జాతీయ స్థాయి ట్రెండింగ్ లో నెంబర్ వన్ గా నిలచిన పవన్

Powerstar Pawan Kalyan undoubtedly has one of the most loyal admirers in cinema world. According to social media trending analysis report,  “HappyBirthdayPawanKalyan” was at rank number one in trending on social media site Twitter.

జాతీయ స్థాయిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు మరో సారి మారుమ్రోగిపోయింది…అదీ సోషల్ మీడియాలో.

విషయంలోకి వెళితే…పవన్ పుట్టిన రోజును పురస్కరించుకొని ఆయనకు దేశం నలుమూల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఇక సోషల్ మీడియాలో చర్చంతా పవన్ గురించే. అదీగాక పవన్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన తాజా చిత్రం ‘సర్దార్ గబ్బర్ సింగ్’ టీజర్ ప్రేక్షకుల ముందుకు తేవడం..ఇవన్నీ కలిపి పవన్ కళ్యాణ్ ను జాతీయస్థాయి సోషల్ మీడియా ట్విట్టర్ ట్రెండింగ్ లో నంబర్ వన్ స్థానంలో నిలబెట్టాయి.

పవన్ కి సోషల్ మీడియా లో ఈ ట్రెండింగ్ కొత్తేమీ కాదు. ఇంతకముందు సర్దార్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసినప్పుడు నంబర్ వన్ ట్రెండింగ్ లో ఆ పోస్టర్ కొనసాగింది.

ఈ ట్రెండింగ్ చూసి ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉన్న పలువురు ప్రముఖులతో పాటు నెటిజన్లు కూడా పవన్ కి ఇంత క్రేజ్ ఉందా ఉంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.

మొత్తానికి జాతీయ స్థాయిలో పవన్ స్టార్ స్టామినా మరోసారి నిరూపితమయినట్టయింది. మరి ఈ సమాచారం పవన్ అభిమానులకు తెలుసో లేదో…తెలవకపోతే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి.

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com