పవన్ తో సల్మాన్….త్వరలో?

ప్రాణాంతక వ్యాధితో పోరాడిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్ శ్రీజ….ఆయన అందించిన సహకారం, మనోధైర్యంతో పూర్తిస్థాయిలో కోలుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే శ్రీజ తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి పవన్ కళ్యాణ్ ని కలిసింది.

ఈ సంఘటన తర్వాత సోషల్ మీడియాలో ఓ చర్చ మొదలైంది. సల్మాన్ ఖాన్ బీయింగ్ హ్యూమన్ సంస్థ లాంటి స్థాపించడం లేదా, అలాంటి సంస్థలకు పవన్ కళ్యాణ్ కూడా ప్రచార కర్తగా ఉంటే బావుంటుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కేవలం సూపర్ స్టార్ మాత్రమే కాదు, అభిమానులకు ఆయన అంతకంటే ఎక్కువ. తన ఆలోచనలు, జీవన విధానం, సేవ కార్యక్రమాలు ఆయనన్ను అందనంత ఎత్తుకు తీసుకెళ్లాయి.

ప్రస్తుతం ఉన్న స్టార్లలో ఆయనకు ఉన్న ఫాలోయింగ్ ఏ హీరోకూ లేదంటే అతిశయోక్తి కాదేమో. పవన్ కళ్యాణ్ “హీరో విత్ ఎ సోషల్ రెస్పాన్సబులిటీ”. ఇంకా అంతకంటే బెటర్ గా చెప్పాలంటే “మ్యాన్ విత్ గ్రేట్ సోషల్ రెస్పాన్సబులిటీ”….అలాంటి వారినే హీరో అని పిలుస్తారు.

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కూడా తన సోషల్ రెస్పాన్సబులిటీలో భాగంగా….మరో బాలీవుడ్ స్టార్ ఫర్హాన్ అక్తర్ ప్రారంభించిన ‘MARD'(మ్యాన్ ఎగెనిస్ట్ రేప్ అండ్ డిస్క్రిమినేషన్) కార్యక్రమానికి ప్రచారం చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా సల్మాన్ ఖాన్ ‘బీయింగ్ హ్యూమన్’ తరుపున ప్రచారం చేస్తే బావుంటుందని పలువురు అభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.

ఇదిలా ఉంటే…పవన్ ఇప్పటికే ఓ పక్క సినిమాలు, మరో పక్క ప్రజా సమస్యలపై పోరాటంతో బిజీ గా ఉంటూనే ప్రజలకు చేదోడు వాదోడుగా ఉండాలనే దృఢ నిశ్చయంతో ముందుకు వెళుతూ…ఆపదలో ఉన్నవారికి తనవంతు సాయం చేస్తూ మిగిలిన నటులకు ఆదర్శంగా నిలుస్తున్నారనడంలో వాస్తవం లేకపోలేదు.

ఇంత బిజీగా ఉన్న పవన్.. ఇలాంటి కార్యక్రమాల ప్రచారంలో పాలుపంచుకోవడానికి అవకాసం వస్తే తప్పకుండా పంచుకుంటాడు అనే అభిప్రాయమూ వ్యక్తమవుతుంది. మరో పక్క సల్మాన్ కూడా ఈ విషయంపై పవన్ ను సంప్రదించే యోచనలో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఇదే జరిగితే…పవన్ ను, సల్మాన్ ను ఒకే వేదికపై చూడొచ్చు అభిమానులు. ఇక ఇద్దరికీ దేశవ్యాప్తంగా ప్రశంసలూ వెల్లువెత్తుతాయి.

 

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com