ఏపీ రాజధాని చాలా డైనమిక్‌ గురూ..!

ఆంధ్ర ప్రదేశ్ నూతన రాజధాని అమరావతి 21వ శతాబ్దపు ప్రజా రాజధానిగా… ఓ డైనమిక్ సిటీ గా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.

సోమవారం సింగపూర్ మంత్రి ఈశ్వరన్ రాజధాని మాస్టర్ ప్లాన్ ను చంద్రబాబుకు అందజేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ…ఆంధ్రప్రదేశ్ నూతన రాజ ధాని అభివృద్ధిలో సింగపూర్ భాగస్వామ్యమైనందుకు సంతోషంగా ఉందని…జూలై 15 నాటికి సీడ్ కేపిటల్ మాస్టర్ ప్లాన్ అనగా ముఖ్యమైన ప్రభుత్వ నిర్మాణాలు ఉండే ప్రాంతం ను సింగపూర్ ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు.

జూన్ 6న భూమిపూజ చేసి విజయదశమి నుంచి రాజధాని నిర్మాణ పనులు మొదలు పెడతామని చంద్రబాబు తెలిపారు. రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ తోపాటు సింగపూర్ ప్రభుత్వాన్ని కూడా ఆ హ్వానిస్తామని చెప్పారు.

మొత్తానికి రాజధాని నిర్మాణ కార్యక్రమాలు మొదలయ్యే దశ దగ్గరలోకి రావడం వల్ల… అడ్డగోలు రాష్ట్ర విభజనతో దగాకి గురయ్యామని వేదనలో ఉన్న ఏపీ ప్రజలకు ఎంతో కొంత భవష్యత్తు మీద భరోసాకలిగే అవకాశం ఉందని చెప్పవచ్చు. 

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com