Hon’ble Chief Minister Sri K. Chandrashekar Rao on Sunday ha…

Hon’ble Chief Minister Sri K. Chandrashekar Rao on Sunday has announced that very soon a comprehensive scheme for the development of dairy sector will be launched in the State to make it a “Ksheera Viplavam (Milk Revolution) in which Milk Producers (Dairy Farmers) from the Vijaya Dairy Development Society, Mulkanur Dairy Development Society, Nalgonda and Rangareddy Districts Dairy Development Societies and Karimnagar will be given top priority in the schemes to be announced.

As a prelude to the proposed Milk Revolution to be launched soon, the Chief Minister has accepted the demand of the other Dairy farmers of the Societies to give them Rs. 4 per Litre as an incentive as is done in the case of the dairy farmers of the Vijaya Dairy. The Chief Minister has also announced that the government through Dairy Development Societies would provide 50 percent subsidy for buying a Buffalo by the farmer and the subsidy would be 75 percent if the Dairy farmers happen to be from the SC/ST community. In return, the CM has asked for a favour that every farmer in his household should plant 6 saplings and name each sapling after one of their family members and take care of the plants by watering regularly. To this, the gathering of over eight thousand dairy farmers responded positively by giving a thunderous applause.

The CM assured that the Rs. 4 per Litre incentive will be implemented from September 24 onwards and the distribution of Buffaloes will commence after two months. As is done in case of Sheep distribution, the beneficiaries themselves will identify and buy the Buffaloes and subsidy will be routed through the Dairy Development Societies.

The CM has addressed a meeting of the members of the Vijaya, Mulkanur, and Nalgonda and Ranga Reddy District Dairy development societies at Pragathi Bhavan lawns. In his address to the dairy farmers, the CM made it like an interactive session often asking them questions and eliciting their response.

Referring to the milk production in the State, the CM said that all the three Dairy Development Societies put together are producing just about 7 Lakh Liters of Milk as of now. Karnataka State is supplying 6 Lakh Litres, AP, 4 Lakh Litres, and Gujarat 2 Lakh Litres to the Telangana State. The milk being produced in Telangana state is a very small percentage when compared to the demand of 1 Crore Litres. It is in this context, the CM said there is a need to have a major programme in the milk production and marketing to the level of another Milk revolution, Ksheera Viplavam or Pala Velluava (Flood of Milk) in the State. He said that he would personally formulate the scheme and assured that dairy farmers from the three Dairy Development Societies will be given top priority,” the CM said.

The CM spoke on how after formation of the state, the government had been taking measure after measure benefitting the people and welfare of all sections of the people. He also recalled how the government started schemes initially to bring the poorest of the poor from the clutches of poverty, be it Single women pension, Asara pensions, schemes for the most backward classes etc., He said the schemes and programmes are initiated one by one, taking up each and every sector of the society.

“After 60 years of relentless struggle, we have achieved our Telangana State. The aim of having a separate State is to provide development and welfare of the people. Under the united AP rule, for 60 years, God knows what they did; the Telangana region suffered the most with all untold miseries in all fronts. There is no power supply; farmers should stand in queues, often keeping their footwear as a symbol in the long queues to get the fertiliser and seeds. They were even subjected to lathi charge. The entire Telangana region was under utter chaos. When the new State is formed, we had to start everything from the scratch,” the CM said.

Recalling how the state government has planned to improve each and every sector in the State with innovative but practical schemes and programmes, the CM said though there are 35 Lakhs Yadavs and Kurumas in the State, the state was importing meat from other states. “Though there were 40 lakh Mudiraj and Bestha families in the State, daily about 40 truckloads of fish is being imported to the State. Only Hyderabad city is importing 650 truckloads of Sheep. This is the reason why we have launched and implementing Sheep Distribution Schemes for Yadavs and Kurumas at a cost of Rs. 4,000 Crore. Similarly, we are implementing distribution of fish links to Mudiraj and Bestha families. The aim is to make the State self-sufficient in its demand for meat and fish and export to other States, abroad, if need be. This is also aimed at making the Yadavs, Kurumas, Mudiraj and Bestha communities to become financially comfortable and self-sufficient” the CM said.

The CM also explained to the gathering about the reasons behind implementing the Land Records Rectification and purification Programme and how it will eradicate the endless litigation and problems pertaining to the right over the lands and how it decreases the law and order problems. The CM has urged the gathering to extend support to the programmes and enlist the support of their family members and friends. “The on-going land records Purification Programme is your work and you should help in making it successful. It is only when the land records are clean and correct, government schemes like giving Rs. 8,000 financial investment subsidy per acre per year to farmers will benefit,” the CM said.

The Chief Minister also explained how the government is providing water for irrigation, quality 24 X 7 uninterrupted power supply and fertilisers and pesticides to the farm sector. In this context, he spoke about the formation of the Farmers.

Associations (Rythu Samakhya Samithies) at the village level to ensure that the farmers got their Minimum Support Price for their produce. The CM also explained how the Mandal Level RSS will determine the MSP and only when it is agreed upon the farmers village wise should get their produce to markets. In case, MSP is not coming forth, the State Level Farmers Federation will buy the produce at the MSP and later convert it into the by-product with a license from the government and sell it later. The formation of Rythu Samakhya Samithies will solve all the problems being faced by the farmers and remove the unnecessary middlemen from the business.” the CM said. He also found fault with those politicizing the government programmes be it the distribution of Sheep, helping the weaker sections, forming of Rythu Samakhya Samithies and termed them as pointless remarks.

Earlier, Animal Husbandry Minister Sri T. Srinivas Yadav, MP Sri Gutha Sukhender Reddy, Vijaya dairy Development Corporation Chairman Sri Loka Bhooma Reddy among others addressed the gathering.

