మెగా ఫ్యామిలీ లో ‘గట్స్’ ఉన్న యువ హీరో?

While addressing the audio release event of Kanche, Mega Power Star Ram Charan said, “Varun Tej has guts and that is why he chosen to act in Kanche.”

కధను ఎంపిక చేసుకోవడంలో మెగా ఫ్యామిలీ యువతరం హీరోలలో ఎవరికి ఎక్కువ గట్స్ ఉన్నాయ్? రామ్ చరణ్, అల్లు అర్జున్ కంటే ఎక్కువ గట్స్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ కు ఉన్నాయా? అంటే ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే రామ్ చరణ్ చెప్పిన మాటలను ఇక్కడ ప్రస్తావించాల్సిందే.

క్రిష్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా విడుదలకు సిద్దమవుతున్న ‘కంచె’ గురువారం ఆడియో తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ ఆడియో కార్యక్రమంలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి, నాగ బాబు, అల్లు అరవింద్,రామ్ చరణ్ తేజ్ తో పాటు కంచె యూనిట్ కూడా పాల్గొంది.

ఈ సందర్భంగా మాట్లాడిన రామ్ చరణ్…మెగా ఫ్యామిలీ లో అందగాడు వరుణ్ తేజ్ అని..అంతే కాదు మోస్ట్ గట్స్ ఉన్న హీరో అని ప్రశంసించారు. ఇలాంటి కధను ఎంచుకున్నాడంటే దానికి ఎన్నో గట్స్ కావాలని…అలాంటి గట్స్ వరుణ్ కు ఉన్నాయని అన్నారు.

కాగా, వరుణ్ ను ఇండస్ట్రీ ప్రముఖులు సిరివెన్నెల సీతారామ శాస్త్రి, అల్లు అరవింద్ కూడా రెండవ సినిమాకే ఇలాంటి కధను ఎంచుకున్నందుకుగాను అభినందించారు.

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com