ఈటీవీ వేడుకల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

ఈనాడు టెలివిజన్ కార్యకలాపాలు మొదలయ్యి ఇప్పటికీ ఇరవై సంవత్సరాలు. ఈ సందర్భంగా ఆ సంస్థ చైర్మన్ రామోజీరావు అండ్ టీం వేడుకలను నిర్వహించారు.

అయితే ఈ వేడుకల్లో ఓ విశేషం ఉంది. అదేంటంటే ఈ వేడుకలకు జనసేన పార్టీ అధినేత, ప్రముఖ సినీనటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరుకావడమే.

అదీగాక మీడియా దిగ్గజం రామోజీరావు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లు ఒకే స్టేజ్ పై దర్శనమివ్వడం మరో విశేషం. ఈ ఫోటో లు ఇప్పుడు సోషల్ నెట్వర్కింగ్ సైట్ లలో హల్ చల్ చేస్తున్నాయి.

ఈ వేడుకలకు హాజరయిన పవన్ కళ్యాణ్ ఫోటో ని చూసి, ఆయన అభిమానులూ సంబరపడుతున్నారు.

ఇక ఈ వేడుకలకు ఇండస్ట్రీ ప్రముఖులూ హాజరయ్యారు. వారిలో దర్శకరత్న దాసరి నారాయణరావు, ఎస్పీ బాలసుబ్రమణ్యం, త్రివిక్రమ్ శ్రీనివాస రావు, నరేష్ తదితరులు ఉన్నారు.

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com