పవన్ ని తిడితే ఉన్న స్టేటస్ కూడా పోద్ది

బీజీపీ-టీడీపీ కూటమికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిశ్వార్ధంగా ఎన్నికల్లో మద్దతు తెలిపి అధికారంలోకి తెస్తే…ఇప్పుడు వాడుకొని వదిలేసే రాజకీయాలు టీడీపీ చేస్తుందని సోషల్ మీడియా లో నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.

ఇక రోజు రోజుకి టీడీపీ కి విమర్శలు, పవన్ కి మద్దతు పెరుగుతుందని సోషల్ మీడియా లో విధ్యావంతుల స్పందన చెప్పకనే చెబుతుంది. టీడీపీ తన సొంత మీడియా తో పవన్ పై విష ప్రచారానికి పూనుకోవడం కూడా నెటిజన్లకు ఆగ్రహాన్ని తెప్పిస్తుంది.

ఇక ఇదంతా ఓ ఎత్తు అయితే…కొంత మంది టాలీవుడ్ సెలబ్రిటీ లు కూడా పవన్ కు మద్దతుగా నిలుస్తున్నారు. తమ అభిప్రాయాలని ట్విట్టర్ లో నిస్సందేహంగా తెలుపుతున్నారు.

ఈ కోవలో టాలీవుడ్ ప్రముఖ మాటల రచయిత కోన వెంకట్ ఒకరిగా చెప్పుకోవచ్చు. ఆయన తాజాగా ట్వీట్ లు పవన్ కు సమాజం పట్ల ఉన్న చిద్దసుద్దిని చెప్పకనే చెబుతున్నాయి.

పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ ప్రసంగం చూసిన తరువాత పవన్ మీద అభిమానం, గౌరవం పదిరెట్లు పెరిగిందని కోన వెంకట్ పేర్కొన్నారు. ఇక పవన్ మీద విమర్శలు చేసిన ఎంపీ లకూ చురకలంటించారు. “ప్రశ్న కి ప్రశ్న సమధానం ఐతే చివరికి అందరూ ప్రశ్నలుగా మిగిలిపోతారు” అని ట్వీట్ చేశారు కోన.

నన్ను తిడితే ‘SPECIAL STATUS’ రాదు అన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను సపోర్ట్ చేస్తూ “పైగా ఉన్న స్టేటస్ (వ్యక్తిగత) కూడా పోయే అవకాశం కుడా ఉంది” అని కోన టీడీపీ ఎంపీలకు చురకలంటించారు.

మొత్తం మీద పవన్ కి తెలుగు మీడియా సపోర్ట్ లేకపోయినా (ఎందుకంటే దాదాపు అన్ని చానెళ్ళు ఏదో ఒక పార్టీ నీడలో నడిచేవే కాబట్టి) సోషల్ మీడియా లో మద్దతు బాగానే లభిస్తుంది.

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com