చట్టసభలో తిట్ల దండకం …వీళ్ళా మన నేతలంటున్న ప్రజలు

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అధికార, ప్రతిపక్ష పార్టీల వ్యవహార శైలి చూసి ప్రజలు ముక్కున వేలే సుకుంటున్నారు. ముఖ్యంగా చట్ట సభల్లో సభ్యుల ఉపయోగిస్తున్న భాష పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యమంత్రి, మంత్రులు, అధికార పార్టీ సభ్యులనుద్దేశించి ప్రతిపక్ష సభ్యులు చేసిన అనుచిత వ్యాఖ్యలు, అసభ్య పదజాలం తో దూషించడం ఇటీవల టీడీపీ నేతలు విడుదల చేసిన వీడియో పుటేజ్ లలో స్పష్టంగా విన్పిస్తున్నాయి . దీంతో వీళ్ళా  మన ప్రజాప్రతినిదులని ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

సైకోగాడు వాడు …

మంత్రి అచ్చెన్నాయుడు ను ఉద్దేశించి ఎమ్మెల్యే కొడాలి నాని అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే, ముఖ్యమంత్రి చంద్రబాబు , అయన తనయుడు లోకేష్ పై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. అచ్చెన్నాయుడు నుద్దేశించి వాడు సైకోగాడు సర్, ఎద్దులా పెరిగాడు, బుద్ది లేదు వాడికి, సోల్లుగాడు అంటూ కొడాలి నాని అనుచిత కామెంట్ల పై అధికార పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అనిత లాగా మొగుడ్ని కొట్టి …

ఇక పాయకరావు పేట ఎమ్మెల్యే అనిత గురించి, అధికార పార్టీ శాసనసభ్యురాళ్ళను ఉద్దేశించి ప్రతిపక్ష సభ్యురాలు రోజా అభ్యంతరక భాష ను ఉపయోగించారు. ‘అనిత మాదిరిగా నేను మొగుడ్ని కొట్టి పోలీస్ స్టేషన్ కు వెళ్లలేదని, వాడి వీడి వద్ద పడుకోలేదన్న రోజా వ్యాఖ్యలపై అధికార పార్టీ సభ్యులు తీవ్రంగా మండిపడుతున్నారు. సభ లో ఆమె హావభావాలు జుగుస్సాకరంగా ఉన్నాయని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వర ప్రసాద్, తెలుగు మహిళా అధ్యక్షురాలు శోభా హైమవతి, కాల్వ శ్రీనివాసులు మీడియా తో మాట్లాడుతూ మండిపడ్డారు.

వాళ్ళు పచ్చి బూతులు మాట్లాడారు

అధికార పార్టీ సభ్యులు పచ్చి బూతులు మాట్లాడితేనే తాము రియాక్ట్ కావాల్సి వచ్చిందని రోజా మీడియా తో మాట్లాడుతూ అన్నారు. అయినా తాము సభ లో అనని పదాలు అన్నట్లుగా ఎడిటింగ్ చేసి వీడియో పుటేజ్ తయారు చేశారని ఆరోపించారు.

చట్ట సభలో బూతుల పర్వమా ?

అధికార, ప్రతిపక్ష సభ్యుల బూతుల పర్వం పై ప్రజాస్వామ్యవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చట్ట సభల్లో సభ్యులు అనుచితంగాప్రవర్తించడమే కాకుండా , అసభ్య పదజాలం దూషించుకోవడం  దారుణమని మండిపడుతున్నారు. సభ్యుల తీరు మారకపోతే చట్టసభల పై గౌరవం పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com