మనమందరం కూడా చాలా కష్టపడి పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. ఈ రాష్ట్రం తెచ్చుకున్నది మనం కడుక్కతాగడానికో ఎదో ఇంకో దాని కోసం కాదు. రాష్ట్రం కావాలని కోరుకున్నది ఆ రోజు మనం అన్ని రకాలుగా మన రైతులు బాగుండాలి, ప్రజలు బాగుండాలి, అన్ని వృత్తిపనులు చేసేవాళ్లు బాగుండాలని అందరు కూడా వెరసి మంచిగుండాలనే ప్రయత్నంలో తెచ్చుకున్నం. నేను నిజంగా చెప్తున్నా ఈ మాట మరి ఏ పరిపాలన అయిందో అరవై ఏండ్లు దేవుని దయవల్ల ఏ ఒక్కటి కూడా సక్కగా లేదు. మన రాష్ట్రం వచ్చిన నాటికి గవర్నమెంట్‌ వచ్చిన నాటికి చూస్తే ఎరువులు సక్కగా సరఫరా కావు. లాఠీచార్జ్‌, ఎరువుల దుకాణాల ముందట చెప్పుల లైన్లు.. విత్తనాలు యాల్లకు దొరకయి. కరెంటు వస్తదో రాదో భగవంతునికి ఎరుక. వత్తే ఏ రాత్రో వచ్చేది. ఇంత అస్తవ్యస్తమైన పరిస్థితి. ఇట్ల అనేకమైనటువంటి ఏ ఒక్క విషయం కూడా నేను చెప్తే మీకు నమ్మకం అనిపియ్యదు. కానీ నేను చెప్పినవన్ని వాస్తవలే కదా. పాల విషయానికొత్తే సిగ్గు పడాలి మనం. మీ పాల సంగతి మళ్ల చెప్తా. 30లక్షల మంది గొల్ల కుర్మలు ఉన్నారు. 30 లక్షల మంది యాదవ సోదరులు మన రాష్ట్రంలో ఉంటే మనం హైదరాబాద్‌ లో తినే మాంసానికి 650 లారీల గొర్రెలు రాజస్థాన్‌ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి మనం దిగుమతి చేస్తున్నం. సిగ్గుచేటు కదా ఇది. పరువు తక్కువ ముచ్చట కాదు. మనకు లేరా మంది అంటే పనిచేసేటోళ్లు.. పెంచేటోళ్లు ఉన్నారు. ఒక్క హైదరాబాద్‌ కే 350 లారీలు వస్తాయి ప్రతిరోజు. మరీ మనం ఏం చేస్తున్నట్టు.. ఏపీలో ఏం జరిగినట్టు.. ఇది జరిగింది. వాళ్ల కర్మానికి వాళ్లను వదిలేశారు పట్టించుకోలేదు. ఇయ్యాళ్ల మనం 7లక్షల యూనిట్లు మొదటి దశలో 84లక్షల గొర్రెలు ఆ తదనంతరం ఇంకోక మూడు లక్షలు..మొదలు నాలుగు లక్షల మందికి గొర్రెలు పంపిణీ చేసుకుంటున్నం. 19 లక్షలు దాటినయి ఇప్పటికీ. యాదవులకు డబ్బులు వస్తయి.. మన రైతులకు ఎరువు దొరుకుతది. సేంద్రీయ ఎరువు దొరుకుతది. భూమి బలం అయితది. అన్ని రకాలుగా లాభం. కానీ ఈ పనిగతంలో జరగలేదు. ఇవి తెత్తే కూడా గొర్రెల అని అంటున్నారు. తెలివితక్కువ గొర్రెలు. గొర్రెలు అవసరం లేదా.. చేపలు పట్టేటోళ్లు లేరా బెస్తోళ్లు.. ముదిరాజ్‌ లు ఉంటిరి పడుతరుకదా. చేపలు చెప్పతరంకాని గిరాకీ ఉంది. చెప్పుకుంటే అది పరువే పోతది. ఉన్నమాట చెప్తున్నా.. మన చెరువులు లేవా. ప్రాజెక్టులు, నదులు, కుంటలు లేవా.. కానీ హైదరాబాద్‌ సిటీకి రోజుకు 40లారీల చేపలు వస్తాయి ఆంధ్రకేళ్లి. రాంనగర్‌ మార్కెట్‌ ఉంటది. ఆంధ్రకెళ్లి వస్తే చేపలు తినాలా.. ఇదేనా తర్వాయి. 40 లక్షల మంది ఉన్నారు. ముదిరాజ్‌, బెస్తోళ్లు వాళ్లకు అప్పజెప్తే పనిచేయ్యరా. మంచిచేపలు దొరకయ్యా. ఆంద్రకెళ్లి బొంబాయి కెళ్లి వస్తాయి మనకు చేపలు. ఎండిపోయిన చేపలు కూడా మనకు బొంబాయి నుంచి వస్తాయి. అవి దుకాణాలకెళ్లి కొనుక్కోని తినాలి. ఈ గతి ఏంది.

