పవర్ స్టార్ కోసం హరీష్ ను సిద్దం చేస్తున్న దిల్ రాజు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను మరొకసారి గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి. దిల్ రాజు తో ఒక సినిమా చేసేందుకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెల్సిందే. అయితే  పవన్ తో సినిమా నిర్మించేందుకు కథ, దర్శకుడు సిద్ధంగా లేని దిల్ రాజు ఆ బాధ్యతలను హరీష్ శంకర్ కు అప్పగించాడని చెబుతున్నారు.

పవర్ స్టార్ కోసం ఒక పవర్ ఫుల్ కథను సిద్ధం చేసే పనిలో ఉన్నాడు హరీష్ శంకర్. దాదాపు  దశాబ్ద కాలం కోసం ఒక కమర్షియల్ హిట్ కోసం ఎదురు చూసిన పవర్ స్టార్ అభిమానుల కరువు తీర్చిన దర్శకుడు హరీష్. గబ్బర్ సింగ్ సినిమా తో భారీ కమర్షియల్ హిట్ ఇచ్చిన ఈ దర్శకుడి, తన అభిమాన హీరో తో  అంతకంటే భారీ హిట్ కొట్టేందుకు దిల్ రాజు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నాడట.

ప్రస్తుతం పవర్ స్టార్ సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం లో నటిస్తున్న విషయం తెల్సిందే. వచ్చే ఏడాది వేసవి లో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి. ఆ తరువాతే దిల్ రాజు బ్యానర్ లో పవన్ నటించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. 

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com