పవర్ స్టార్ ను డైరెక్ట్ చేసే చాన్స్ కొట్టేసినట్టే…ఈ స్టోరీ చదవాల్సిందే!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సినిమా రూపొందించాలన్న సంపత్ నంది కోరిక త్వరలో నెరవేరనుంది. సంపత్ కు సర్దార్ గబ్బర్ సింగ్ డైరెక్ట్ చేసే అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. అయినా నిరాశ పడకుండా, పవర్ స్టార్ కోసం రాసుకున్న కథ తో, రవితేజ హీరోగా బెంగాల్ టైగర్ సినిమా తీసి హిట్ కొట్టాడు.

sampath nandi to direct pawan kalyan  పవర్ స్టార్ ను డైరెక్ట్ చేసే చాన్స్ కొట్టేసినట్టే…ఈ స్టోరీ చదవాల్సిందే!! sampath nandi to direct pawan kalyan e1450922853534 350x175

దాసరి సినిమా దర్శకుడు సంపత్
పవన్ హీరోగా ఒక సినిమా నిర్మిస్తానని దర్శకరత్న దాసరి నారాయణరావు గతం లో ప్రకటించాడు. దానికి పవన్ కూడా ఓకే చెప్పాడు. ఇప్పుడు అందరూ ఆ సినిమా గురించి మర్చిపోయారు. ఎందుకంటే దాసరి సినిమా అయితే నిర్మిస్తానని చెప్పాడు కానీ దర్శకుడు ఎవరు, కథేంటో చెప్పలేదు.

బెంగాల్ టైగర్ చూసిన దాసరి
సంపత్ రూపొందించిన బెంగాల్ టైగర్ చూసిన దాసరి, సంపత్ మాస్ పల్స్ క్యాచ్ చేసిన విధానం చూసి ముచ్చట పడిపోయాడు. తన సినిమా దర్శకత్వ బాధ్యతలను అతనికి అప్పగించాలని నిర్ణయించాడు. ఈ విషయాన్ని పవన్ కు చెబితే, పవర్ స్టార్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com