ఆనాడు ఎన్టీఆర్..ఈనాడు పవన్ కళ్యాణ్…ఇద్దరికీ ఒకే ఆదరణ

Actor Shivaji, while addressing a meeting in Eluru, has severely criticised, questioned all of the AP MPs and demanded to enhance the standard of their protest in Parliament on AP special status.

Remembering NTR services towards Telugu people, the actor said, Jana Sena chief Pawan Kalyan has got an overwhelming public following the same as NTR.

కులాలకు, మతాలకు, వర్గాలకు అతీతంగా ఆనాడు ప్రజలనుండి ఆదరణ పొందాడు ఎన్టీఆర్. ప్రజలు ఆయన్ను వీటన్నిటికీ అతీతంగా చూశారు. అదే రకమైన ప్రజాదరణ ఈ నాడు పవన్ కళ్యాణ్ కి చూస్తున్నాం.

ఏపీ ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ముందుకు వస్తే తప్పక లక్ష్యం ఫలిస్తుంది. దీనిలో ఎటువంటి సందేహమూ లేదు. పవన్ కళ్యాణ్ కు ఆ సత్తా ఉంది కాబట్టే పదే పదే ఆయన గురించి ప్రస్థావించాల్సి వస్తుంది. దీన్ని కొంతమంది నాయకులు వక్రీకరిస్తున్నారు అంటూ నటుడు శివాజీ చెప్పుకొచ్చారు.

ఏలూరులో జరిగిన ప్రత్యేక హోదా సాధన సమావేశంలో మాట్లాడిన శివాజీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక ప్రత్యేక హోదాపై అధికార పార్టీలు బిజేపీ-టీడీపీ లతో పాటు ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ అనుసరిస్తున్న తీరుపై పలు విమర్శలతో పాటు ఆరోపణలూ చేశారు.

ఆంధ్ర ప్రదేశ్ కు సంబంధించి ఏ ఒక్కపార్టీ కూడా నిజాయితీగా పనిచేయడంలేదని…కేవలం అధికారమే లక్ష్యంగా పనిచేస్తున్నారే తప్ప ఇంకేమీ కాదని విమర్శించారు. ఏదో నామ్కేవస్తేగా టీడీపీ, వైసీపీలు ప్రత్యేకహోదాపై స్పందిస్తున్నాయి తప్పితే అదంతా భూటకమే అని కొట్టిపారేశారు.

ఏపీ లంచాలతో పూర్తిగా అవినీతిమైపోయిందని…ఏపీలో పరిశ్రమలు పెట్టుకోవడానికి మంత్రులు లంచాలు అడుగుతున్నారని తీవ్రమైన ఆరోపణలు చేశారు.

ఇక పవన్ ప్రత్యేక హోదాపై కదలిరావాలన్న శివాజీ వ్యాఖ్యలకు పలురకాల అభిప్రాయాలు వెలువెడుతున్నప్పటికీ ఈ అంశానికి సంబంధించి ఏపీకి చెందిన ఎంపీలు కలసికట్టుగా పోరాడాలని…తదుపరి తనవల్ల ఉపయోగం జరుగుతదీ అంటే తప్పక వస్తానని పవన్ ఇంతకముందే ప్రకటించిన సంగతి తెలిసిందే.

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com