సినీ ‘మా’ కి సీన్ ఇంతేనా?

గత వారం రోజులుగా రాజకీయాలను తలపించే విమర్శనాస్త్రాలతో ఉత్కంఠ భరితంగా మారిన మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్ (మా) ఎన్నికలు ఆదివారం ముగిశాయి.

ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 2 గంటలకు ముగిసింది. మొత్తం 702మంది ఓటర్లకు గాను 394మంది సభ్యులు మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంటే కేవలం 57 శాతం మంది సభ్యులు మాత్రం తమ ఓటును వినియోగించుకున్నారు.

ఈ ఎన్నికల ఫలితాలను మాత్రం కోర్టు తీర్పు వెలువడిన తర్వాతనే వెల్లడించాలని ఆదేశాలు జారీ కావడంతో ఫలితాలు కోసం కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే…’మా’ లో ఉన్న సభ్యులే కేవలం 702 మంది అయితే…వాళ్ళలో ఓటును వినియోగించు కుంది 394 మంది సభ్యులే కావడం విశేషం.

ఆర్టిస్టుల సమస్యలు, సంక్షేమమే ప్రధాన ధ్యేయమని చెప్పుకునే ‘మా’ కి ఆర్టిస్తుల్లో ఉన్న ప్రాధాన్యత ఇంతేనా అన్న అనుమానం ఓట్లు నమోదు అయిన సంఖ్యను బట్టి ప్రస్పుటంగా అర్ధమవుతుంది.

సభ్యులు పెద్ద మొత్తంలో అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి ఓటు వేయక పోవడానికి కారణాలు ఏమిటీ?… ‘మా’ మీద నమ్మకం లేకపోవడమా?….’మా’ పెద్దలు అనుసరిస్తున్న తీరులో లోపమా?… లేక ఇండస్ట్రీ లో అంతర్గత కలహాలకు నిదర్శనమా?…ఇలా ఎన్నో ప్రశ్నలు గత వారం రోజులుగా గమనిస్తున్న సగటు ప్రేక్షకుడి మదిలో పరుగెడుతున్న ప్రశ్నలు.

మేమంతా ఒక్కటే అని బయటకు చెప్పుకున్నా… లోపల మాత్రం వర్గ పోరు, కుల పోరు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్యానల్ లలో ఉన్న సభ్యులను బట్టి ప్రేక్షకుడికి మాత్రం సంపూర్ణంగా అర్ధమయింది.

సినీ ‘మా’ కలికాలం అనే ఇదేనేమో… ఇంకా తెలుగు ప్రేక్షకుడు ఎన్నెన్ని విపత్కారాలు చూడాలో?..

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com