పవన్ ను డైరెక్ట్ చేసేది ఎవరో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే

Slide6  పవన్ ను డైరెక్ట్ చేసేది ఎవరో తెలియాలంటే ఈ స్టోరీ  చదవాల్సిందే Slide6

సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించే తదుపరి సినిమా ఏమిటన్న దానిపై అభిమానుల్లో ఎంతైతే,  ఆసక్తి ఉందో ఆ చిత్ర దర్శకుడు ఎవరన్నది తెలుసుకోవడాని అంతే ఆసక్తి చూపిస్తున్నారు. పవన్ తన తదుపరి సినిమా కు కొత్త దర్శకుడి కి చాన్స్ ఇస్తానని మాట ఇచ్చాడని తెలుస్తోంది.

ఎవరా దర్శకుడు ?

పవన్ డైరెక్ట్ చేయబోయే నూతన దర్శకుడు ఎవరన్న దాని గురిచి తెలుసుకునేందు అభిమానులు ఆత్రుత పడుతున్నారు. రచ్చ, ఎవడు, జులాయి, బ్రూస్ లీ సినిమా లకు డ్యాన్స్ మాస్టర్ గా పని చేసిన జానీ మాస్టర్ ఇటీవల పవర్ స్టార్ ను కలిసి ఒక కథ విన్పించినట్లు తెలుస్తోంది. కథ విన్న పవన్, జానీ కి దర్శకత్వ అవకాశాన్ని ఇచ్చేందుకు ఓకే చెప్పాడని అంటున్నారు. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా తరువాత పవన్, దర్శక రత్న దాసరి నారాయణరావు నిర్మించే సినిమా లో నటించనున్న విషయం తెల్సిందే. ఈ సినిమా ద్వారా జానీ ని దర్శకుడిగా పరిచయం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

సంపత్ నంది కి మరొకసారి నిరాశ

సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ద్వారా పవన్ ను డైరెక్ట్ చేయాలని చూసిన సంపత్ నంది, ఆ అవకాశం చేజారడం తో, పవర్ స్టార్ కోసం రాసుకున్న కథ తో రవితేజ హీరోగా బెంగాల్ టైగర్ సినిమా రూపొందించి తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. దాసరి నిర్మించే సినిమా అవకాశాన్ని పవన్ తనకు ఇస్తాడని ఆశగా ఎదురు చూస్తున్న సమయం లో జానీ పేరు తెర పైకి రావడం సంపత్ నంది కి మింగుడు పడని విషయమేనని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి.

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com