ప్రధాన తారాగణం : పవన్ కళ్యాణ్, కాజల్ అగర్వాల్, శరద్ కేల్కర్, ఆలీ, ముఖేష్ రుషి, తనికెళ్ళ, ఊర్వసి, బ్రహ్మానందం, కబీర్ సింగ్, సంజనా తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
ఛాయాగ్రహణం: ఆర్థర్ విల్సన్
మాటలు: సాయిమాధవ్ బుర్రా
కథ-స్క్రీన్ ప్లే: పవన్ కళ్యాణ్
నిర్మాతలు: శరత్ మరార్-సునీల్ లుల్లా
దర్శకత్వం: బాబీ

“ఈ చిత్రం నా అభిమానులకు అంకితం” అనే మెసేజ్ తో దియేటర్ల లో చిత్రం మొదయిదంటేనే అర్ధమవుతుంది ఈ చిత్రాన్ని పూర్తిగా అభిమానులను దృష్టిలో పెట్టుకుని వాళ్ళని అలరించడానికి పవన్ కళ్యాణ్ భుజస్కందాలపై మోసిన చిత్రం అని. పవన్ నుంచి అభిమానులు కోరుకునేది ఏంటి?…పవన్ స్టైల్, డైలాగులు, కామెడీ టైమింగ్, చిలిపి డ్యాన్సులు తో కూడిన ఎంటర్టైన్మెంట్. ‘అభిమానులకు అంకితం’ అనే నినాదంతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ చిత్రం ఏ మేర అభిమానులను అలరించిందో తెలుస్కుందాం!…లెట్స్ మూవ్!!

కధేంటి?

తెలుగు రాష్ట్ర సరిహద్దులోని ప్రాంతం రతన్ పూర్ అనే గ్రామం. ప్రజలు, ప్రభుత్వాధికారుల నుంచి రాజకీయ నాయకుల వరకూ ఆ ప్రాంత రాజవంశీకుల కనుసన్నల్లోనే నడుస్తుంటారు. ఎందుకంటే రాజరికపు వ్యవస్థ పాలనలో ఉంటుంది ఆ ప్రాంతం. రాజుగారు చనిపోవడంతో ఆ వంశానికి చెందిన మూడు కుటుంబాలు ఆస్తులు, అధికారం కోసం పోటీపడతాయి. ఆర్షి తన తండ్రి ఆస్తులను అమ్మి తన తండ్రి ఆశయం మేర సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ ఉంటుంది.

దుర్మార్గుడైన భైరవ్ సింగ్ (శరద్ కేల్కర్) ఆ ప్రాంత ప్రజలను బయపెట్టి తన వ్యాపారం చేస్తుంటాడు. ఈ క్రమంలో భైరవ్ కన్ను ఆమె మీద కూడా పడుతుంది. దీంతో రాజకుటుంబానికి విధేయుడైన హరినారాయణ (ముఖేష్ రుషి) ఆర్షిని కాపాడటానికి సర్దార్ గబ్బర్ సింగ్ (పవన్ కళ్యాణ్)ను రప్పిస్తాడు. ఆ తర్వాత భైరవ్ కు పక్కలో బల్లెం లాగా తయారవుతాడు సర్దార్. ఆర్షికి సర్దార్ దగ్గరవడం మరింత చిర్రెట్టిస్తుంది భైరవ్ కి. ఈ క్రమంలో రసవత్తరంగా సాగేదే మిగతా కధ.

ఎవరెలా?

పవన్..పవన్..పవన్. అభిమానులకు ట్రీట్ ఇవ్వాలి అనే కాన్సెప్ట్ ని మైండ్ లో పెట్టుకొని ఆయన కనిపించే ప్రతి ఫ్రేం లోనూ అభిమానులకు ఉల్లాసం కలిగించే విధంగా తన హావభావాలను మలచుకున్నారు. డైలాగులు, యాక్షన్, డ్యాన్సులు, ఫైట్ లతో ‘ఎనర్జిటిక్’ పెర్ఫార్మెన్స్ ను అందించారు పవన్.

