“జన” సేవలో ‘పవన్’ సేన..!!

 

img-20161211-wa0030 "జన" సేవలో 'పవన్' సేన..!! “జన” సేవలో ‘పవన్’ సేన..!! IMG 20161211 WA0030

వారాంత‌పు సెల‌వులు వ‌స్తే.. ఫ్రెండ్స్‌తో క‌లిసి ఎంజాయ్ చేయ‌డం., ఏ మూవీకో, హాలిడే స్పాట్‌కో వెల్ల‌డమో చేసే యువ‌త‌లో అనూహ్య మార్పుకు ఓ తాజా నిదర్శనం. “పవనిజం” పేరుతో పవన్ కళ్యాణ్ అభిమానులు చేస్తున్న సేవా కార్యక్రమాలు వారిని అభినందించేలా చేస్తున్నాయి.

img-20161211-wa0029 "జన" సేవలో 'పవన్' సేన..!! “జన” సేవలో ‘పవన్’ సేన..!! IMG 20161211 WA0029

ఏ మాత్రం అవ‌కాశం దొరికినా పవన్ కళ్యాణ్ పిలుపుమేర సేవా కార్య‌క్ర‌మాలలో పాల్గొంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. న‌లుగురు క‌లిసి త‌లో చెయ్యి వేయ‌డం., పేద‌ల‌కు సాయం చేయ‌డం వంటి కార్య‌క్ర‌మాల‌కు ప్రాధాన్య‌త ఇస్తోంది.. జ‌న‌సేనాని వీరిలో నింపిన స్ఫూర్తిని కూడా ఇక్కడ అభినందించకుండా ఉండలేం. తాను ఆచ‌రించిన ధ‌ర్మాన్ని ప‌క్క‌వారికి చెబితే., వారూ దాన్ని పాటిస్తారు.. అదే సూత్రాన్ని జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అనుస‌రించి విజ‌య ప‌థంలో దూసుకుపోతున్నారు.

img-20161211-wa0035 "జన" సేవలో 'పవన్' సేన..!! “జన” సేవలో ‘పవన్’ సేన..!! IMG 20161211 WA0035

కుల‌,మ‌త‌, ప్రాంతీయ విబేధాల‌కు అతీతంగా సేవా ప‌ధంలో దూసుకుపోతున్న పవన్ అభిమానులు., గ‌త వారాంతంలో అనంత‌లో ద‌ళిత‌, బ‌హుజ‌నుల సేవ‌లో త‌రించింది.. సాగ‌ర్ రాయ‌ల్ ఆధ్వ‌ర్యంలో స్థానిక ఎస్సీ కాల‌నీలో ప‌వ‌న్ ద‌ళిత యువ‌సేన నిరు పేద మ‌హిళ‌ల‌కు చీర‌లు., విద్యార్ధుల‌కి పుస్తకాలు పంచారు.

img-20161211-wa0036 "జన" సేవలో 'పవన్' సేన..!! “జన” సేవలో ‘పవన్’ సేన..!! IMG 20161211 WA0036

మంచాన ప‌డిన ఓ ప‌వ‌న్ అభిమానికి దుస్తుల‌తో పాటు మందులు, వైద్యం ఖ‌ర్చుల నిమిత్తం కొంత న‌గ‌దు సాయం కూడా అందించారు.. సాటి ప‌వ‌ర్‌స్టార్ అభిమానులుగా అత‌నికి అండ‌గా ఉంటామ‌ని హామీ ఇచ్చారు.. రోజు రోజుకీ రాష్ట్ర వ్యాప్తంగా జనసేన కార్యకర్తలు చేస్తున్న సేవా కార్య‌క్ర‌మాలు విస్తృత‌మ‌వుతుండ‌డంతో…ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు.

 

 

 

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com