బావ బాటలో సాగుతున్న రేణు దేశాయ్ – శభాష్ అంటున్న జనం

పవన్ కళ్యాణ్ కి భార్యగా ఉన్నంత కాలం పెద్దగా బయట ప్రపంచం లోకి రాని ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ ఆయన తో విడిపోయిన చాలా కొద్దికాలం తరవాత ట్విట్టర్ లో ఎకౌంటు ఏర్పాటు చేసుకుని మరీ తన భావాలను పంచుకుంటూ ఉంటారు. సామాజిక అనుసంధాన వెబ్సైటు లలో ఎల్లప్పుడూ తన ఉనికి చాటుతూ ఉండే రేణూ కొత్తగా “దానం” చేసే కార్యక్రమం మొదలు పెట్టారు.

తన బావ  మెగా స్టార్ చిరంజీవి ఐ బ్యాంక్ – బ్లడ్ బ్యాంక్ తో ఎందరో అవసరార్ధుల కష్టం తొలగించగా అదే బాట లో ఆమె ఇప్పుడు క్యాన్సర్ బాధితుల సహాయార్ధం కృషి చేస్తున్నారు. పెద్ద స్థాయి లో కాకపోయినా తన వంతుగా చిరు సాయానికి ఆమె ముందుకు రావడం మెచ్చుకో దగ్గ విషయం.

క్యాన్సర్ వ్యాధి విషయం లో ముందు నుంచే తల నీలాలు ఊడిపోతాయి, పెరిగే కొద్దీ జుట్టు ఊడిపోవడం సాధారణం. పైగా ఖీమో థరపీ లాంటివి చేసినపుడు జుట్టు పూర్తిగా పోవడం సాధారణం ఇలాంటి వారిలో జుట్టు లేక ఆత్మనూన్యత పెరుగుతూ ఉంటుంది. ఎక్కడికన్నా వెళ్ళాల్సి వచ్చినా కూడా వారు పూర్తి బాల్డ్ హెడ్ తో వెళ్ళడానికి జంకుతారు అలాంటి వారి కోసం రేణు కృతిమ విగ్గులని తయారు చెయ్యడానికి జుట్టు ఉచితంగా ఇస్తున్నారు. అలాంటి పేదల్ని – క్యాన్సర్ రోగులకు తన తలనీలాల్ని ఇచ్చేస్తానని రేణు చెబుతున్నారు. పొడవైన తల నీలాలు ఉన్న హీరోయిన్ గా ఆమె ఇప్పటికీ బాగా పాపులర్. వయసు దాటాక తల నీలాలు తీసేసి అవసరం ఉన్న వారికి ఇచ్చేస్తున్నా అంటూ ఆమె తన హెయిర్ ఫోటో కూడా పెట్టారు. తన బావ ఒక రకంగా, మాజీ భర్త ఒకరకంగా సేవ చేస్తుంటే ఆమె పరిధి లో ఆమె చేస్తున్నారు ఖచ్చితంగా మెచ్చుకుని తీరాలి.

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com