పాలు, కూరగాయాలు కూడా హైదరాబాద్‌ గింతపెద్ద మార్కెట్‌ కదా.. కోటి మంది జనాభా ఉండే నగరం. హైదరాబాద్‌ చుట్టూ నూరు కిలోమీటర్లలోపల రైతు ధనవంతులుండాలి. ఎందుకు పేదరికం ఉండాలి. హైదరాబాద్‌ కు వచ్చే కూరగాయలు పదిశాతమే మనం పండిచేటివి. 90శాతం బెంగళూరు, రాయ్‌పూర్‌, ఇతర ప్రదేశాల నుంచి వస్తున్నాయి. మన రైతులు విషంతాగి సచ్చుడు, ఆత్మహత్య చేసుకునుడు, అప్పులపాలు అవుడు.. ఎందుకుండాలి ఆ పరిస్థితి.. ఇది పోవాలి. అట్లనే పాల సంగతి తెలంగాణ రాష్ట్రంలో మనం తాగే పాలు ఎన్ని తాగాళ్లో గన్ని తాగుతలేరు. ఆటానమందం కూడా లేము మనం. ఎన్ని కుటుంబాలున్నాయి కోటి మూడు లక్షల కుటుంబాలున్నాయి. ఇంటికో లీటర్‌ తాగిన కోటి మూడు లక్షల లీటర్లు కావాలి. మూడు సొసైటీలం దండోళ్లం అని మీరు అనుకుంటున్నారు కాదు.. అంతకలిపితే మీరు పోసేది ఎంత 7లక్షల లీటర్లే. అంతేకదా మీ కరీంనగర్‌, ముల్కనూరు, ఇతర సొసైటీలు కలిపితే.. మీరంతా కష్టపడి తెత్తే.. మొత్తం కలిపి మీరు పోస్తున్నది 7లక్షలే. దానికి గింత పెద్ద కథ. కోటి లీటర్లు ఎక్కడా.. 7లక్షలు ఎక్కడా మనం ఎక్కడనో ఉన్నం. గిట్లున్నది మన చరిత్ర. ఇది చేసిన పార్టీవాడే మళ్లీ ఇప్పుడు లొల్లి పెడుతున్నాడు బజార్లో. వాడు సక్కగా 7 చందమామాలు.. ఆరు సూర్యుళ్లు తెచ్చిపెడితే నేను వచ్చి ఖరాబు చేస్తున్నానట. ఈ పరిస్థితి మారాలని చెప్పి ఒక్కొక్కటిగా సదురుకుంటా పోతున్నం. ముందుగాల ఏం కావాలా.. ముసలోల్లు, భర్త చచ్చిపోయినోళ్లు, ఒంటరిస్త్రీలు.. ఆకలి చావుతో ఎవడైతే చవొద్దని చేసినం. పెన్షన్‌ వెయ్యిరూపాయలు చేసినం. పప్పు ఉప్పులతో ఎదన్నా తింటేగాని ఓ ఆదారం ఉన్నది. నయమే ఉందికదా. మునుపు నాలుగు కిలోలు ఉండేది ఇప్పుడు మనిషికి ఆరుకిలోలు చేసినం. దానితోటి కూడా కొంత బువ్వకు ఢోకాలేదు. ఎవ్వడు ఉపాసం పండకుంట అయింది. ఎరువులు యాళ్లకు తెచ్చుకుంటున్నం కదా.. మునుపటోళ్లే ఉన్నదా గోస. అందుతున్నాయి కదా. ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరుకుతున్నాయి. క్రమం తప్పకుండా ఎవరికి ఎన్ని బస్తాలు కావాలో అన్ని దొరకాలి. ఆ లైన్లు కట్టుడు.. చిట్టీలు ఇచ్చుడు. అదేందో బ్రహ్మపథార్థం. మనం పైసలు పెట్టి కోనేది కదా.. ఒకటే బస్తా రెండు రావు అంటాడు. దానికి ఇంతింత లైన్లు కట్టాలి. చెప్పుల లైన్లు పెట్టాలి. అన్నంతిన పోతే లైన్‌ లో చెప్పులు. ఇవన్ని చూసినం కదా. ఇవన్ని చేసినోళ్లు మీళ్లీ ఇప్పడు లొల్లి పెడుతున్నారు. కరెంటు నయమైంది కదా ఇప్పుడు. నేను ఏం చూస్తున్నా అంటే ముందుగాల 24గంటలు రానీ.. అది బలపడద్దా. ఎప్పుడు గిట్లనే ఉంటామా ఉండం కదా. మొన్నటిదాకా బేఖారుగ ఉన్నాం. ఇవాళ కరంటు నయం చేసుకున్నం. ఒకనిది లోతు.. మరొకనిది మీదికి ఉంటే.. నీళ్లు ఎళ్తలేవు. మొన్న నేను జిల్లాకు పోతే నా మీద పంచాయితీ పెట్టిన్రు. నిన్ను ఎవ్వడూ ఇయ్యిమన్నడు 24 గంటల కరెంటు అన్నరు. మీరే అడిగితిరి.. అంటే అట్ల కాదు మాకు 12 గంటలు ఇయ్యి చాలు అంటున్నారు. మీకు ఇంకొక మాట నాకు ధైర్యం ఎక్కువ. బొర్లు ఎత్తిపోవుడు.. కిందిమిద అవుడు ఇప్పుడుందా.. ఒక రెండేళ్లు అయితే గోదావరి నీళ్లు తెచ్చి మీ కాళ్లు కడుగుతా. వందశాతం ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే గోదావరి నీళ్లు రావాలి. వస్తున్నయి. వందశాతం రావాలి మన హక్కు అది. ఎవడో బిచ్చమిచ్చేది కాదు. అవి రావాలి తిప్పలపడుతున్నం అందరూ కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు రాత్రిపగలు పనిచేస్తున్నారు. మీ కరీంనగర్‌ జిల్లా వాళ్లకు తెలుసు.. కాళేశ్వరం పనులు మీ దగ్గరే నడుస్తున్నాయి. ఆ నీళ్లు వచ్చినయి అనుకో మన చెరువులు ఎండయి. 365 రోజులు నిండే ఉంటాయి. ఎనకట చినన్నపుడు తినలే ఎర్రరోయ్యలు. మళ్ల పుడుతాయి. చిన్నప్పుడు తిన్న జల్లె, చందమామ, చేపలు మళ్ల పుడుతయి. ఇప్పుడు మాయం అయిపోయినయి. నీళ్లు మొత్తం జాళ్లు పుట్టాలె మళ్ల. జాళ్లు పుట్టే తెలంగాణ అయితది. చిన్నచిన్నయి అన్ని సదురుకున్నం. ఎవ్వడూ సావకుండ చేసుకున్నం. మంచో చెడో కరెంటు మంచిగ చేసుకున్నం. విత్తనం, ఎరువు యాళ్లకు వచ్చేట్టు చేసుకున్నం. చెరువులు లోతు చేసుకున్నం. మిషన్‌ కాకతీయ పెట్టుకుని చెరువుల పూడికలు తీసుకుంటున్నం. తెల్లారివరకే అయితదా ఎరుపడ్డ సంసారం జల్ది అయితదా. సమయం పట్టదా కొద్దిగంత. ఇంకా కావాలి చాలా జరగాలే. చేప పిల్లలు వేసుకున్నం.. వెయ్యి కోట్లతోని మంత్రిగారు శ్రీనివాస్‌ యాదవ్‌ పట్టుబట్టి చేయిస్తున్నాడు. యాదవ సోదరులకు గొర్రెలు దండిగా ఇచ్చుకుంటున్నం. వాళ్లు డబ్బులు సంపాదించుకుంటున్నారు. గొర్రె బలిత్తే గొల్లాయనకు నయం.. నేను ఎమంటున్నా అంటే.. గొల్లాయన బల్తే తెలంగాణకు నయం అంటున్న. ఊళ్లో ఇప్పుడు పైసలు లేవు. ముసలోళ్ల దగ్గర ఉన్నాయి పైసలు. వాళ్లు మొత్తం ఖర్చు పెడుతలేరు. నాకు చెప్పిళ్లు ఇద్దరు ముగ్గురు దాసుకుంటున్నామని. ఏ ముసలిదాన్ని మాట్లాడిచ్చినా 5 లేదా 6 వేలకు తక్కువ లేవు. అత్తల మర్యాద పెరిగింది. జర బయట ఎందుకుంటవు అత్తా నా దగ్గర వచ్చి ఉండు అంటున్నారు.

