“జనసైనికులు” తమ విజ్ఞతను ప్రదర్శించాల్సిన తరుణం..!!

Thought provoking message for JanaSena and Its Chief Pawan Kalyan Fans "జనసైనికులు" తమ విజ్ఞతను ప్రదర్శించాల్సిన తరుణం..!! “జనసైనికులు” తమ విజ్ఞతను ప్రదర్శించాల్సిన తరుణం..!! pawan kalyan fans vs kathi mahesh and tammareddy
Thought provoking message for JanaSena Followers and Its Chief Pawan Kalyan Fans

పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తే చాలు..విమర్శించినోడి ప్రొఫైల్ తో పనిలేకుండా గంటలకొద్దీ ప్రసారాలు, పేజీల కొద్దీ రాతలతో భీభత్సమైన పబ్లిసిటీని కల్పిస్తారు. పవన్ పై ప్రో-వైసీపీ, ప్రో-టీడీపీ మీడియాకు ఉన్న అసూయ అలాంటిది మరి.

ప్రజల అసలైన సమస్యలను పక్కదారి పట్టించే చీప్ జిమ్మిక్కుల్లో ఇది ఒకటైతే..గుర్తింపు లేనివారు లైమ్ లైట్ లోకి రావాలంటే పవన్ ను విమర్శిస్తే చాలు అనే భావన బలంగా ఉండడం. దీనికి కారణం పవన్ కళ్యాణ్ అభిమానులే. అవును ఇదే నిజం.

పవన్ కు ఉన్న అశేష అభిమానాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయనపై నెగటివ్ కామెంట్లు చేస్తే..తిరిగి వారికి పబ్లిసిటీని పవన్ కళ్యాణ్ అభిమానులే కల్పిస్తుండడం పచ్చినిజం.

పవన్ కళ్యాణ్ విజన్ పై పనిచేయాల్సిన అభినానులే వారి విలువైన సమయాన్ని పవన్ ను విమర్శించిన వారిపై కేటాయిస్తుండడమే ఇందుకు నిదర్శనం. పవన్ కళ్యాణ్ ను విమర్శించిన వారికీ కావాల్సింది అదే. వారు ఒక్కమాట అని వదిలిస్తే చాలు..మిగతా పబ్లిసిటీ అంతా పవన్ కళ్యాణ్ అభిమానులే తీసుకువాస్తారనే భావన వారిలో బలంగా ఉండడమే ఇందుకు కారణం.

అందుకే..ఎటువంటి గుర్తింపూ లేనివారు పవన్ ను విమర్శించినా..వారిపై సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ అభిమానులు తిరిగి మాటలదాడి చేస్తూ ట్రెండ్ అంటే తెలియని వారిని కూడా ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు.

ఫ్యాక్ట్స్ తో కూడిన సమాధానాలు ఇవ్వడం ఎంతైనా అవసరం ఉంది. కానీ అనవసరపు పబ్లిసిటీని అనామకులు కల్పించడం ఏమంత మంచిపనికాదు.

పవన్ కళ్యాణ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలంటే విమర్శలు చేసే వారి బుట్టలో పడకుండా విజ్ఞతతో ప్రదర్శించాల్సిన తరుణం ఎంతైనా ఉంది.

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com