పవన్ చొరవతో భీమవరం ఘటన చల్లారింది

Following Jana Sena chief, film actor Pawan Kalyan’s appeal to his fans, the situation in Bhimavaram gets back to normal. 

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఘటనపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల తీరుపై కలత చెందిన విషయం తెలిసిందే. తన అభిమానులు ప్రతీకార దాడులకు దిగడాన్ని ఆయన జీర్ణించుకోలేక పోయారు. తాను ఇటువంటి దుందుడుకు చర్యలకు, భౌతిక దాడులకు వ్యతిరేకమని తెల్సినా తన అభిమానులు ఇతరులపై దాడి చేశారన్న విషయాన్నీ తెలుసుకున్న ఆయన వెంటనే స్పందించారు.

భీమవరం లో పవన్ పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ప్లెక్సీ ని ప్రభాస్ అభిమానులే ద్వంసం చేశారని ఆగ్రహించిన పవన్ అభిమానులు ఆయన ప్లెక్సీలను చించి వేయడం తో పాటు, ప్రైవేట్ ఆస్తులను ద్వంసం చేయడంతో దాదాపు ఐదు రోజులు పాటు భీమవరం పట్టణం లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పవన్ అభిమానులను 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, అంతకుముందు పట్టణం లో144 సెక్షన్ అమలులో ఉండగానే పవన్ అభిమానులు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది.

భవిష్యత్తు లో ఇటువంటి సంఘటనలు పునరావృత్తం కావోద్దని పేర్కొన్న పవన్, ఇరు వర్గాల వారు రాజకీయ నేతల జోక్యం తో పరిస్థితి అదుపులోకి వచ్చేందుకు కృషి చేయాలనీ సూచించడమే కాకుండా…స్థానిక ఎమ్మెల్యే, ఎంపిలతో పవన్ నేరుగా మాట్లాడి పరిస్థితి అదుపు తప్పకుండ చర్యలు తీసుకోవాలని కోరారు. పవన్ అభిమానులను అరెస్టు చేసిన నేపధ్యం లో ఒక వేళ వారిపై కేసులు నమోదైతే , వారికి బెయిల్ ఏర్పాట్లు చేయాలనీ మంత్రి కామినేని శ్రీనివాస్ ను పవన్ ఫోన్ చేసి కోరినట్లు కూడా తెలిసింది.

ఈ ఘటనపై పవన్ కలత చెందాడని తెలుసుకున్న అభిమానులు శాంతించి…ఈ ఘటనపై పశ్చాత్తాపం చెందడంతో పాటు..ఇక ముందు ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్త పడతామని మాట ఇచ్చినట్టు తెలుస్తుంది.

కాగా..పవన్ కళ్యాణ్, ప్రభాస్ అభిమానుల జరిగిన తలెత్తిన వివాదాన్ని కొంతమంది కులాల ఘర్షణగా మార్చే ప్రయత్నం చేయడం పై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి తెలుగు చిత్ర పరిశ్రమ లో అనేక మంది సినీ హీరోలు ఉన్నారని, వారికి అభిమానులు సైతం పెద్ద సంఖ్యలో ఉన్నారని, మిగతా ప్రాంతాలతో పోలిస్తే స్థానికులకు సినీ హీరోల పట్ల అభిమానం కాస్త మెండుగానే ఉంటుందని చెబుతున్నారు. ఆ అభిమానం తోనే తమ అభిమాన హీరో ప్లెక్సీ ద్వంసం చేశారని ఆగ్రహించి పవన్ కళ్యాణ్ అభిమానులు కాసింత అతిగా ప్రవర్తిస్తే ప్రవర్తించి ఉండవచ్చు గాని , ఈ ఘర్షణ ను రెండు కులాల మధ్య ఆధిపత్య పోరాటం అన్నట్లు చిత్రీకరించే ప్రయత్నం చేయడం దారుణమన్న వ్యాఖ్యలు వినిపిస్తిన్నాయి.

ఏదైతేనేం..మొత్తమ్మీద పవన్ చొరవ మేరకు ఈ వివాదం సద్దుమణిగింది. వేరే హీరోల అభిమానులతో కూడా స్నేహపూర్వక భావంతో మెలిగి ఆదర్శంగా నిలబడే ప్రయత్నం చేయండి అభిమానులూ..!. అదే మీ హీరోకు మీరిచ్చే నిజమైన బహుమానం.

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com