మెగా హీరో ‘లోఫర్’ వర్మ కు నచ్చలేదట!

దర్శకుడు పూరీ జగన్నాద్ తన సినిమాల కు వెరైటి  టైటిల్స్ పెట్టడం లో దిట్ట. ఇప్పటి వరకు ఆయన తన సినిమాల కు పెట్టిన టైటిల్స్ సంచలనం సృష్టించడమే కాకుండా యువతను బాగా ఆకట్టుకుంటాయి. ఇడియట్, పోకిరి సినిమా లు ఎంత హిట్ అయ్యాయో … యువత నోళ్ళ ఇప్పటికి అవినానుతున్నాయి.

తాజాగా మెగా ఫ్యామిలీ  వరుణ్ తేజ్ తో  తాను రూపొందిస్తోన్న సినిమా కు ‘లోఫర్’ అనే టైటిల్ పెట్టాడు ఈ దర్శకుడు. అయితే ఈ టైటిల్ ఆయన గురువు రామ్ గోపాల్ వర్మ కు నచ్చలేదు. వెంటనే టైటిల్ మార్చి మరొక టైటిల్ పెట్టాలని సూచించాడట. వర్మ, పూరీ మధ్య గురు, శిష్యుల సంబంధమే కాకుండా అంతకు మించిన స్నేహం కూడా ఉంది. పూరీ తాను  తీసిన ప్రతి సినిమాను వర్మకు చూపించడం  అలవాటు.

అలాగే లోఫర్ సినిమా  కూడా కొంత భాగాన్ని చూసిన వర్మ, సినిమా కు టైటిల్ యాప్ట్ గా లేదని మార్చాలని సూచించాడని  ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. తల్లి కొడుకుల అనుబంధం నేపధ్యం లో ఈ సినిమా కథాంశం  కొన సాగుతుందని తెలుస్తోంది.  అన్నట్లు నేడు పూరీ జగన్నాధ్ పుట్టిన రోజు.

పరిశ్రమ కు వచ్చి 15 ఏళ్లు పూర్తి అయిందని మీడియా తో మాట్లాడుతూ చెప్పాడు ఈ అగ్ర దర్శకుడు. ప్రతి  హిట్ సినీ పరిశ్రమ కు మేలు చేస్తుందన్న పూరీ,  బాహుబలి, శ్రీమంతుడు విజయాలు పరిశ్రమ కు ఎంతో మేలు చేశాయని అన్నాడు .

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com