పవన్ పై జగన్ బ్యాచ్ కు ఇంత కడుపు మంటా..!! రాష్ట్రాన్ని రావణకాష్ట చేస్తారేమో..!!

YSR Congress and Its media spewing venom on Janasana 's Pawan Kalyan ys jagan, ysr congress party, paid journalists, spewing venom, janasena, pawan kalyan, pawan vs jagan పవన్ పై జగన్ బ్యాచ్ కు ఇంత కడుపు మంటా..!! రాష్ట్రాన్ని రావణకాష్ట చేస్తారేమో..!! pawan vs jagan against land acquisition e1465694849908
YSR Congress and Its media spewing venom on Janasana ‘s Pawan Kalyan

దేశానికి స్వ‌తంత్రం వ‌చ్చి ఆరు ద‌శాబ్దాలు రిచ్‌గా దాటిపోయింది.. పార్టీలు మారాయి.. పాల‌న‌లు మారాయి.. కానీ రాజ‌కీయ నాయ‌కులు తీరు మాత్రం మార‌లేదు.. మేం వ‌స్తే.. ఏదో చేసేస్తాం.. అని చెప్పిన వారే త‌ప్ప‌., వ‌చ్చిన త‌ర్వాత జ‌నానికి ఆ ఏదో చేసిన వారు మాత్రం లేరు.. దేశ రాజ‌కీయం చూసినా., రాష్ట్ర రాజ‌కీయం చూసినా., ఏ మాత్రం మార్పు క‌న‌బ‌డ‌దు.. ఇన్నేళ్ల స్వాతంత్ర భార‌త చ‌రిత్ర‌లో ప్ర‌జ‌లు భాగుప‌డింది లేదు.. వారి స‌మ‌స్య‌లు తీరిందీ లేదు.. అంద‌రికీ క్రిష్ట‌ల్ క్లియ‌ర్‌గా క‌న‌బ‌డేది నాయ‌కుల భాగు మాత్ర‌మే.. ఇది నాణానికి ఒక వైపు అయితే.., రెండో వైపు.. ఎవ‌రో వ‌స్తారు.. ఏదో చేస్తారు.. అన్న జ‌నం ఎదురుచూపులకి దేవుడు క‌రుణించి., జ‌నానికి మంచి చేయ‌డానికి ఎవ‌రైనా ముందుకి వ‌స్తే.. వారినీ చేయ‌నివ్వ‌రు.. వీరు చేయ‌రు.. ఎదుటి వారు చేస్తే.. దానికి మ‌ద్ద‌తు ప‌ల‌కాల్సింది పోయి.. దాన్నీ చెడుగా చిత్రించే ప్ర‌య‌త్నాలు.. మ‌రీ రాజ‌కీయాలు ఇంత‌నీచ‌మా..? అధికారం కోసం అంత పాకులాటా..? అని జ‌నం న‌వ్వేసుకుంటున్నా., వీరికి మాత్రం ఏ మాత్రం సిగ్గు రాదు.. ఇప్పుడు ఈ బ్యాచ్ ఇంకో అడుగు ముందుకి వేసింది.. మంచిని కూడా చెడు..చెడు.. అని ప‌ది మందితో అనిపించి., దాన్ని బ‌ల‌వంతంగా అయినా చెడుగా జ‌నాల్లోకి తీసుకెళ్లాల‌నే ప్ర‌య‌త్నం.. ఇందుకు పాత్రికేయ విలువ‌లు పూర్తిగా మ‌ర‌చిపోయి., సంచ‌నాలు., విచ్చ‌ల‌విడి చేష్ట‌ల‌కు అల‌వాటు ప‌డిన మీడియా సాయం తీసుకుంటున్నారు.. పూర్తి పెయిడ్ పాత్రికేయం.. పెయిడ్ ఆర్టిక‌ల్స్‌.. అంటే ప్ర‌త్య‌ర్ధిపై బ‌రుద‌చ‌ల్లి న‌జ‌రానాలు పొంద‌డం అన్న‌మాట‌.. ఈ బ్యాచ్ మీడియా కూడా రామాయ‌ణంలో పిడ‌క‌లు వెతుకుతోంది.. జ‌నం తిట్టుకున్నా., జేబులు నిండితే చాలు అనుకుంటోంది..

ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజ‌కీయాల్లో స‌మ‌స్య‌ల ప‌రిష్కార కేంద్రం అన్న పేరు తెచ్చుకున్న జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌పై ఈ బ్యాచ్., త‌మ పెన్ పాఠ‌వాన్ని ప్ర‌ద‌ర్శిస్తోంది.. ఆయ‌న ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌లేదు.. త‌న పార్టీ త‌రుపునా ఎవ‌రినీ పోటీ చేయించ‌నూ లేదు.. ఆయ‌న చేస్తోంది కేవ‌లం ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటం మాత్ర‌మే.. నేను వ‌స్తే., అది చేస్తా.. ఇది చేస్తా అని ఎక్క‌డా.. ఎప్పుడూ చెప్ప‌లేదు.. ఇప్పుడు చెప్ప‌టమూ లేదు.. ఆయ‌న చేస్తోంది.. స‌మ‌స్య‌ల‌తో త‌న వ‌ద్ద‌కు వ‌స్తున్న జ‌నానికి ఊర‌ట‌నివ్వ‌డం.. ఆ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి చేయ‌డం.. ఓ స‌మ‌స్య జ‌న‌సేనుడు టేక‌ప్ చేశారంటే., ఇక జ‌నం గుండెల‌పై చేయి వేసుకున్న‌ట్టే.. ఇది అంద‌రికీ తెలుగు ప్ర‌జ‌లంద‌రికీ తెలిసిన విష‌య‌మే..