మన రాష్ట్రానికి సంబంధించిన పాలు కూడా మనమే ఉత్పత్తి చేయాలి. దాని పేరు క్షీర విప్లవం అంటారు. పాలవెల్లువను క్షీరవిప్లవం అని రావాలి. రావాలంటే పనిమొదలుకావాలి. మొదలుకావాలంటే గవర్నమెంట్‌ వచ్చినంక దాని లెక్కతీత్తే అది సక్కదనం లేదు.. మొత్తం బంద్‌ అయ్యేతంటు ఉన్నది. బాధ ఎందంటే ఆరు లక్షల లీటర్లు కరీంనగర్‌ నుంచి వస్తున్నాయి. 4లక్షలు ఆంధ్రకెళ్లి, రెండు లక్షలు గుజ్‌రాత్‌కెళ్లివస్తయి. మీరు పోయ్యరా.. మనకు రైతులు లేరా. మీకు సబ్సిడీ మీద బర్రెలు కొనిత్తే మీరు పోయ్యారా. మీరు ఇయ్యాళ్ల మీరు ఒక్క పనిమీద వచ్చిన్రు. నేను రెండు పనులు చేత్తా. ఏం చేయాలంటే మొట్టమొదటి సంగతి ఇంకో విషయం కూడా చెప్పాలి. గ్రామాల్లో భూములు ఉన్నాయి. ఆ భూములయి పెద్ద కథ. భూమి ఉంటది ఒకని పేరు మీద.. దాని రాత్తడు ఇంకోడు. జుట్లు ముడెత్తరు పంచాయితీ పెడ్తరు. వీనిది వానికి.. వానిది వీనికి రాత్తరు. గట్లెట్ల అంటే ఎమన్న ఇయ్యాలే. ఈ బాధ పోవాలే అని ఇప్పుడు భూముల సర్వే గ్రామాలకు టీంలు వచ్చినయి. 80 ఏళ్ల కిందట చేసిండ్రు.. మధ్యల చేయలే. మళ్ల ఇప్పుడు చేస్తున్నం. వచ్చినోళ్లు రానోళ్లకు కూడా చెప్పాలి. అది మన పని మంది పనికాదు.. మన భూములది మన లెక్క. ఒకసారి దాని లెక్క మంచిగా తెలితే ఇప్పుడు ఎకరానికి 4వేలు పెట్టుబడి ఇద్దామనుకున్నం. మన రైతులు అప్పుల పాలు అయి ఉన్నరు. కాబట్టి ఒక ఐదారేళ్లు గోదావరి నీళ్లు తెచ్చి కడుపునిండా కరంటు ఇచ్చి ఎకరానికి 4వేలు ఏడాదికి 8వేలు పెట్టుబడి సర్కార్‌ ఇత్తే.. ఇప్పుడు రైతు పరిస్థితి ఘోరంగా ఉన్నది. వ్యవసాయం ఉండి ఉద్యోగం ఉన్నోడు మంచిగనే ఉన్నడు. వ్యవసాయం ఉండి చిన్నపాటి వ్యాపారం ఉన్నోడు మంచిగనే ఉన్నడు. అచ్చం వ్యవసాయం చేసేటోడు మంచిగలేడు. మీదికి వాడు పటేలు. అనంగానే తెల్లబట్టలు వేసుకోని తిరుగుతడు. యేనుకకు మళ్లీ చూస్తే ఏం లేదు. ఎవనికి కూడా రెండు, మూడు లక్షలకు తక్కువ లేదు అప్పు. మీకు చెప్పడు ఇజ్జత్‌ కు అంతేనా కాదా. ఆ అప్పులు కట్టి మళ్లో రెండు లక్షలు రైతు జేబులకు చిల్లరకు రావాలె.

