ముందే ఫినిష్ చేసే పని లో పవన్ …

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమా షూటింగ్   ముందు నిర్ణయించిన సమయం కంటే ముందుగానే పూర్తి చేయాలని పవర్ స్టార్ భావిస్తున్నాడట. తొలుత ఈ సినిమా ను సంక్రాంతికి రిలీజ్ చేయాలని భావించారు.

అయితే సకాలం లో సినిమా సెట్స్ పైకి వెళ్లక పోవడం, సినిమా నుంచి అర్ధాంతరంగా సినిమాటోగ్రాఫర్ తప్పుకోవడం తో, ఈ సినిమా ను వేసవి సెలవుల్లో రిలీజ్ చేయాలని నిర్ణయించారు. అయితే ఇప్పుడు అంతకంటే ముందుగానే షూటింగ్ ఫినిష్ చేసే పని లో పవన్ కళ్యాణ్ ఉన్నట్లు తెలుస్తోంది.

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధులను పోటీ కి పెట్టాలని భావిస్తున్న పవర్ స్టార్, వారి తరుపున ప్రచారం నిర్వహించడానికి  వీలుగా అనుకున్న సమయం కంటే ముందుగానే సినిమా షూటింగ్ పినిష్ చేసే పనిలో బిజీ ఉన్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు తెలిపాయి.

అత్తారింటికి  దారేది సినిమా తరువాత గోపాల గోపాల సినిమా లో ప్రత్యేక పాత్ర లో నటించిన పవన్, సుదీర్ఘ విరామం తరువాత ప్రారంభించిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.  

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com