పవర్ స్టార్…ఆ వెంటనే రామ్ చరణ్…ఇద్దరూ జాతీయస్థాయి ట్రెండింగ్ లో ‘నెంబర్ వన్నే’

Mega family undoubtedly has one of the most loyal admirers in cinema world. According to social media trending analysis report,  Ram Charan starer ‘Bruce Lee’ teaser was at rank number one in trending on social media site Twitter.

బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజును పురస్కరించుకొని రామ్ చరణ్ తన తాజా చిత్రం ‘బ్రూస్ లీ’ టీజర్ ను రిలీజ్ చేసిన విషయం విదితమే.

ఈ టీజర్ ఫ్యామిలీ సెంటిమెంట్‌ ఎలెమెంట్స్ మిళితమై రావడంతో ‘బ్రూస్ లీ’ యాక్షన్ సినిమా మాత్రమే కాదు..ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు ఎంటర్తైన్మెంట్ కూడా పుష్కలంగా ఇమిడి ఉంది అని చెప్పే ప్రయత్నం చేసింది యూనిట్.

కాగా, ఈ ఫ్యామిలీ టీజర్ కు వచ్చిన రెస్పాన్స్ మాత్రం భారీ స్థాయిలోనే ఉంది. పవర్ స్టార్ పుట్టిన రోజు కానుకగా ఈ చిత్రం టీజర్ రావడం, అందులోనూ మెగా ఫ్యాన్స్ ఈ టీజర్ కోసం ఆసక్తిగా ఎదురు చూడడం, ఫిలిం సర్కిల్స్ లో ఈ సినిమా ఓ ప్రత్యేకమైన క్రేజ్ ను సంపాదించుకోవడం…ఈ అంశాలన్నీ కలపి ఈ చిత్ర టీజర్ ను జాతీయ స్థాయి సోషల్ మీడియా ట్విట్టర్ లో నెంబర్ వన్ ట్రెండింగ్ లో నిలబెట్టాయి.

పుట్టిన రోజు నాడు సోషల్ మీడియా ట్రెండింగ్ లో పవన్ నెంబర్ వన్ స్థాయిలో ఉన్న సంగతి తెలిసిందే. ఆ తరువాత కొన్ని గంటల వ్యవధిలో రామ్ చరణ్ ‘బ్రూస్ లీ’ టీజర్ ట్రెండింగ్ లో నెంబర్ వన్ ర్యాంక్ సాధించింది.

ఇద్దరు మెగా హీరోలు జాతీయ స్థాయిలో టాప్ ట్రెండింగ్ లో కొనసాగడం మెగా అభిమానులకు ఆనందదాయకమైన వార్తే..!. ఇంకెందుకు ఆలస్యం ఈ విషయం ఇప్పటివరకూ మీ దాకా రాకపోతే…షేర్ చేసుకొని ఈ ఆనందాన్ని మీ తోటి అభిమానులతో పంచుకోండి.

ఇక తాజాగా అభిమానుల కోసం మరి కొన్ని పోస్టర్ లను ‘బ్రూస్ లీ’ టీం విడుదల చేసింది. 

 

 bruce lee new posters released  పవర్ స్టార్…ఆ  వెంటనే రామ్ చరణ్…ఇద్దరూ జాతీయస్థాయి ట్రెండింగ్ లో ‘నెంబర్ వన్నే’ bruce lee new posters released

Bruce lee numbar one trending  పవర్ స్టార్…ఆ  వెంటనే రామ్ చరణ్…ఇద్దరూ జాతీయస్థాయి ట్రెండింగ్ లో ‘నెంబర్ వన్నే’ Bruce lee numbar one trending

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com