తెలంగాణలో అప్పులు లేకుండా రైతులు బ్రతకాలి. రైతులు మంచి పంటలు వేసుకొని అప్పులు లేని రైతులుగా మారాలి. బంగారు తెలంగాణలో రైతులది కీలక పాత్ర ఉంటది. వచ్చే మే నెల నుంచి ఎకరానికి రైతు ఖాతాల్లో 8 వేలు ఇస్తం. రైతు ఖాతాలోకే నేరుగా డబ్బులు జమా చేస్తం. రైతులు పైరవీకారులను పట్టుకోని మోసపోకుండా రైతు ఖాతల్లోకే నేరుగా పైసలు జమా చేస్తం. రైతులకు ఎంత భూమి ఉన్నది అనేదానికే సమగ్ర భూ సర్వే చేపడుతున్నాం.. సమగ్ర భూ సర్వే వల్ల ప్రతి రైతుకు ఎంత భూమి ఉన్నద లేనిది తేల్తది. రైతులు ఏ అధికారులకు లంచం ఇవ్వకూడదు.. అధికారులు ఎవరు లంచం అడిగిన నాకు చెప్పండి… రైతులు అధికారులు సూచించిన పంటలనే వేసుకోవాలి. రైతులు బాగు పడాలంటే నీరు, పెట్టుబడి ముఖ్యం…ప్రాజెక్టుల ద్వార రైతుకు పొలాలకు నీరు అందిస్తం.. అలాగే బోర్లకు నిరంతర విద్యుత్ అందిస్తం. వచ్చే నెల మే నుంచి రైతులకు పెట్టుబడి ప్రభుత్వం ఇస్తది. రైతులు పండించిన పంటలకు సరైన మద్దతు ధర కల్పిస్తం. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు. రైతులు బాగు పడాలంటే రైతు సంఘాలు ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి గ్రామానికి రైతు సంఘం ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి మండలానికి రైతు సంఘం ఏర్పాటు చేస్తాం. గ్రామ సంఘంలో ప్రతి రైతు మెంబర్ పేరుగా నమోదు చేసుకోవాలి. రైతు పండించిన పంటకు ప్రభుత్వ మద్దతు ధర రైతు సంఘంలోనే నిర్ణయిస్తం. సరైన ధరకు రైతులు పంటను అమ్ముకునేలా మండల రైతు సంఘం పని చేయాలి. ప్రతి మండల కేంద్రానికి ఒక పంట కొనుగోలు కేంద్రం ఏర్పాట. ప్రభుత్వం చెప్పిన మద్దతు ధరకే కొనుగోలు అందరు రైతులు మార్కెట్ కు దాన్యం ఒకే సారి తీసుకుపోవద్దు. రైతు సంఘం సూచించిన ప్రకారం రైతులు మార్కెట్ కు ధాన్యం తరలించాలి. మన పంట మన రైతులు మన ధర అనే విధంగా రైతులు ఉండాలి. ఇప్పటి దాక దళారులది నడిచింది..ఇప్పుడు రైతులది నడవాలి. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర రైతు సంఘం ఉంటది. దాన్యం కొనుగోలు చేయడానికి ప్రభుత్వం అధికారం ఇస్తది.. పైసలు ఇస్తది.. దాన్యం కొనుగోలుకు రాష్ట్ర రైతు సంఘానికి బ్యాంకు 5 వేల కోట్ల రుపాయాలు బ్యాంకు గ్యారంటీ ఇస్తది. రైతు సంఘం ధాన్యం కొంటది.. వడ్లను బియ్యం పట్టించిడానికి వారికి ప్రభుత్వం తరపున పూర్తి పర్మిట్ ఇస్తది ప్రభుత్వం. దళారుల చేతిలో రైతుల మోసపోకుండా గ్రామ గ్రామాల్లో రైతు సమన్వయ సమితుల ఏర్పాటు. రైతు సమితుల ఏర్పాటును ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నారు. వాళ్లు చేయరు ఇంకోక్కరిని చేయనివ్వరు.

పాల విషయంలో విజయ డైరికి కర్ణాటక ప్రభుత్వం మాదిరిగానే నాలుగు రుపాయాలు ఇస్తున్నం.. లీటర్ పాలుకు నాలుగు రుపాయిలు ఇస్తున్నాం. నల్లగొండ లో కూడ పాల కేంద్రం పై దృష్టి పెట్టాలని గుత్తా సుఖేందర్ రెడ్డి గారు నా వెంటపడుతున్నడు…కామారెడ్డి నిజామాబాద్ లాగ కరీంనగర్, నల్లగొండ జిల్లాలపై చూడాలని వెంటబడుతున్నడు…సుఖేందర్ రెడ్డి .. ఒక పని చేపట్టాలంటే దానికి తరిఖా ఉంటది.. సరైన తరిఖా అది తప్పకుండా చేస్తాం చెప్పిన పని వెంటనే కావాలంటే అధికారులు చేయాలి.. వారు చేయాలంటే కాస్త టైం పడ్తది.

ప్రభుత్వ పాలన కూడా వైకుంటం ఆట లాంటిది.. నిచ్చెన తోని పైకి వెళ్లగానే మళ్లీ పాము మింగి మళ్లీ కిందికి వస్తం… అలా ఉంటది.. సర్కార్ లో కూడ మింగే పాములు చాలా ఉంటాయి. ఇప్పటికి ఎన్నో గండాలు దాటి ముందుకు పోయాం. ఇంకా కూడ పోతం. విజయ డైరీకి ఎలాగైతే నాలుగు రుపాయిలు ఇస్తున్నరో అలాగే నల్లగొండ, పాల సొసైటికి డబ్బు ఇవ్వాలని గుత్తా సుఖేందర్ రెడ్డి కోరారు రైతుల తరపున..వచ్చే వారం నుంచి తప్పకుండా విజయ డైరీ మాదిరిగానే నల్లగొండ కరీంనగర్ రంగారెడ్డి సొసైటికు నాలుగు రుపాయిలు డబ్బలు చెల్లిస్తాం. దసరా లోపే ఇస్తాం.. ఈ నెల 24 వరకు ఇస్తం నల్లగొండ కరీంనగర్ రైతులు ఒప్పుకున్నారు కాబట్టి నేను ఇస్తున్న.. ఐతే నేను కూడ మిమ్మల్ని ఒక కోరిక కోరుతున్న.. రైతులందరు పాడి పశువులను పెంచుకోవాలి చక్కగా.. పాల సోసైటి ఏర్పాటు చేసుకోవాలి. పాల సోసైటీలో ఇప్పటి వరకు రెండు లక్షల మంది రైతులు ఉన్నరు.. రైతులు అందరు 60 వేలు పెట్టి గేదెలను కొంటరు.. అమెరికా బర్లు ఇక్కడ బతకవు.. ఎవ్వరి బర్లను వాళ్లే సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పటి నుంచి సర్కార్ సెలెక్ట్ చేయదు.. మీకు నచ్చిన బర్లను రైతులే సెలెక్ట్ చేసుకోని బర్లను తెచ్చకోవాలి.

