ప్రజల కోసం ఒకరు..పదవి కోసం మరొకరు..!!

Jana Sena Pawan Kalyan Thinks Of People, As YCP Jagan Seeks Power ప్రజల కోసం ఒకరు..పదవి కోసం మరొకరు..!! ప్రజల కోసం ఒకరు..పదవి కోసం మరొకరు..!! pawan kalyan vs ys jagan e1503782602338
Jana Sena Pawan Kalyan Thinks Of People, As YCP Jagan Seeks Power

గొంతు ఒకటే..కానీ ఆ గొంతు నుంచి వచ్చే మాట ఎంతో మందిని కదిలిస్తుంది. ఒకే ఒక్కడు..సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీలను, దశాబ్దాల కాలంగా ఏలుతున్న రాజకీయనాయకుల భవిష్యత్తును కూడా ప్రభావితం చేసే స్థాయిలో ఉండడం చాలా అరుదైన అంశం.

మరి ఇంతలా ప్రభావితం చేస్తుంది ఎవరు?..దీనికి సమాధానం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అని టక్కున చెప్పేయొచ్చు.

అనుభం లేదు.. క్యాడర్ అంతకంటే లేదు. అబ్బే ఆ పార్టీ అంటే అంటే అసలు భయపడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ మీడియా ముందు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ప్రతిపక్ష, పాలకపక్ష నేతలు పవన్ కళ్యాణ్ పై చేసే వ్యాఖ్యలు.

కానీ తెరవెనుక మాత్రం..పవన్ ఫ్యాక్టర్ ఏ మేర వారి రాజకీయ నిర్ణయాలను ప్రభావితం చేస్తుందో.. పదే పదే వారి వారి పత్రిక, మీడియా సంస్థల ద్వారా పవన్ చుట్టూ తే జరుగుతున్న చర్చలే సమాధానం ఇచ్చేస్తాయి.

వైఎస్ జగన్ కోట్లు కుమ్మరించి నియమించుకున్న ఉత్తరాది పొలిటికల్ స్ట్రాటజిస్ట్ పీకే అయితేనేమీ..పవన్ లేవనెత్తుతున్న గుండెతరుక్కుపోయే సమస్యలకు ప్రభుత్వం స్పందిస్తున్న తీరైతేనేమీ..ఇవన్నీ పవన్ ఫ్యాక్టర్ లోని ప్రధానాంశాలే.

అంతెందుకు..తాజాగా నంద్యాల ఉప ఎన్నికల్లో కూడా పవన్ చుట్టూ ఎంత రాజకీయం నడిచిందో కళ్లారా చూసాం. మా పార్టీ జనసేన తటస్థంగా ఉంటుంది అని పవన్ ప్రకటించినప్పటికీ పవన్ కళ్యాణ్ మద్దతు మాకంటే మాకంటూ ఎవరికివారే ప్రకటనలు చేసేసుకొని ఆయన అభిమానులను ఆకర్షించే పనిలో పడిన సంగతిని ఎలా మర్చిపోగలం.

పవన్ స్పందించినా, స్పందిచకపోయినా విమర్శలు చేయడానికి మేము రెడీ అంటూ ప్రో- వైసీపీ, ప్రో-టీడీపీ మీడియా చేస్తున్న రాజకీయ జిమ్మిక్కులు ఎవరికి మాత్రం తెలియదు. పవన్ ఫ్యాక్టర్ వారు ఆశించిన స్థాయిలో లేకపోతే జనసేన ప్రభావంపై పదే పదే సర్వేలు చేయిస్తూ…రిజల్టు ను కూడా మానిప్యులేట్ చేసేపనికి ఎందుకు పూనుకుంటున్నట్లు?.

పవన్ ఫ్యాక్టర్ కు ఉన్న బలమెంతో నిరూపించే అంశాల్లో ఇవి కొన్నిమాత్రమే.!! మిగిలిన పార్టీల చుట్టూ లాభాపేక్షకోరే రాజకీయనాయకులు ఉంటే..జనసేన చుట్టూ మాత్రం జనం ఉన్నారనేది ప్రతిపక్ష, పాలకపక్షం వారికి తెలుసు కాబట్టే పవన్ చుట్టూ ఇంత రాజకీయం నడుస్తుందనేది విశ్లేషకుల స్పష్టమైన భావన.

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com