సోషల్ మీడియాలో ‘నెంబర్ 1’ ర్యాంక్ సాధించిన ‘సర్ధార్ గబ్బర్ సింగ్’

Powerstar Pawan Kalyan undoubtedly has one of the most loyal admirers in South cinema. According to social media trending analysis report, Pawan Kalyan’s ‘Sardaar’ first look poster was at rank number one in trending on social media site Twitter.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్ట్ 15న ఆ సినిమా యూనిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమా పోస్టర్ విడుదల ముందునుంచే మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ స్పష్టమైన లుక్ తో కనబడబోతున్నాడు అన్న సమాచారాన్ని మేకర్స్ విడుదల చేయడం ఒక కారణం అయితే ( ఎందుకంటే అంతకు ముందు రిలీజ్ చేసిన పోస్టర్ లో పవన్ అప్పియరెన్స్ స్పష్టంగా లేదు), తన అభిమాన హీరో సినిమాకోసం ఎప్పటినుంచో నిరీక్షిస్తున్న ఫ్యాన్స్ మరో కారణం.

ఇవన్నీ కలిపి పవన్ కళ్యాణ్ ‘సర్దార్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ని సోషల్ మీడియాలో నంబర్ వన్ గా నిలిపాయి. ఈ పోస్టర్ రిలీజవుతుంది అనగా ఆగష్టు 14 రాత్రి నుంచే సోషల్ మీడియా ట్విట్టర్ లో ఇండియాలో నంబర్ వన్ ట్రెన్డింగ్ స్థానాన్ని సంపాదించుకుంది ‘సర్దార్’ పోస్టర్. అంతేకాదు ఆ తరువాత దాదాపు రెండురోజులపాటు టాప్ ఐదు స్థానాల ట్రెన్డింగ్ లో నిలచింది సర్దార్.

ఈ ట్రెండింగ్ చూసి ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉన్న పలు రాజకీయ, వ్యాపార, సినీ ప్రముఖులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఒక్క ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ కే ఇంత క్రేజా అంటూ….పవన్ స్టామినాను కొనియాడారు. మామూలుగా బాలీవుడ్ పెద్ద హీరోల సినిమా ట్రైలర్స్ కే ఈ నెంబర్ వన్ ట్రెండింగ్ వస్తుంది. అలాంటిది ఓ ఫస్ట్ లుక్ పోస్టర్ కి రావడమనేది అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. పలువురు ఈ ట్రెండింగ్ మీద ట్విట్టర్ లో పోస్ట్ చేసి మరీ ఆనందాన్ని పంచుకున్నారు.

మొత్తానికి దేశవ్యాప్తంగా పవన్ స్టార్ స్టామినా మరోసారి నిరూపితమయింది. మరి ఈ వార్త పవన్ అభిమానులకు తెలుసో లేదో…తెలవకపోతే ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి.

 

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com