అవిశ్వాసం వారి హక్కు…అడ్డుకోవడం భావ్యం కాదు

స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టడం, పెట్టక పోవడం సభ్యుల హక్కని ఆంధ్ర ప్రదేశ్ శాసనసభా పతి కోడెల శివప్రసాదరావు తెలిపారు . అయితే సభ కార్యకలాపాలను అడ్డుకోవడం సభ్యులకు సమంజసం కాదని అన్నారు.. అసెంబ్లీ లో ఈ నెల 18 వ తేదీన జరిగిన గలాటా దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో ఎలా వచ్చాయో తనకు తెలియదన్నారు. ఇది ఎవరు చేసిన తప్పేనని, విచారణకు ఆదేశించ నున్నట్లు తెలిపారు.

నేను రిలీజ్ చేయమనలేదు

ప్రతిపక్ష సభ్యులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు, అధికార పార్టీ సభ్యులను అసభ్య పదజాలం దూషించిన వీడియో ఫుటేజి ని అధికార పార్టీ ని రిలీజ్ చేయమని తాను చెప్పలేదని కోడెల అన్నారు . ఈ నెల 18 వ తేదీన సభ లో గలాటా జరిగిన సంఘటన తాలుకు వీడియో ఫుటేజి కావాలని తెలుగుదేశం పార్టీ సభ్యులు అడిగితే, సభలోని అన్ని పార్టీలను పిలిచి చర్చించానని చెప్పారు.

పూర్తి ప్రొసీ డింగ్స్ కావాలన్నారు ..ఇచ్చాను

ఈ నెల 18 వ తేదీన జరిగిన సభా సమావేశాల పూర్తి దృశ్యాలు కావాలని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కోరితే వారికి ఇచ్చానని, అలాగే టిడిపి వారు కోరిన వీడియో ఫుటేజి ఇవ్వడం జరిగిందని అన్నారు. అయితే మీడియా కు ఇవ్వాలని కానీ ఇవ్వొద్దని కానీ చెప్పలేదన్నారు. పార్టీ సభ్యులు అడిగి తీసుకున్న తరువాత వారు ఏమి చేశారన్నది వారి ఇష్టమని చెప్పారు.

మేము  అడిగితే ఇవ్వలేదు

ఈ నెల 18 వ తేదీ సభా కార్యకలాపాల దృశ్యాలను ఇవ్వాలని తాము కోరితే, స్పీకర్ ఇవ్వలేదని ప్రతిపక్ష సభ్యురాలు రోజా అన్నారు. అధికార పార్టీ నేతలు కేవలం పోడియం వద్ద జరిగిన గలాటా వీడియో ఫూటేజ్ రిలీజ్ చేసి ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. అధికార పార్టీ సభ్యులు వ్యక్తిగత దూషణ కు దిగడం వల్లే తాము స్పందించాల్సి వచ్చిందని అన్నారు. అయినా స్పీకర్ ఆధీనం లో ఉండాల్సిన వీడియో ఫుటేజ్ మీడియా కి రిలీజ్ చేసే అధికారం టిడిపి నేతలకు ఎవరు ఇచ్చారో చెప్పాలని రోజా ప్రశ్నించారు.

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com