ఆపండి మీ కుల కుట్ర..!!

Why corrupt yet caste based media allocates lots of air time to criticize Pawan Kalyan pawan kalyan ఆపండి మీ కుల కుట్ర..!! pawan kalyan fans vs kathi mahesh e1503860875161
Why corrupt yet caste based media allocates lots of air time to criticize Pawan Kalyan

ఇక ఏ సమస్యా పట్టనట్లు. తెలుగు రాష్ట్ర ప్రజలు ఏ ఇబ్బంది లేకుండా సుఖ సంతోషాల్లో వర్ధిల్లుతున్నట్లు. సమస్యకాని సమస్యపై గంటలకొద్దీ రెచ్చగొట్టే..కాదు కాదు వారి కులం కానివాడు, బడుగువర్గాల ఆశాజీవి ఎదగనివ్వకూడదు అనే కక్షతో జర్నలిజాన్ని కూడా తాకట్టు పెట్టి కులమీడియా సంస్థలు ప్రవర్తిస్తున్న తీరు దౌర్భాగ్యం.

ఎవరో ఓ అనామకుడు ఆలోచనలేని విమర్శలు వాక్స్వాతంత్య్రం అనే పేరును అడ్డం పెట్టుకుని నోరుకి ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే..ఆ మాటలు తట్టుకోలేని కొంతమంది తిరిగి సదరు వ్యక్తిని విమర్శిస్తే…ప్రతివిమర్శను తట్టుకోలేని ఓ నోరుబలిసిన వ్యక్తికి ఇంతటి విలువైన ఎయిర్ టైం ను కేటాయించడం వెనుక మీ కుల పిచ్చి ఏమిటో తలచుకుంటేనే అసహ్యం వేస్తుంది.

మీ మీడియా సంస్థల కులానికి చెందిన ఓ ప్రముఖ నటుడు అమ్మాయిలపై అసహ్యమైన కామెంట్లు, అసిస్టెంట్లను కొట్టడాలు, మందు కొట్టి చిందులు వేస్తే..ఆయన్ను మీ స్టూడియో లకు పిలిచి ఇంత ఎయిర్ టైం కేటాయించలేదు.

మీ కులగజ్జి ఇలాగే సాగుతది…సాగిస్తాం అనుకుంటే మీ కంటే మూర్ఖులు ఇంకొకరు ఉండరు. సోషల్ మీడియా మీ కూకటివేళ్ళను పెగలించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. కాదు కాదు..ఆ రోజులను మీరే ఆహ్వానిస్తున్నారు.

ఇలాంటి జ్ఞానంలేని ఎపిసోడ్ లను ప్రసారం చేసేటప్పుడు “జర్నలిజం” నిర్వచనం కూసంత చదువుకొని..కొద్దిగైనా పాటించే ప్రయత్నం చేయండి. లేదంటే ప్రజలమధ్యలో చిచ్చుబెట్టి అల్లకల్లోలలేమైనా జరిగితే మొదటి బాధ్యత మీ మీడియా సంస్థలదే.

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com