మహోత్సవం ముగిసింది…నిరాశను మిగిల్చింది!

ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేక హోదా పై స్పందించేందుకు మొదటి నుంచి విముఖత వ్యక్తం చేస్తున్న కేంద్రం , కనీసం భారీ ప్యాకేజీ ప్రకటిస్తుందని ఆశించిన తెలుగు తమ్ముళ్ళకు నిరాశే ఎదురయింది. అమరావతి సమరంభం ముగిసింది కానీ వరాలిచ్చే మోడీ మాత్రం కరుణించ లేదని తమ్ముళ్ళు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

అయిన    తమ అసంతృప్తి ఎక్కడ బయటకు పోక్కనివకుండా తమ్ముళ్ళు జాగ్రత్త పడుతున్నారు. ఇక ఏపీ కి ప్యాకేజీ ప్రకటించక పోవడానికి కమల నాథులు కొత్త కారణాలు చెబుతున్నారు. బీహార్ కంటే ఏపీ కి మెరుగైన ప్యాకేజీ ఇవ్వాలని ప్రధాని భావించారని కానీ బీహార్ ఎన్నికలు ముగియక పోవడం తో ప్రకటించ లేదని అంటున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పక్కన ఉండగానే ,  ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నించే అవకాశం లేక పోలేదని,  అందుకే మోడీ జాగ్రత్త పడి ప్యాకేజీ గురించి ప్రకటించ లేదని అంటున్నారు. అయితే బీజేపి నేతలు ఎంతగా మోడీ ని సమర్ధించు కోవాలని చూసిన విపక్షాలు మాత్రం ఒంటి కాలి పై లేస్తున్నాయి.

ఆంద్ర ప్రదేశ్ ప్రజల నోట్లో మోడీ మట్టి కొట్టారని మండిపడుతున్నాయి . ప్రత్యేక హోదా పై  ప్రధాని స్పందించక పోయిన,  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  ఎందుకు అడగ లేదన్నది అర్ధం కావడం లేదని అంటున్నారు.

రాష్ట్ర ప్రయోజనాల కంటే  చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తున్నారని ధ్వజమెత్తతున్నారు.  అమరావతి శంఖుస్థాపన ద్వారా విపక్షాల నోళ్ళు మూయించాలని చూసిన చంద్రబాబు,  ప్రధాని వైఖరి వల్ల కొత్త కష్టాలు ఎదుర్కోవలసిన పరిస్థితి నెలకొందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.  

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com