మీరు రెండు లక్షల మంది ఉన్నరు కదా. మీతోని నాది ఒక్కటే కోరిక. ఇంటికి ఆరు చెట్లు మీకు నేను సప్లై చేపిస్తా. పన్నెండు లక్షల చెట్లు. మీరు ఇంటికి ఆరు చెట్లు కచ్చితంగా పెంచాలె. పెంచుతరా లేదా? మన ఇంటి చుట్టు ఆరుచెట్లు ఉంటే మనకే చల్లదనం కదా. మనకే మంచిది కదా. కాబట్టి.. మీరూ.. ఓకే. మీరు ఇంటికి ఆరు చెట్లు పెంచాలె. పెంచక పోతే.. మీకు నా మీద ఒట్టు ఇగ. ఇంకో పని చేయాలె. పెంచితే ఏం చేయాలె. ఆరు చెట్లు కదా. ఇంట్ల ఆరుగురం ఉన్నమనుకో. ఒక్కొక్కదానికి ఒక్కరి పేరు పెట్టాలె. ఏ పేరు ఉన్నాళ్లు వాళ్లే.. ఓ జగ్గుడు నీళ్లు పోయాలె. చెట్టు పోతే.. నేను పోయినా ఇగ అనుకోవాలె. గట్లైతే పక్కా నడుస్తది. అంతేనా కాదా. ఒక్క మగ్గు నీళ్లు పోసుడు పేద్ద ముచ్చటనా.. మనం అనుకుని పట్టుబడితే చెట్టు పెంచుడు పేద్ద బ్రహ్మపదార్థమా. ఇప్పుడు 48 డిగ్రీలకు పోతున్నదండీ ఎండ. రేపు నువ్వు ఎంత ధనం సంపాదించి పిల్లలకు ఇస్తే.. వాడు బతికే వాతావరణం ఉండాల్నా వద్దా. మరి బతుకు దెరువు లేకుండా..నువ్వు ఎన్ని లక్షల కోట్లిస్తే ఏం లాభం. ఏం చేయాలె. పనికేరాదు కదా. ఇది ఒక కోరిక. మీకు మంజూరు చేసిన్రు కదా. పక్కా. రెండోవ కోరిక నేను కోరుతున్నా.. ఇగ ఎంతకైనా మంచిదే. బ్యాంకుల అప్పన్నా తెస్తా మీ కోసం. ఈ రెండు లక్షల మందికి.. 50శాతం సబ్సిడీ మీద ఇంటికో బర్రె కొనిస్త నేను. దాంతోని పాలు పెరగాలె. పాల ఉత్పత్తి.. 50శాతం సబ్సిడీ మీద మీరే బర్రె సెలెక్ట్ చేసుకుంటారు. (విజిల్స్.. కేకలు..) వద్దు .. వద్దు ..వద్దు.. ఇట్ల కొంచెం ఆగమిది. జర్ర మంచి మాట చెప్పంగానే బుస్సు మని పొంగాలే… జర్ర కిందికి మీదికి కాంగానే.. కిందిమీద కావాలె. గట్ల ఉండొద్ద. స్టాండర్డ్ మీద ఉండాలె గట్టిగ. ఇయ్యాల మీరు ఏడు లక్షల లీటర్ల పాలు పోస్తున్నారు. ఒక్క యాడాది నాటికి మిమ్ముల నేను మళ్ల పిల్చుకుంట. మల్ల పిల్సుకునేనాటికి.. ఇప్పుడు రెండు నెల్లల్ల బర్రెలు కొనాలె అందరం. రెండు నెలల లోపల. ఆ డబ్బులేందో మంజూరు చేసి.. మీ చైర్మన్లకు పంపిస్త నేను. మీ సొసైటీలకు. వాళ్ల ఆద్వర్యంలో మీరు పోయి.. మీరే సెలెక్ట్ చేసుకోవాలె. ఎవ్వరు సెలెక్ట్ చేయరు. రైతాంగమే. మీరు సెలెక్ట్ చేసి.. ఆయ్యా ఇగో నాకు 55 వేలు వచ్చింది దీని ధర. దానికి కట్టాలె. సగం నువ్వు కట్టాలె. సగం చైర్మను కట్టాలె. ఓకే. .. ఆ ప్రకారం కొనాలె. మళ్లొక ఆరునెలల నాటికో.. 8 నెలల నాటికో.. మీరు మల్లా.. నేను పిల్చుకుంటే… 10 లక్షల లీటర్లు పోస్తున్నం సార్ పాలిప్పుడు అని చెప్పే పరిస్థితి రావాలె. ఓకే కదా. పాల ఉత్పత్తి పెరగాలె. దీంతోని మనం స్టార్టయిదాం. తదనంతరం నేను ఇంకా పెద్దగా కూడా ఆలోచన చేస్తున్నా. ఒక్కసారి ఎట్లైతే గొర్రెల విషయంలో పెద్ద ఎత్తున తెచ్చుకుంటున్నామో.. రాష్ట్రంలో క్షీర విప్లవం తేవడానికి.. రైతాంగాన్ని ప్రోత్సహించడానికి.. ఒక పెద్ద స్కీం కూడా.. తీసుకురావాలని నేను ఆలోచన చేస్తున్నా. మీతోని స్టార్టయిదాం. ఎందుకంటే ..మీరు. మీకు ఇప్పుడు చెప్పిన మాట వట్టిగ ఏం కాదు. దానికి కూడా నాలుగైదు వందలకోట్లు కావాలె. ఒకటి కాదు రెండు కాదు రెండు లక్షల బర్రెలు కదా. కాబట్టి సగం కాడికి భరించినా.. కావాలె బాగనే. నేను ఏడనన్నా తిప్పలు పడి తెస్తా. ఒకటి దుబారా ఖర్చు తగ్గించన్నా దానికి సమకూర్చి… మీకు నేను నెల లోపడనే మీ చైర్మన్లుకు దాన్ని రిలీజ్ చేపిస్తా. వాళ్లు మీరంతా.. మీ సగం డబ్బులు కూడా మీరు జమ చేసుకొని.. వెంటనే తల ఒకటి ఇంటికొకటి మళ్లా ఎక్సట్రా.. కొనాలె. కొని బందోబస్తు చేసుకొని.. దాని ప్రకారం. పాల ఉత్పత్తి పెరుగతది. మీకు లాభం జరుగుతది. ఒక్కమాట మీద మీరొచ్చిన్రు. నేను రెండు మాటలు చెప్పిన. మూడోది ఓ కోరిక కోరుకున్నా.. మీరు మంజూరిచ్చిన్రు. చెట్లు మాత్రం పెంచాలె సుమా. పెంచకపోతే.. నేను పటాలం మొత్తం పట్టుకొని మీ ఇంటికి వస్తా. ఒక్కరోజు మాకు అన్నం పెడితే.. మీ యాడాది గాసం మొత్తం పోతది. మీకు యాభై శాతం నేను ఒప్పుకున్నా.. యాభైశాతం కాడికి కొనిద్దాం. దీన్ల ఇంకో పని చేయండి. ఒక్క నిమిషం. దీన్లో ఎస్సీ రైతులుంటే.. దీన్ల గనుక గిరిజన రైతులుంటే.. వాళ్లకు డెబ్బై ఐదు శాతం సబ్సిడీ ఇద్దాం. ఆ డబ్బులుంటే అదనంగా ఉంటయి కాబట్టి. వాళ్లకు ఇద్దాం. మనం వేరే వాళ్లం యాభై శాతం తీసుకుందాం. వాళ్లు పేదోళ్లు కాబట్టి.. గరీబులు కాబట్టి.. వాళ్లకు డెబ్బై ఐదు శాతం ఇచ్చుకుందాం. ఓకే.. పేదవాళ్లు పైకి రావాలె. కాబట్టి ఆ ప్రకారం చేసుకుందాం. ఆ లెక్కలు.. సోసైటీ చైర్మన్లతో నేను కోరుతాఉన్నా… మీరు ఇంకా