చేసే ప్రతి ట్వీట్ కూడా ప్రజలకు, దేశానికి సంబంధించిందే!!

Janasena chief Pawan Kalyan talks about the true meaning of Patriotism  చేసే ప్రతి ట్వీట్ కూడా ప్రజలకు, దేశానికి సంబంధించిందే!! Pawan Kalyan to contest in GHMC  e1450569247194
Janasena chief Pawan Kalyan talks about the true meaning of Patriotism

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటివరకూ చేసిన ప్రతి ట్వీటూ కూడా దేశానికో, రాష్ట్రానికో, ప్రజలకో సంబంధించినవే కావడం అభినందించదగ్గ విషయం. ఓ సినీ నటుడిగా ఉండి కూడా తన సినిమాలకు సంబంధించి ఎటువంటి ప్రమోషన్ ను సోషల్ మీడియా ద్వారా చేసుకోకపోవడం గమనించదగ్గ విషయం.

ఇక తాజాగా స్వాతంత్ర దినోత్సవానికి సంబందించిన ఓ ప్రకటన విడుదల చేయడంతో పాటు, ట్విట్టర్ ద్వారా కూడా స్పందించారు పవన్.

71వ స్వ‌తంత్ర దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని ఆయ‌న విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌లో తొలి ప‌లుకుగా స్వ‌తంత్ర స‌మ‌ర‌యోధుల‌కి నివాళులు అర్పించారు.

భిన్న‌త్వంలో., ఏక‌త్వంగా క‌ల‌సిపోయిన వివిధ జాతులకి సంబంధించిన వ్య‌క్తుల‌కి భిన్న‌మైన ప‌ర్వ‌దినాలు ఉన్నా., యావ‌త్ భార‌త జాతికి మాత్రం ఇదొక్క‌టే పండుగ రోజ‌ని గుర్తు చేశారు.. అమ‌ర‌వీరుల త్యాగాల వ‌ల్లే గ‌త ఏడు ద‌శాబ్దాలుగా స్వేచ్చా ఫ‌లాల‌ను మ‌నం ఆస్వాధిస్తున్నామ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు..

అదే స‌మ‌యంలో దేశంలో ఆర్ధిక‌, సామాజిక అస‌మాన‌త‌లు ఇంకా తొల‌గిపోలేద‌న్న విష‌యాన్ని గుర్తు చేశారు.. స్వేచ్చా-సంప‌ద‌లు రెండూ అట్ట‌డుగు వ‌ర్గాల‌కు దూరంగానే ఉన్నాయ‌ని జ‌న‌సేనాని అభిప్రాయ‌ప‌డ్డారు.. సాంఘీక అస‌మాన‌త‌లు స‌మ‌సిపోయి., పేద‌రికం పేద‌గా మిగిలిన‌ప్పుడు మాత్ర‌మే త్యాగ‌ధ‌నుల త్యాగానికి, స్వ‌తంత్ర్యానికి అర్ధం, ప‌ర‌మార్ధం ద‌క్కుతుంద‌న్నారు.. పేద‌రికం పేద‌గా మిగ‌ల‌డం అంటే., పేద‌రికం తుడిచిపెట్టుకుపోవ‌డం అన్న‌ది ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అభిప్రాయం.. అందుకు భార‌త జాతి మొత్తం క‌ల‌సిక‌ట్టుగా కృషి చేయాల‌ని ఆయ‌న కోరారు.

71వ స్వ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్బం స్వేచ్చా భార‌తావ‌నికి జ‌న‌సేనుడు నీరాజ‌నాలు ప‌లికారు.. తెలుగు ప్ర‌జ‌ల‌తో పాటు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న భార‌తీయ‌ల‌కు త‌న త‌రుపున‌, జ‌న‌సేన పార్టీ శ్రేణుల త‌రుపున స్వ‌తంత్ర దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపారు.

Jana Sena Party chief Pawan Kalyan Conveys Wishes On Independence Day  చేసే ప్రతి ట్వీట్ కూడా ప్రజలకు, దేశానికి సంబంధించిందే!! janasena independece day wishes
Jana Sena Party chief Pawan Kalyan Conveys Wishes On Independence Day

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com