పవన్ బర్త్ డే సాంగ్ లిరిక్స్ విడుదల: పవర్ స్టారే “నంబర్ వన్”

Powerstar Pawan Kalyan’s fan, a popular singer Baba Sehgal, is getting ready to release a cutting edge trailer of “A Power Song” at the end of this week. In the meantime,  Sehgal has unveiled a small ‘pallavi’ line of this energetic power song.  

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఆరాధించే ప్రముఖ గాయకుడు బాబా సెహగాల్ త్వరలో రాబోతున్న పవన్ పుట్టిన రోజుకు ఓ కానుకను పవర్ స్టార్ అభిమానులకు అందించబోతున్నారు.

తన అభిమానాన్ని ఓ పాట రూపంలో తీర్చిదిద్ది పవర్ స్టార్ పుట్టిన రోజు కానుకగా సెప్టెంబర్ 2న అభిమానులకోసం విడుదల చేయనున్నట్లు కూడా ప్రకటించారు సెహగల్.

ఇక ఈ పాటకు ‘ఎ పవర్ సాంగ్’ అనే పేరును కూడా ఖరారు చేశారు సెహెగాల్. కాగా ఈ పాటకు సంబంధించి తాజాగా ఓ శుభవార్తను అభిమానులతో పంచుకున్నాడు.

ఈ పాటకు సంబందించిన టీజర్ ను ఈ వారంలో విడుదల చేస్తానని ప్రకటించిన నేపధ్యంలో…దీనికి సంబంధించి పల్లవిని విడుదల చేశారు. ఈ పల్లవిలోనే తన అభిమానాన్ని దాచుకోకుండా బయటపెట్టేశాడు సెహగాల్.

పవర్ స్టార్ కొత్త సాంగ్ కోసం స్మాల్ పల్లవి మీకోసం అంటూ ట్వీట్ చేశాడు సెహెగల్. “పేరులో పవనే..తీరుచూస్తే గన్నే..క్యారక్టర్ తూకమేస్తే ఆల్వేస్ నంబర్ వన్నే,” అంటూ పల్లవిని వినిపించాడు.

ఈ పల్లవి ఎనర్జీ లెవెల్స్ ని బట్టి చూస్తే..ఇక సాంగ్ ఏ రేంజ్ లో ఉండబోతుందో అన్న ఆశక్తి అభిమానుల్లో నెలకొనడం ఖాయం.

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com