అకీరా ఫెర్ఫామెన్స్ అదుర్స్ .. ముచ్చట పడిన పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంతటి స్టార్ అయిన, తాను ఒక సాధారణ తండ్రినే నని నిరూపించుకున్నాడు. అందరి తల్లి, తండ్రుల మాదిరిగానే తన కుమారుడు చేసే డ్యాన్స్ చూసి మురిసి పోతూ తన సెల్ ఫోన్ లో, ఆ దృశ్యాలు బంధించేందుకు ఆరాట పడ్డాడు. ఇంతకూ అసలు విషయం ఏమిటంటే కొడుకు అకీరా, కూతురు ఆద్య లను చూసేందుకు పవన్ ఇటీవల పూణే వెళ్ళాడు. అదే సమయం లో అకీరా చదివే స్కూల్ లో క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి. ఆ వేడుకలకు హాజరయిన పవర్ స్టార్ తన తోటి చిన్నారులతో కలిసి, క్రిస్మస్ వేడుకల్లో కొడుకు అకీరా చేసిన సందడి చూసి మురిసి పోయిన పవన్ ఆ దృశ్యాలను సెల్ ఫోన్ లో బంధించేందుకు ఆరాట పడ్డాడు. ఈ విషయాన్ని పవన్ మాజీ భార్య, అకీరా తల్లి రేణు దేశాయి ట్విట్ట ర్ ఒక పోటో పోస్టు చేస్తూ  తెలిపింది.

పిల్లలంటే ప్రాణం

పవర్ స్టార్ కు అకీరా , ఆద్య అంటే ఎంతో ఇష్టం. అందుకే సమయం చిక్కినప్పుడల్లా వారిని చూసేందుకు పూణే వెళ్తుంటాడు. తనకు సమయం చిక్కకపోతే వారిని హైదరాబాద్ కు పిలిపించుకుని పిల్లలతో సరదాగా గడుపుతుంటాడు. పవన్ ఎంత సెలబ్రేటి అయిన  పిల్లల కోసం సమయాన్ని వెచ్చించెందుకే ఎక్కువ ఇష్టపడుతుంటాడని సన్నిహితులు చెబుతుంటారు.

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com