‘ఆయనంటే ప్రాణం’ అంటూ టీజర్ లోనే బాబాయ్ మీద ప్రేమను చూపించాడు రామ్ చరణ్

The team of Megapower Star Ram Charan starer ‘Bruce Lee’ has released a special teaser that involves family, love and entertainment in order to convey his love towards Powerstar Pawan Kalyan on his birthday. 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజును పురస్కరించుకొని బాబాయ్ కు ఓ తీయని అనుభూతితో కూడిన గిఫ్ట్ ఇచ్చాడు రామ్ చరణ్. అదీ తన తాజా సినిమా ‘బ్రూస్ లీ’ టీజర్ రూపంలో.

అయితే ఈ టీజర్ కు ఓ ప్రత్యేకత ఉంది. మొదటి టీజర్ లో కంప్లీట్ యాక్షన్ ఎలెమెంట్స్ ను మిళితం చేసి ప్రేక్షకుల ముందుకు తేగా..ఈ తాజా టీజర్ లో కంప్లీట్ ఫ్యామిలీ, లవ్ & ఎంటర్టైన్మెంట్ ఎలెమెంట్స్ ను జోడించి పవర్ స్టార్ పుట్టిన రోజు కానుగా మెగా అభిమానుల ముందుకు తెచ్చింది ‘బ్రూస్ లీ’ యూనిట్.

ఇక ఈ టీజర్ ను కట్ చేసిన విధానం గమనిస్తే…బాబాయ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలతో పాటు తన ప్రేమను కూడా చూపించాడు ఒకే ఒక్క డైలాగ్ ద్వారా. అదీ మనసుకు హత్తికునే రీతిలో. టీజర్ చివరిలో డైలాగ్ ‘ఆయనంటే నీకు ప్రాణం’ అని రామ్ చరణ్ తల్లి తన తండ్రి గురించి చెర్రీ తో చెప్పడం చూస్తే నే అర్ధమవుతుంది ఇది స్పెషల్ గా తన బాబాయ్ మీద ప్రేమను వ్యక్తపరచడానికి కట్ చేసిన టీజర్ అని.

ఇక ఈ టీజర్ ను చూసిన మెగా అభిమానులు తమ సంతోషాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ…మెగా ఫ్యామిలీ ఎప్పటికీ ఒక్కటే అని విశ్వసిస్తూ….పవర్ స్టార్ పుట్టిన రోజును వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ జరుపుకుంటున్నారు.

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com