పవన్ ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నమా??

ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం నిరవధిక దీక్ష చేస్తున్న వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి,  జన  సేనాని  పవన్ కళ్యాణ్ మద్దతునిచ్చి హోదా సాధన కోసం పోరాడాలని నగరి  శాసన సభ్యురాలు రోజా అన్నారు. ప్రశ్నించ డానికే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పిన పవన్, ప్రత్యేక హోదా కోసం ప్రధాని మోడీని, ముఖ్యమంత్రి చంద్రబాబు ను ఎందుకు ప్రశ్నించడం లేదో చెప్పాలన్నారు .

పవన్ సాక్షిగానే తిరుపతి సభ లో మోడీ, చంద్రబాబులిద్దరూ ప్రత్యేక హోదా ఇస్తామని, తెస్తామని చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా  రోజా గుర్తు చేశారు. ప్రత్యేక హోదా విషయం లో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు నాల్కల ధోరణి తో వ్యవహరిస్తున్నారన్న ఆమె,  చంద్రబాబు చీటర్ అయితే పవన్ ఫైటర్ అని పేర్కొన్నారు.  ఏపీ ప్రభుత్వం చేస్తోన్న అవినీతిని  పవన్ కళ్యాణ్  ప్రశ్నించక పోవడం దారుణమని విమర్శించారు.

రోజా వ్యాఖ్యలు  చూస్తుంటే  పవన్ ప్రసన్నం చేసుసుకోవాలనే  ప్రయత్నాలు వైస్సార్ కాంగ్రెస్ నాయకత్వం చేస్తున్నట్లు  స్పష్టం అవుతుంది. గత ఎన్నికల్లో బీజేపి, టీడీపీ కూటమికి  మద్దతుగా పవన్ ప్రచారం నిర్వహించడం వల్లే ప్రతిపక్షానికి పరిమితం కావాల్సి వచ్చిందని భావిస్తోన్న ఆ  పార్టీ నేతలు ,  పవన్ ను ఎలాగైనా మచ్చిక  చేసుకోవాలని యోచిస్తున్నారన్న వాదనలు లేకపోలేదు.  వైస్సార్ కాంగ్రెస్ పార్టీ  విధానాలను తీవ్రంగా వ్యతిరేకించే పవన్ ఆ పార్టీ తో జత కట్టడం అన్నది అనుమానమేనని  రాజకీయ పరిశీలకులు అంటున్నారు.  

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com