కేసీఆర్ “చండీ యాగం” షురూ

మెదక్ జిల్లా ఎర్రవల్లి లోని తమ వ్యవసాయ క్షేత్రం లో లోక కళ్యాణార్ధం ముఖ్యమంత్రి కెసిఆర్ దంపతులు చేపట్టిన అయుత చండీ యాగం ప్రారంభమయింది. అయుత చండీ యాగం లో గవర్నర్ నరసింహన్ , ముఖ్యమంత్రి దంపతులు పూజ లో పాల్గొన్నారు. తొలుత గణపతి మహా పూజ, మహా సంకల్పం నిర్వహించారు. మహిళలు సామూహిక కుంకుమార్చన కార్యక్రమం లో పాల్గొన్నారు. అయుత చండీ యాగం నిర్వహణ తో ఎర్రవెల్లి గ్రామం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

ప్రముఖుల రాక … భారీ బందోబస్తు

యాగం లో పాల్గొనేందుకు పెద్ద సంఖ్య లో ఆధ్యాత్మిక వేత్తలు, ప్రముఖుల ఎర్రవెల్లి గ్రామానికి విచ్చేశారు. దీనితో గ్రామం లో సందడి వాతావరణం నెలకొంది. అయుత చండీ యాగం లో పాల్గొనేందుకు ప్రముఖులు విచ్చేస్తుండడం తో, యాగశాల నుంచి ఐదు కిమీ మేర పోలీసులు తమ ఆధీనం లోకి తీసుకుని సిసి కెమెరా లతో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా దాదాపు మూడు వేల కు పైచిలుకు మంది పోలీసులు బందోబస్తు విధులు నిర్వహిస్తున్నారు.

అధికార దుర్వినియోగం

రాజ్యాంగ హోదా లో ఉండి ముఖ్యమంత్రి కెసిఆర్ అయుత చండీ యాగం పేరుతో తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని వామపక్ష నేతలు విరుచుకుపడుతున్నారు. హిందూ రాజ్య స్థాపన దిశగా ముఖ్యమంత్రి కెసిఆర్ అడుగులు వేస్తున్నారని హేతువాదులు మండిపడుతున్నారు.

రైతు ఆత్మహత్య కొనసాగుతున్నాయి… 

అమరావతి శంఖుస్థాపన పేరు తో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్భాటంగా వేడుకలు నిర్వహించినందుకు ధీటుగా కెసిఆర్ అయుత చండీ యాగం చేస్తున్నారని టి -కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. అయుత చండీ యాగం పై ఉన్న శ్రద్ధ ముఖ్యమంత్రి కి రైతు సమస్యలపై లేదని విమర్శిస్తున్నారు, కెసిఆర్ అయుత చండీ యాగం చేస్తున్న రైతు ఆత్మహత్యలు మాత్రం ఆగడం లేదని ఎద్దేవా చేస్తున్నారు.

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com