‘కుమారి 21ఎఫ్’ మూవీ రివ్యూ

ముఖ్య తారాగణం: రాజ్‌ తరుణ్‌, హెబా పటేల్‌, నోయల్‌, సుదర్శన్‌, నవీన్‌, హేమ, తాగుబోతు రమేష్‌ తదితరులు

ఛాయాగ్రహణం: రత్నవేలు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌
నిర్మాతలు: విజయ్‌ప్రసాద్‌ బండిరెడ్డి, థామస్‌ రెడ్డి
కథ, కథనం: సుకుమార్
దర్శకత్వం: పల్నాటి సూర్య ప్రతాప్‌

సినిమాలో కొత్తదనానికి సరి కొత్త నిర్వచనం చెప్పిన దర్శకుడు సుకుమార్. కధ ఏదైనా, హీరో ఎవరైనా తన మైండ్ నుంచి వచ్చిన కధ ను కమర్షియల్ ఎలెమెంట్స్ ను జోడించి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని చవిచూపించే సత్తా ఉన్న దర్శకుడూ ఆయనే. ఆయన ప్రయాణం ‘ఆర్య’ నుంచే మొదలైంది. ఇక తాజాగా తాజాగా ‘కుమారి 21 ఎఫ్’ తో విభిన్న మైన, బోల్డ్ స్టొరీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సుకుమార్.

కధేంటి?

భర్త నుండి విడిపోయిన తల్లితో ఉంటూ జీవితంలో చెఫ్ గా స్థిరపడాలని అనుకుంటుంటాడు సిద్ధూ (రాజ్ తరుణ్). ఈ తరుణంలో కుమారి (హేబపటేల్) సిద్ధూ జీవితంలోకి ప్రవేశిస్తుంది. పరిచయమైన కొద్ది సమయంలోనే సిద్దూ ని ప్రేమిస్తున్నాని చెప్తుంది కుమారి. ఈ క్రమంలో ఇద్దరి మధ్య చనువు పెరగడంతో సిద్ధూ కూడా కుమారిని ప్రేమించడం మొదలెడతాడు. వీరిమధ్య చనువు, ప్రేమ సాఫీగా సాగిపోతున్న నేపధ్యంలో సిద్ధూకి కుమారిపై అనుమానం వస్తుంది. ఆ అనుమానం ఎందుకు ? అది ఎటు దారితీసింది ? ఈ క్రమంలో స్నేహితులు ఏ విధంగా సాయపడ్డారు ? అనేది మిగతా కధ.

నటీనటుల ప్రతిభ:

యువ నటుడు రాజ్ తరుణ్ కి చక్కనైన పాత్ర ఇది. అతని అమాయకపు హావ భావాలు కధకు తగ్గట్టు బాగా సెట్ అయ్యాయి. అతనికి తోడుగా హేబ పటేల్ పర్ఫెక్ట్ గా సెట్ అయిందని చెప్పాలి. బోల్డ్ క్యారక్టర్ లో హేబ పటేల్ మంచి మార్కులే కొట్టేసింది. అక్కడక్కడా ఎబ్బెట్టుగా అనిపించే సన్నివేశాలు ఉన్నప్పటికీ కధానుసారంగా మెప్పించగలిగింది. ఫ్రెండ్స్ క్యారెక్టర్ల లో చేసిన నవీన్, నోయల్, సుదర్శన్‌ లు ఆకట్టుకున్నారు వారి నటనతో. కామెడీ విభాగంలో హేమ, తాగుబోతు రమేష్ మెప్పించారు.

టెక్నికల్ టీం:

దేవిశ్రీ ఇచ్చిన బాణీలు, రత్న వేలు అందిచిన సినిమాటోగ్రఫీ ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. సుకుమార్ కధకు పూర్తి న్యాయం చేశారని చెప్పడంలో సందేహం లేదు. ఈ చిత్రంలోని పాటలు సినిమాకి మంచి ప్లస్. ఇంత డెప్త్ ఉన్న లవ్ స్టోరీ ని, అంతే బోల్డ్ గా తెరకెక్కించిన తీరు చూస్తే సుకుమార్ కు సినిమా పట్ల ఉన్న పాషన్ ఇట్టే అర్ధమైపోతుంది. సుకుమార్ కధకు దర్శకుడు సూర్య ప్రతాప్ పూర్తి న్యాయం చేయగలిగాడు.

ముగింపు:

తాను అనుకున్న కధను దాపరికాలు లేకుండా తెరమీదకు తెచ్చారు. అక్కడక్కడా ‘ఓవర్ ది టాప్’ అని అనిపించినప్పటికీ పాయింట్ ని స్ట్రైట్ ని ప్రేక్షకులకి తెలిపే ప్రయత్నం చేసింది టీం. బోల్డ్ గా ఉండే కొన్ని సీన్లు ఓ కేటగరీ ఆఫ్ ఆడియెన్స్ కి ఎబ్బెట్టుగా అనిపించినా….తన క్రియేటివిటీ కి ఉన్న బలాన్ని చాటి చెప్పాడు సుకుమార్. మరి ఈ సినిమాకి కమర్షియల్ పరంగా ఏ విధమైన ఆదరణ ఉంటుందో చూడాలి!.

చివరిగా: బోల్డ్ థాట్! బట్ స్పెల్ బౌన్డింగ్!

రేటింగ్: 3.25/5

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com