSR Congress Party MLA Roja backs YS Jagan comments made against AP CM Chandrababu Naidu ysr congress, mla roja, ys jagan, ap cm, chandrababu naidu జగన్ వ్యాఖ్యల్లో తప్పేంటి?? roja slams chandrababu
YSR Congress Party MLA Roja backs YS Jagan comments that made against AP CM Chandrababu Naidu

ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలు నెరవేర్చనందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను ప్రజలను నడిరోడ్డుపై కాల్చినా తప్పులేదంటూ వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారాన్ని రేపుతున్నాయి. జగన్ వ్యాఖ్యలను సుమోటాగా పరిగణించి చర్య తీసుకోవాలంటూ టీడీపీ నాయకులు చేస్తున్న డిమాండుకు ఎలక్షన్ కమీషన్ సానుకూలంగా కూడా స్పందించింది.

ఇదంతా ఇలా నడుస్తుండగానే…తెలుగుదేశం నేతలపై తీవ్రంగా ధ్వజమెత్తారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా.

సీఎం పై జగన్ చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పూ లేదని జగన్ వ్యాఖ్యలను సమర్ధించి మరింత కాంట్రవర్సీ కి తెరలేపారు రోజా.

అంతే కాదు టీడీపీ నేతలపై విరుచుకుపడ్డారు రోజా. జగన్‌ను తిట్టడానికే సోమిరెడ్డికి మంత్రి పదవి ఇచ్చారని ఆరోపించారు ఆమె.

కేశవరెడ్డి బాధితులకు న్యాయం చేసిన తర్వాత మంత్రి ఆదినారాయణరెడ్డి మాట్లాడాలన్నారు రోజా.

అచ్చెన్నాయుడు మాట్లాడకుండా ఉంటే మంచిదని హితవు పలికారు ఆమె. చంద్రబాబే శిఖండిలా మాట్లాడుతున్నారని, రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారంటూ తన నోటికి పనిచెప్పారు.

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com