కమల్ ‘చీకటి రాజ్యం’ మూవీ రివ్యూ

ముఖ్య తారాగణం: కమల్‌హాసన్‌, త్రిష, ప్రకాష్‌రాజ్‌, సంపత్‌రాజ్‌, మధుషాలిని, కిషోర్‌ తదితరులు
బ్యానర్‌: రాజ్‌ కమల్‌ ఫిలింస్‌ ఇంటర్నేషనల్‌, శ్రీ గోకులం మూవీస్‌
సంభాషణలు: అబ్బూరి రవి
ఛాయాగ్రహణం: సాను జాన్‌ వర్గీస్‌
సంగీతం: జిబ్రాన్‌
నిర్మాతలు: కమల్‌హాసన్‌, చంద్రహాసన్‌
కథనం: కమల్‌హాసన్‌
దర్శకత్వం: రాజేష్‌ ఎం. సెల్వ

ఫలితాలతో సంబంధం లేకుండా ప్రయోగాత్మకమైన చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే నటీనటులు మన దగ్గర అతి కొద్ది మందే అని చెప్పాలి. ఆ కొద్దిమందిలో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ఒకరు అని చెప్పడంలో సందేహం లేదు. ఇక తాజాగా మరో ప్రయోగాత్మక చిత్రం ‘చీకటి రాజ్యం’ తో ప్రేక్షకులముందుకు వచ్చారు కమల్. అదీగాక ఎన్నో సంవత్సరాల తరువాత కమల్ నటించిన డైరెక్ట్ తెలుగు సినిమా ఇదే. మరి కమల్ ప్రయోగం ఏ మేర ఫలించింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

కధేంటి ?

నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోలో అధికారి అయిన దివాకర్ (కమల్ హాసన్) తన కొలీగ్ మణి (యుగి సేతు)తో కలిసి ఓ గ్యాంగ్ నుంచి భారీ మొత్తంలో డ్రగ్స్ దొంగలించి ఎత్తుకెళ్తాడు. ఆ కాజేసిన డ్రగ్స్ విఠల్ రావు (ప్రకాష్ రాజ్) కు సంబందించింది. తన సొమ్మును వెనక్కు రాబట్టుకోవడం కోసం దివాకర్ కొడుకు వాసు (అమన్ అబ్దుల్లా)ను కిడ్నాప్ చేస్తాడు. ఆ తరువాత దివాకర్ తన కొడుకుని విఠల్ రావు దగ్గర నుంచి ఎలా కాపాడుకున్నాడు? ఆ క్రమంలో ఎదుర్కోవాల్సిన పరిస్థితులేంటి? ఇలాంటి అక్రమాలకు దివాకర్ ఎందుకు పాల్పడాల్సి వచ్చింది? అన్న ప్రశ్నలకు సమాధానాలు మిగతా కదాంశంలో దొరుకుతాయి.

ఎవరి నటన ఎలా?

సహజమైన పాత్రలకు తెరమీద అంతే సహజత్వంతో జీవం పోయాలంటే కమల్ హాసన్ ను మించిన వారు ఉన్నారా అంటే? లేరనే సమాధానం ఎక్కువమంది నుంచి వస్తుంది. అలాంటి పాత్రలో ఈ చిత్రంలోని పాత్రను ఒకటిగా చెప్పుకోవచ్చు. పలు సన్నివేశాల్లో కమల్ జీవించిన తీరు ప్రశంశనీయం. కత్తి పోటు బాధను అనుభవిస్తూ నటించే తీరు, దెబ్బకు డోర్ తగలగానే నొప్పి బాధను కనబర్చే తీరు….ఆయన నటనలోని మచ్చు తునకలుగా చెప్పుకోవచ్చు.

కమల్ కొడుకు పాత్రలో నటించిన అమన్ అబ్దుల్లా చిన్న వయసులోనే అభినంచదగ్గ నటనా ప్రతిభ కనబరిచాడు. ఇక త్రిష కి ఇది 50 వ చిత్రం కావడం ఓ ప్రత్యేకం. ఇక ఆమె నటనా బాగానే ఉంది. ప్రకాష్ రాజ్ విలన్ పాత్ర సరే సరి. ముఖ్యంగా హాస్యంతో కూడిన విలన్ పాత్ర కావడంతో మళ్ళీ పాత ప్రకాష్ రాజ్ ను మనముందుకు తెచ్చారనే చెప్పాలి.

ఇక మధుశాలి నిడివి కొద్దిపాటిదే అయినా న్యాయం చేసింది. మిగిలిన పాత్రలో చేసిన యుగి సేతు, సంపత్ తదితరులు తమ పరిదిమేర బాగానే చేశారు.

టెక్నికల్ టీం:

ఈ సినిమాకు వెన్నెముఖ కమల్ అయితే..కధను ఆకట్టుకునే విధంగా ముందుకు సాగించాలంటే టెక్నికల్ టీం పాత్ర ముఖ్యమైనది. ఎందుకంటే…కదాంశానికి తగ్గట్టు కెమెరా పనితనం, నేపథ్య సంగీతం రక్తి కట్టించాలి కాబట్టి. ఈ విషయంలో సానూ వర్గీస్, జిబ్రాన్‌ల పనితతనం అభినందనీయం. సంభాషణలు సమకూర్చిన అబ్బూరి రవి పాత్రలకు తగ్గట్టు బాగా అల్లాడు. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అత్యంత ప్రధానం. దాన్ని కమల్ పర్ఫెక్ట్ గానే నెరవేర్చారు. ఇక దర్శకుడు తన పనితనాన్ని చూపించడంలో సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు.

ముగింపు:

ఫ్రెంచ్‌ నవల బేస్ మీద తీసిన ‘స్లీప్‌లెస్‌ నైట్‌’ ని ప్రేరణగా తీసుకొని తెరకెక్కించిన ‘చీకటి రాజ్యం’ సగటు సినిమాలకంటే భిన్నమైనది అని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే ఈ చిత్రంలో హీరొఇజమ్ ఉండదు..కేవలం కధాపరంగా నడిచే పాత్రలే కనిపిస్తాయి. కావున హాస్యానికి పెద్దగా తావు లేదు. ఇక మన కమర్షియల్ సినిమాల్లో కనిపించే ఆహ్లాదకరమైన ఫారెన్ లొకేషన్ ల అవసరం అంతకంటే లేదు. మరి కధనే భలంగా చేసుకుని తీసిన ఈ సినిమా సగటు ప్రేక్షకుడిని ఏ విధంగా మెప్పించగలదొ అన్న సందేహాలకు సమాధానాలు రాబోయే రోజుల్లో కలెక్షన్ల రూపంలో తెలుస్తుంది.

చివరిగా: ట్విస్టులు తక్కువే…కమల్ ‘హావ భావాలు’ మాత్రం పుష్కలం!

రేటింగ్: 3.0/5

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com