నానీకి రాజమౌళి ప్రశంస: నా జీవితమే నానీ సినిమా

Nani starer ‘Bhale Bhale Magadivoy’ is receving overwhelming response from the audience as well as film circles. After watching the flick, filmmaker S.S. Rajamouli has praised the crew and he especially loved the character played by Nani. 

లావణ్యా త్రిపాఠి – నాని హీరో హీరోయిన్ లు గా దర్శకత్వంలో శుక్రవారం విడుదల అయిన భలే భలే మగాడివోయ్ సినిమా ఫుల్ పాజిటివ్ టాక్ తో సూపర్ హిట్ గా నడుస్తోంది. ఈ సినిమా తనకి బాగా నచ్చేసింది అని చెబుతున్న రాజమౌళి ప్రివ్యూ ని ప్రసాద్ ఐమాక్స్ లో చూసి బయటకి వస్తూ మీడియా తో మాట్లాడారు.

నాని పెర్ఫామెన్స్ అద్బుతం. నవలా కథానాయకుడిలా చక్కగా నటించాడు. షోస్టాపర్గా నిలిచాడు. చక్కని ఫన్ ఫిలిమ్. లావణ్య అడోరబుల్.. అంటూ పొగిడేశాడు జక్కన్న. నానీ పాత్ర తనకి చాలా ఫన్ తెప్పించింది అని ఈ సినిమా లో నానీ పాత్రలో తనని తాను చూసుకున్నాను అని చెప్పుకొచ్చారు రాజమౌళి. ఇదివరకు తన ఇంటర్వ్యూ లలో చెప్పినట్టే రాజమౌళి కి మతిమరపు ఎక్కువట, తన భార్య కూడా ఆ విషయంలో తనని బాగా తిడుతూ ఉంటుంది అని చెప్పేవారు ఆయన. అదే క్యారెక్టర్ ని తెర మీద చూడడం రాజమౌళి కి ఆశ్చర్యం వేసిందట.ఆ తర్వాత మళ్లీ నానీని ఆకాశానికెత్తేస్తూ ఇన్నాళ్టికి మళ్లీ ట్వీటాడు రాజమౌళి. జక్కన్న పొగడ్త నానీకి బూస్ట్ లాంటిది. దేశ విదేశాల్లో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది.

ఓ పెర్ఫెక్ట్ కామెడీ రొమాంటిక్ ఎంటర్ టైనర్గా భలే భలే మగాడివోయ్ పేరు తెచ్చుకుంది. కాబట్టి హిట్టుకి ఈ పొగడ్త ఫైర్ యాడెడ్ టు ద పెట్రోల్లా పనికొస్తుందన్నమాట! నానీ తో ఇంకో సినిమా కూడా చేసే ఆలోచన లో ఉన్న జక్కన్న అది ఈగ కి సీక్వెల్ గా ఈగ 2 ఉండబోతోంది అంటున్నారు

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com