ఈ రోజు కాదు. ఒక్కమాట నేను ఇంతకు ముందు మీకో మాట చెప్పిన. ఓ పేద్ద స్కీం నేను ఆలోచన చేస్తున్నా అని మీరు చెప్పిన. గొర్రెల గురించి ఆలోచన చేస్తే.. అనుకున్న లెక్క గొర్రెలు రావాలె. అంటే దానికి నాలుగు వేల కోట్లు పెట్టినం ఇప్పుడు. తక్కువ డబ్బు కాదు. ప్రభుత్వ పక్షం నుంచి నాలుగు వేల కోట్లు పెట్టినం. అట్లనే వాస్తవంగా ఆలోచన చేసి.. ఎందుకంటే పాలు.. మీరు ఉత్పత్తి చేయంగనే కాదు. తీసుకునే శక్తి కూడా.. డెయిరీలకు ఉండాలె. వాటిని ఎక్స్ పాండ్ చేయాలె. డెయిరీల శక్తి పెంచాలె. అదీ.. అంటే.. మీరు ఉత్పత్తి పెరగాలె. దాన్ని సేకరించే సామర్థ్యం కూడా పెరగాలె. ఎక్కువ పాలు వస్తే దాన్ని పొడిచేసి ఎట్ల నిలువ చేయాలె. ఇదంతా కూడా పెరగాలె. ఆ మిషన్లు కూడా తేవాలె. నేను ఏం చేస్తా అంటే.. క్షీర విప్లవం దిశగా మనం అడుగులు వేస్తం. పాల వెల్లువ. ఈ రాష్ట్రంలో మన పాలు మనమే తాగేటట్టు.. మన పిల్లలకు ఫ్రెష్ పాలు వచ్చేటట్టు మనం చేద్దాం. మీకు నేను చేసే ప్రామిస్ ఒక్కటే. ఏందంటే.. ఈ రోజు ధర పెంచాలనుకున్నం. పెంచుకున్నం. మీరు విజయం సాధించిన్రు. సగం ధరకు.. దళిత సోదరులు, గిరిజన సోదరులైతే డైబ్బై ఐదుశాతం సబ్సిడీకి బర్రెలు కూడా మీరు సంపాదించుకున్నరు. సంతోషం. మూడో విషయం నేను మీకు ప్రామిస్ చేసేదేంటంటే. రేపు పెద్ద స్కీం వచ్చిననాడు.. ఎక్కువశాతం. పశువులు తెచ్చుకొని ఇచ్చుకునే స్కీం పెట్టిననాడు. దానికి మీకు చానా ఇయ్యాల్సి వస్తది. ఒక్క పశువులే ఇయ్యడం కాదు. చాప్ కట్టర్స్ ఉంటయి. గడ్డి కోసే మిషన్లు.. అవన్ని కూడా తయారు చేసి.. ఒక పద్ధతిగా..చాలా పకడ్బందీగా చేయాల్సి వస్తది. మీకు ఆ సబ్సిడీ అంతా కూడా ఇయ్యాల్సి వస్తది. కాబట్టి దాన్ని పధకం రూపకల్పన చేసి.. తప్పని సరి గడ్డి పెట్టాల్సిన అక్కెర కూడా ఉంటది. అదంతా కూడా డిజైన్ జరుగుతది. నేను డిజైన్ చేస్తను. ఇప్పుడు నాకు రెండు మూడు స్కీంలు సక్సెస్ అయిపోయినయి బాగా. యాదవులది జరిగిపోతున్నది. చేపపిల్లలది జరిగిపోతున్నది. కరెంటు బాధ పోయింది. కొన్ని కొన్ని బాధలు పోయినయి. ఇప్పుడు వీటి మీద పడ్డ నేను ఇగ. మంచినీళ్ల బాధ కూడా పోతది. ఒక్క మూడు నాలుగు నెలలైతే. మొత్తం మిషన్ భగీరథ పనులన్నీ అయితున్నయి మీ గ్రామల్లో. మీ ఆలేరులో చాలా గ్రామాలకు వచ్చినయా నీళ్లు. వచ్చినయా లేవా. బోనగిరోళ్లకు వచ్చినయా.. గంధమల్ల వస్తది ఎట్లైనా..రాక యాడికిపోతది. గంధమల్ల వస్తది, బస్వా పూర్ వస్తది. దాని అయ్య వస్తది. ఎట్ల రాదు. ఏమన్న ఇప్పడు ఆంధ్రాలా ఉన్నమా మనం. తెలంగాణలనే ఉన్నం. పక్కా అయితది. కాకుంటే ఎట్లా ఉంటది. ఒక్క మూడున్నర..నాలుగు నెలలైతే.. రాష్ట్రమంతటా వస్తున్నయి. మిడ్ మానేరు ప్రాజెక్టు కూడా ఇప్పుడే కంప్లీట్ అయింది. దానికి నీళ్లు కూడా తెచ్చుకుంటున్నం. అగో నేను చెప్పేది సత్యమున్నది. నా మాటల సత్యం ఉన్నది కాబట్టి ఆకాశం ఉరుముతున్నది. అబద్ధం మాట్లాడితే ఉరుమది. అంతే కదా. కాబట్టి దేవుని దయవల్ల.. ఈయింత కాలమైతే.. చెరువులు కుంటలన్నీ నిండాలె. పునాస పంటలైతే గడ్డకు పడ్డం. కిందికో మీదికో ఎళ్లినం. కానీ.. ఈయింత కూడా నీళ్లు నిండితే మనం బతికిపోతం. రెండు విషయాలు నేను చెప్పి ముగిస్తాను. మీకు నేను చేసే ప్రామిస్ ఏందంటే.. మీరు ఇప్పుడు ఆల్రెడీ.. ప్రాక్టీస్ అయి ఉన్నరు కాబట్టి.. ట్రైన్డ్ అయి ఉన్నరు కాబట్టి… నెక్స్ట్ క్షీర విప్లవానికి సంబంధించి.. పేద్ద ఎత్తున పాల వెల్లువ సృష్టంచే కార్యక్రమం ఎప్పుడు మొదలుపెట్టినా.. మొదటి ప్రాధాన్యత మీ మూడు సొసైటీలకే ఇస్తా అని మనవి చేస్తున్నా. విజయా డెయిరీ కావచ్చు. ముల్కనూరు డెయిరీ కావచ్చు.. కరీంనగర్ కావచ్చు.. అదే విధంగా నల్లగొండ, రంగారెడ్డి కావొచ్చు. మీకే ఇస్తా. ఫస్ట్ ప్రిఫరెన్స్. అప్పుడు మనిషికి మూడు బర్రెలు వస్తయా.. రెండు బర్రెలు వస్తయా.. ఆ గడ్డి పెట్టే విషయాలు కానీ.. గడ్డి విత్తనాలు కానీ.. గడ్డి కోసే యంత్రాలు కానీ. మంచి పాలరైతులు మీరు ట్రెయినింగ్ అయి ఉన్నరు కాబట్టి..తప్పకుండా మీకు ఆ విధంగా జరుగుతది. అట్లా జరగాలని నేను భగవంతున్ని కోరుతున్నా. మనందరం కూడా ఇంకా బాగుపడాలె. మంచి పంటలు పండాలె. పాడి, పంట రెండింటితోనూ తెలంగాణ వర్థిల్లాలె. మన పిల్లలు బాగుండాలె. తెచ్చుకున్న తెలంగాణ సార్థకం కావాలని కోరుకుంటూ.. ఇయ్యాలమీరు ఇంత మంది వచ్చి… మిమ్ములందరినీ చూసే అదృష్టం నాకు కలిగించినందుకు.. మంచి సంతోషాన్ని పంచుకున్నందుకు.. మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవుతీసుకుంటున్నా. జై తెలంగాణ.

