పవన్ కళ్యాణ్ వచ్చే అవకాశం తక్కువే!

సినిమా ఇండస్ట్రీ లో ఇప్పుడు ప్రధానంగా నడుస్తున్న చర్చల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఒకటి.

ప్రస్తుతం రెండు సంవత్సరాల భారీ గ్యాప్ తరవాత సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ ని మొదలు పెట్టిన పవన్ కళ్యాణ్ ఇంకా ఈ సినిమా విడుదల గురించి ఓ కొలిక్కి రావడం లేదట. ‘సర్దార్’ మేకర్స్ ప్రణాళిక ప్రకారం… ఈ చిత్రం షూటింగ్‌ని వేగంగా పూర్తి చేసి సంక్రాంతికి సిద్ధం చేయాలనే దృఢ నిశ్చయంతో ఉన్నారు. కానీ ఈ చిత్రాన్ని హడావిడిగా పూర్తి చేయడానికి పవన్‌కళ్యాణ్‌ ఇష్టపడడం లేదని అంటున్నారు సినిమా యూనిట్ వారు.

దీని వెనుక ఓ బలమైన కారణమే ఉందంటున్నారు. అప్పట్లో ‘కెమెరామెన్‌ గంగతో రాంబాబు’ కూడా షూటింగ్ లో పూరీ కంగారు పెట్టడం తో త్వరత్వరగా పూర్తి చేసి విడుదల చెయ్యడం వలన…ఆ సినిమా ఆశించినంత విజయాన్ని సాదించడమే కాకుండా…కమర్షియల్ గా కూడా నిరాశనే మిగిల్చిందని…అదే తప్పు ఈ సినిమా కి జరగకూడదనే అభిప్రాయంతో ఉన్నారట పవన్.

ఎందుకంటే…సంక్రాంతికి విడుదల చెయ్యాలి అనే వంక తో హడావిడి హడావిడి గా పూర్తి చేసేస్తే సినిమా సరిగ్గా రాకపోతే ఎవరు బాధ్యులు అనే ప్రశ్న తలెత్తుతుందట పవన్ నుంచి.

అందుకే…తగినంత సమయం తీసుకొని, గబ్బర్‌సింగ్‌ రిలీజ్‌ చేసినట్టుగానే దీనిని కూడా సమ్మర్‌లో రిలీజ్‌ చేద్దామని పవన్‌ ఆలోచనగా చెబుతున్నారు. హడావిడిగా చేసి తరువాత నిరాశ చెందడం కన్నా…తగినంత సమయం తీసుకొని షూటింగ్ పూర్తిచేసి ఓ మంచి సినిమా ఇద్దాం అనేది పవన్ ప్లాన్ గా చెబుతున్నారు.

అభిమానులను, నిర్మాతను దృష్టిలో పెట్టుకొని ‘సర్దార్’ టీం ను ముందుకు నడిపిస్తున్నారట పవన్.

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com