ఎవరికీ లేని మర్యాద ‘పవన్’ కే! విషయం ఇదే!

ప్రతి పక్షం కానీ , అధికార పక్షం కానీ ఎవరినైనా తిట్టడానికో , విమర్శలు చెయ్యడానికో అస్సలు ఆలోచించే పని పెట్టుకోరు. వారి వారి పరిధులలో శృతి మించి తిట్ల వర్షం కురిపించడం రాజకీయాల్లో సాధారణ విషయం కానీ ఒకే ఒక్క వ్యక్తి కి మాత్రం ఇది వర్తించదు. ఒకవేళ ఎవరన్నా ఆ వ్యక్తి మీద నోరు పారేసుకున్నా ఆయా పార్టీల హై కమాండ్ లు జాగ్రత్తగా ఉండమని వార్నింగ్ లు ఇచ్చిన సందర్భాలు కూడా లేకపోలేదు.

వైకాపా ఎమ్మెల్యే రోజా తాజా మాటలు చూస్తే ఆ వ్యక్తి “పవన్ కళ్యాణ్ ” అన్న విషయం చాలా సునాయాసంగా చెప్పేయచ్చు. మొన్నటి వరకూ జగన్ మోహన్ రెడ్డి దీక్ష గురించి మెచ్చుకోలుగా మాట్లాడిన రోజా, అధికార పక్షం మీద తీవ్ర విమర్శలు చేసారు. ఇప్పుడు జగన్ దీక్ష కి మీడియా సపోర్ట్ లేదనో ఏమో పవన్ కళ్యాణ్ ని రంగం లోకి ఆమె అంతట ఆమె తీసుకుని వచ్చి ఆయన మీద వ్యాఖ్యలు చెయ్యడం మొదలు పెట్టారు. దూకుడు గా సాగుతున రాజకీయాల్లో ఈ మధ్య మర్యాద గా ఒక వ్యక్తి గురించి మాట్లాడడం సున్నితంగా వ్యవహరించడం అనేవి పోయి చాలా కాలం అయ్యింది కానీ పవన్ కళ్యాణ్ విషయం లోకి వచ్చే సరికి అవన్నీ మళ్ళీ మొదటికే వస్తున్నాయి.

ప్రత్యేక హోదా కోసం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో ప్రతీ గుండే తపిస్తోంది అని చెబుతున్న ఆమె పవన్ కళ్యాణ్ అన్నిటి మీదా ప్రశ్నిస్తా అని చెప్పి ప్రత్యేక హోదా విషయం లో ఎందుకు మాట్లాడ్డం లేదు అన్నారు. అడిగేదేదో చాలా దురుసుగా అడిగే స్వభావం ఉన్న రోజా పవన్ ని మాత్రం .. “పవన్ కళ్యాణ్ గారూ” అంటూ సంబోధించడం ఆశ్చర్యకరం.  ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని నరేంద్ర మోడీ.. చంద్రబాబు హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ ” పవన్ కళ్యాణ్ గారూ ఆ మాటలకు మీరే కదా సాక్షులు ” అంటూ వ్యాఖ్యానించారు.

పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే యువతరం లో అతనికి ఎక్కువగా అభిమానులు ఉండడం తో ఆ యనకి ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని తమ పార్టీ యువ సపోర్టర్ లు దూరం అవుతారు అని అన్ని పార్టీలూ భయపడుతున్నాయి.

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com