ys jagan, ysr congress party, paid journalists, spewing venom, janasena, pawan kalyan, pawan vs jagan పవన్ పై జగన్ బ్యాచ్ కు ఇంత కడుపు మంటా..!! రాష్ట్రాన్ని రావణకాష్ట చేస్తారేమో..!! 20525691 1679354559039654 370438076947850443 n తాజాగా లీడ‌ర్ అంట‌.. సంచ‌ల‌నాలే వారికి ఊపిరిగా చెప్పుకుంటున్న ఈ ప‌త్రిక‌.. ఏకంగా నంద్యాల ఉప ఎన్నిక‌కీ., ఉద్దానంకి ముడి పెట్టేసింది.. జ‌న‌సేనుడు ఉద్దానంలో ప‌ర్య‌టించింది ఎప్పుడు.. భూమా నాగిరెడ్డి చ‌నిపోయింది ఎప్పుడు..? ఇంకా న‌యం భూమా మృతి ముందే ప‌వ‌న్‌కి తెలుస‌ని చెప్ప‌లేదు.. ఇక ఉద్దానంకి జ‌న‌సేనుడి కార‌ణంగా ల‌భించిన ఊర‌టా.. ఆయ‌న్ని ఉద్దానం ప్ర‌జ‌లు దేవుడిగా కొలుస్తుండ‌డం ఈ సంచ‌ల‌న ప‌త్రిక‌కి క‌న‌బ‌డ‌లేదు.. క‌ష్ట‌ప‌డి ఈ లీడ‌ర్ ఓ పిడ‌క‌ని వెతికింది.. అదేంటి అంటే హార్వార్డ్ బృందం ఉద్దానం రావ‌డం ఇదే తొలిసారి కాదు అన్న‌ది.. ప‌దేళ్ల క్రిత‌మే వ‌చ్చింది అన్న‌దే ఆ విష‌యం.. ఇప్పుడు ఎవ‌రైనా రాలేదు అని చెప్పారా..? ప‌్ర‌పంచ ఆరోగ్య సంస్థ కూడా ఇక్క‌డ ప‌రిశోధ‌న‌లు చేసిన విష‌యం అంద‌రికీ తెలుసు.. అయితే ఒక‌సారి వ‌స్తే.. మ‌రోసారి రాకూడ‌దా..? ఇప్ప‌డు వ‌చ్చిన వారి వ‌ల్ల ఏమైనా ఉప‌యోగం ఉంటుందేమో..? ఈ ఆలోచ‌న మీకు ఎందుకు రాలేదు..

ప‌దేళ్ల క్రిత‌మే హార్వార్డ్ బృందం వ‌చ్చింది.. జ‌న‌సేన అధినేత చేసింది గొప్ప కాదు అంటున్నారు.. ప‌దేళ్ల క్రితం ఉద్దానం ప్రాంతంలో ఎన్ని డ‌యాల‌సిస్ కేంద్రాలు ఉన్నాయి..? ఎంత మందికి ఉచిత బ‌స్ పాస్‌లు ఉన్నాయి..? ఎన్ని ర‌క్షిత మంచినీటి స‌ర‌ఫ‌రా కేంద్రాలు ఏర్పాటు చేశారు..? ప‌దేళ్ల క్రితం ఒక్క కిడ్నీ రోగికైనా ప్ర‌భుత్వం ఫించ‌న్ ఇచ్చిందా..? జ‌రిగిన మంచి వ‌దిలేసి., ఈ పిడ‌క‌ల వేట ఎందుకు..? ఎవ‌రి భాగు కోసం..? జ‌నానికి మంచి జ‌రిగితే మీరు ఓర్వ‌లేరా..? జ‌నానికి మంచి చేసే ఉద్దేశం.., బుద్దీ మీకు లేదు.. రాదు.. చేసే వారిని కూడా చెడ‌గొట్టాల‌నా మీ ఈ ప్ర‌య‌త్నం.. జ‌నం తిర‌గ‌బ‌డి త‌రిమికొట్ట‌క ముందే.. మారండి..

జ‌న‌సేనాని చెప్పారు.. ఉద్దానం స‌మ‌స్య‌కు శాశ్విత ప‌రిష్కారం దొరుకుతుంది అంటే., జ‌గ‌న్‌తో అయినా క‌ల‌సి ప‌నిచేస్తా అని.. మీరు ఎందుకు స్వాగ‌తించ‌లేక పోయారు.. ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై మీకున్న నిబ‌ద్ద‌త ఏంటో ఇక్క‌డే తెలిసిపోతోంది.. జ‌న‌సేనుడి విష‌యంలో ప‌ది గొంతులు కాదు.. వంద గొంతులు ఏక‌మై ప్ర‌చారం చేసినా., ఆయ‌నేంటో జ‌నానికి తెలుసన్న‌ది జ‌న‌సైన్యం వాద‌న‌.. ఈ వాద‌న ఏకీభ‌వించ‌ద‌గిందే..

 

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com