Hon'ble Chief Minister Sri K. Chandrashekar Rao on Sunday ha... Hon’ble Chief Minister Sri K. Chandrashekar Rao on Sunday ha… honble chief minister sri k chandrashekar rao on sunday ha
Hon'ble Chief Minister Sri K. Chandrashekar Rao on Sunday ha... Hon’ble Chief Minister Sri K. Chandrashekar Rao on Sunday ha… 1505685642 536 honble chief minister sri k chandrashekar rao on sunday ha
Hon'ble Chief Minister Sri K. Chandrashekar Rao on Sunday ha... Hon’ble Chief Minister Sri K. Chandrashekar Rao on Sunday ha… 1505685642 608 honble chief minister sri k chandrashekar rao on sunday ha
Hon'ble Chief Minister Sri K. Chandrashekar Rao on Sunday ha... Hon’ble Chief Minister Sri K. Chandrashekar Rao on Sunday ha… 1505685642 100 honble chief minister sri k chandrashekar rao on sunday ha
Hon'ble Chief Minister Sri K. Chandrashekar Rao on Sunday ha... Hon’ble Chief Minister Sri K. Chandrashekar Rao on Sunday ha… 1505685642 273 honble chief minister sri k chandrashekar rao on sunday ha
Hon'ble Chief Minister Sri K. Chandrashekar Rao on Sunday ha... Hon’ble Chief Minister Sri K. Chandrashekar Rao on Sunday ha… 1505685642 594 honble chief minister sri k chandrashekar rao on sunday ha
Hon'ble Chief Minister Sri K. Chandrashekar Rao on Sunday ha... Hon’ble Chief Minister Sri K. Chandrashekar Rao on Sunday ha… 1505685642 186 honble chief minister sri k chandrashekar rao on sunday ha

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com