ఉగాది-సర్దార్-బన్నీ-అకీరా: ఒకే రోజు ‘నాలుగు’ పండుగలు!!

మెగా అభిమానులకు ఒకే రోజు నాలుగు పండుగలు జరుపుకుంటున్నారు. ఏప్రిల్ 8 ని ఓ స్పెషల్ డే గా పరిగణిస్తున్నారు మెగా అభిమానులు. తెలుగువారి కొత్త సంవత్సరం ‘ఉగాది’ పర్వదినం ఏప్రిల్ 8 కావడం…అదే రోజున పవన్ కళ్యాణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాను విడుదల చేయడంతో ఈ రెండు పండుగలూ ఒకే రోజు జరుపుకుంటున్నారు అభిమానులు.

వీటితో పాటు…స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు కూడా ఏప్రిల్ 8 కావడం గమనార్హం. మరో పక్క…పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ పుట్టిన రోజు కూడా ఇదే రోజు అవడం మరో విశేషం.

“ఉగాది-సర్దార్ రిలీజ్-అల్లు అర్జున్ బర్త్ డే- అకీరా బర్త్ డే” విషెస్ తో సోషల్ మీడియా బిజీ అయిపోయింది. ఓ పక్క సెలబ్రిటీలు, మరో పక్క అభిమానులు శుభాకాంక్షలతో హోరెత్తిస్తూ…ఒకే రోజు నాలుగు పండుగలను జరుపుకుంటున్నారు.

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com