ఇంటర్నెట్ పోల్స్: బిగ్గెస్ట్ స్టార్ ఎవరూ అంటే “పవనే” నట!!

స్టార్ లకే స్టార్ పవన్ కళ్యాణ్ అంటూ ఉంటారు ఆయన అభిమానులు. దానికి కారణం….తెలుగు, తమిళ, కన్నడ సినీ పరిశ్రమల్లోని పలు స్టార్ లు పవన్ కళ్యాణ్ కు అభిమానులు కావడమే. సౌత్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా స్ట్రాంగ్ గా అభివర్ణిస్తుంటారు సినీ జనం. హిట్, ఫట్ లు ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఇసుమంత కూడా దేబ్బతీయవని…10 సంవత్సరాల వరుస ఫ్లాపులే దానికి నిదర్శనమని చెప్పుకొస్తుంటారు అభిమానులు.

ఇక పలు సంస్థలు నిర్వహించిన సర్వే లలో కూడా పవన్ కు ఉన్న స్థానం ఏంటో పలు సార్లు నిరూపితమయింది. తాజాగా సౌత్ ఇండియా కు చెందిన ఓ ట్రేడ్ ఎనాలిసిస్ సంస్థ ‘ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్’ ఎవరూ అనేదానిపైన సర్వే నిర్వహించింది. ఈ సర్వే లో పవన్ కళ్యాణ్ కే ఎక్కువ మంది ఓటేశారు. అయితే ఈ సర్వేలో సీనియర్ నటులు అమితాభ్, రజినీకాంత్, చిరు, కమల్ హాసన్, మమ్మూట్టీ లను చేర్చలేదు.

63 వేల పై చిలుకు ఓట్లు పోలయిన ఈ సర్వే లో 21 వేల మంది పవన్ కు వోటు వేసి మొదటి స్థానంలో నిలపగా…20 వేల మంది విజయ్ కు, 12 వేల మంది అజిత్ కు, 2,849 మంది ఎన్టీఆర్, 2,828 మహేష్ కు వోటు వేసి తరువాత స్థాల్లో నిలిపారు.

ఓ ప్రముఖ తమిళ ట్రేడ్ సైట్ నిర్వహించిన ఈ సర్వే లో పవన్ కళ్యాణ్ మొదటి స్థానం సంపాదించడం ఆయన అభిమానులకు సంతోషం కలిగించే విషయమే!!.

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com