యువరాణి పాత్రలో కాజల్ బాగానే మెప్పించింది. ఆమె రొమాంటిక్ సీన్ లు బాగా ఆకట్టుకున్నాయి. లక్షీరాయ్ ‘తోబ తోబ’ పాటలో కుదిపేసింది. సంజనా పాత్ర పరిమితమైనదే అయినా ఆమె వరకూ బాగానే న్యాయం చేసింది.

విలన్ పాత్రకు శరద్ కేల్కర్ బాగానే సూట్ అయ్యాడు. ముఖ్యంగా అప్పియరెన్స్ బాగా ఆకట్టుకుంది. విలన్ గా మంచి భవిష్యత్తు ఉంది శరద్ కు. ముఖేష్ రుషి పరవాలేదు. తనికెళ్ళ , ఊర్వసి, అలీ, పోసాని, తదితర పాత్రలు పరవాలేదు.

టెక్నికల్ టీం:

దేవిశ్రీ ప్రసాద్ సంగీతం బాగానే ఆకట్టు కుంది. తన ఎనర్జీ ని పాటల్లో చూపించాడు. నేపధ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. విల్సన్ ఫొటోగ్రఫీకి మంచి మార్కులే వేయొచ్చు. సాయిమాధవ్ బుర్రా మాటలు బాగున్నాయి. పవన్ వ్యక్తిత్వాన్ని డైలాగ్స్ రూపంలో వినిపించే ప్రయత్నం చేసి మంచి మార్కులు కొట్టేశారు. పవన్ ను దృష్టిలో పెట్టుకొని చేసిన కొరియోగ్రఫీ పనితనం చాలా బాగుందనే చెప్పాలి. నిర్మాణ విలువలలో డోకా లేదు. చాలా బాగున్నాయి.

మాస్ సినిమాలంటే తనకు ఇష్టమని దర్శకుడు బాబీ ఎందుకు చెప్పుకుంటారో ఈ సినిమా ద్వారా అర్ధమవుతుంది. అయితే దర్శకుడి ప్రతిభ ఒక్క హీరో మీదే ఫోకస్ చేయడం ద్వారా నిరూపితం కాదు. కధను సమపాళ్ళలో కనెక్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళాలి. ఆ విషయంలో బాబీ నిరాశ పరిచారు. కధలో పట్టున్నప్పటికీ స్క్రీన్ ప్లే లో ఎక్జైట్మెంట్ ను క్రియేట్ చేయలేకపోయారు పవన్. కొన్ని సీన్లను మరీ సాగదీశారు.

పాజిటివ్ పాయింట్స్ :
పవన్ కళ్యాణ్ డైలాగులు, కామెడీ టైమింగ్ & డ్యాన్స్
యాక్షన్ సీన్స్
సంగీతం

నెగిటివ్ పాయింట్స్ :

లవ్ ట్రాక్

స్క్రీన్ ప్లే

దర్శకత్వం

ముగింపు:

అభిమాలకు బాగా కనెక్ట్ అయ్యే మాస్ మసాల చిత్రం ‘సర్దార్ గబ్బర్ సింగ్’. కధ బ్యాక్గ్రౌండ్ లో పట్టున్నా కనెక్ట్ చేసిన విధానమే కరెక్ట్ గా అనిపించలేదు. అయినా ‘ఈ చిత్రం నా అభిమానులకు అంకితం’ అని చెప్పిన తరువాత అభిమానులకు కావలసింది లాజిక్కులు, ఫ్యాంటసీలు కాదు. ఓన్లీ ‘పవర్ ప్యాక్డ్’ పెర్ఫార్మెన్స్. అది మాత్రం ఈ చిత్రంలో ఫుల్. ఫ్యాన్స్ కి కావాల్సినవి దండిగా వడ్డించారు ఈ చిత్రంలో.

చివరిగా: ‘సర్దార్’ ను దింపింది అభిమానుల కోసమే!!

రేటింగ్: 3.0/5

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com