దాల్మియా వారసుడు గంగూలీ యే

క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) అధ్యక్షుడి గా అందరూ ఊహించినట్లే భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఎన్నికయ్యారు. బిసిసిఐ అధ్యక్షుడు జగన్ మోహన్ దాల్మియా మృతి తో క్యాబ్ అధ్యక్ష పదవి ఖాళీ అయిన విషయం తెల్సిందే. క్యాబ్ అధ్యక్ష పదవి కోసం తృణమూల్ కాంగ్రెస్ నేతలు అరూప్ బిస్వాల్, సుబ్రతా ముఖర్జీ తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ, ఫలితం లేకుండా పోయింది.

క్యాబ్ అధ్యక్ష పదవి కి గంగూలీ పేరు ఖరారు చేస్తున్నట్లు  ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. క్యాబ్ లో సంయుక్త కార్యదర్శిగా కొనసాగుతున్న గంగూలీ, క్రికెట్ నుంచి రిటైర్ అయిన తరువాత క్యాబ్ కార్యవర్గం లో అడుగు పెట్టాడు. దాల్మియా అండ దండలతో క్యాబ్ లో ఒకొక్క మెట్టు ఎదుగుతూ వచ్చిన గంగూలీ ఆయన స్థానాన్ని భర్తీ చేసేందుకు సిద్ధమయ్యాడు.

క్యాబ్ అధ్యక్షునిగా ఎన్నికయిన తరువాత గంగూలీ మీడియా తో మాట్లాడుతూ తనపై నమ్మకం  ఎంతో పెద్ద భారాన్ని ఉంచిన సహచరులకు కృతజ్ఞతలని చెప్పాడు. క్యాబ్ అధ్యక్షునిగా సమర్ధవంతంగా సేవలు అందించేందుకు కృషి చేస్తానని అన్నాడు. 

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com