రెచ్చగొట్టేదీ వీరే..ఏదన్నాజరిగితే ఆడిపోసుకునేదీ వీరే..!!

Here's What People like Bharadwaj Need to know about JanaSena chief Pawan Kalyan pawan kalyan, janasena, bharadwaj comments, pawan kalyan vs jagan, ysr congress vs janasena, chandrababu vs pawan kalyan, tdp vs janasena రెచ్చగొట్టేదీ వీరే..ఏదన్నాజరిగితే ఆడిపోసుకునేదీ వీరే..!! Bharadwaj comments on pawan kalyan  e1502052345156
Here’s What People like Bharadwaj Need to know about JanaSena chief Pawan Kalyan

వేరే వారు చేసే పాదయాత్రకు..నా పాదయాత్రకు చాలా వ్యత్యాసం ఉంది. నా పాదయాత్రలో అవాంఛనీయ సంఘటనలు నాకిష్టం లేదు. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి పాదయాత్ర ఒక్కటే మార్గం కాదు. వేరే ప్రాత్యామ్న్యాయ మార్గాలద్వారా కూడా ప్రజల సమస్యలను తెలుసుకుపోవచ్చు. చిన్న చిన్న మీటింగుల ద్వారానో, లేదా వేరే ఆధునిక పద్దతిని ఉపయోగించో ప్రజలతో మమేకమై సమస్యలను సేకరించొచ్చు.

ఈ స్టేట్మెంట్లు చేసింది ఎవరో కాదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ స్టేట్మెంట్లు అర్ధంకాని..అర్ధం చేసుకోలేని అర్ధజ్ఞానులు ఆయనపై హాస్యాస్పద రీతిలో విమర్శలు చేస్తూ వారి నిజమైన జ్ఞానాన్ని బయటపెట్టుకుంటున్నారు.

వీరిలో తాజాగా సినీ పరిశ్రమలో ప్రముఖ దర్శకుడిగా పేరుగాంచిన భరద్వాజ కూడా ఒకరు. ఈయన తాజాగా టీవీ9 కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ తన పాదయాత్రపై చేసిన కామెంట్లను తప్పుగా అర్ధంచేసుకోవడమే కాదు…ఇంకా 1980 ,1990 , 2000 ల నాటి రాజకీయాల్లోనే ఉన్నట్లు స్పష్టంగా అర్ధమవుతుంది.

ఇలాంటి వారు పవన్ వ్యాఖ్యలను క్షుణ్ణంగా అర్ధంచేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదెలానో ఆ ఆర్టికల్ ఫాలో అయితే మీకే అర్ధమవుతుంది.

వేరే వారు చేసే పాదయాత్రకు..నా పాదయాత్రకు చాలా వ్యత్యాసం ఉంది:

ఈ మధ్య నిర్వహించిన ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ ఇచ్చిన వివరణలో ఇది ఒకటి. ప్రస్తుత్తం పవన్ కు ప్రజల్లో ఉన్న ఆదరణ ఎలాంటిదో ఆయన చేస్తున్న విజిట్లకు స్వచ్ఛదంగా వచ్చే జన సంఖ్యను చూస్తే ఇట్టే అర్ధమవుతుంది. నిజాలని జీర్ణించుకోలేని కుళ్ళుబోతులు ఈ నిజాల్ని ఎలాగూ ఒప్పుకోరు. ఇదే కాదు పవన్ కళ్యాణ్ గురించి బయటకు వచ్చే ఏ నిజాన్ని ఒప్పుకోరు. ఆ బ్యాచ్ అంతే.

ఇక ప్రస్తుత రాజకీయాలలో ఉన్న నాయకులు మీటింగులు పెట్టుకోవాలన్న, పాదయాత్రలు చేయాలన్నా రోజుకో వెయ్యి నుంచి పదిహేను వందలు ఇచ్చి విందు, మందు సమర్పించుకుంటే కానీ రానిపరిస్థితి. ఇది నగ్నసత్యమేది అందరికీ తెలిసిందే. చిన్న చిన్న పరామర్శలకెళ్తేనే వద్దన్నా జనం పవన్ ను చూడడానికి, ఆయన మాటలు వినడానికి లక్షల్లో వస్తున్నారని పచ్చి నిజమనేది ఈ మధ్యే జరిగిన పలు సంఘటనలు చెబుతున్నాయి.

‘సోలో’ పవన్ కు మిగతావారి పార్టీ సభలకు, పాదయాత్రలకు ఉన్న వ్యత్యాసం ప్రతిఒక్కరూ బయటకు చెప్పలేకపోయినా మనసులకు మాత్రం తెలుసు.

మరి భరద్వాజ లాంటి వారు ఇవన్నీ చూడకుండాఅయినా ఉండిఉండాలి. లేదా చూసినా మనసులో వేరేఉద్దేశ్యాలతో పవన్ పై విమర్శలు చేయడానికి పూనుకోనైనా ఉండాలి.

నా పాదయాత్రలో అవాంఛనీయ సంఘటనలు నాకిష్టం లేదు:

భరద్వాజ్ లాటి వారికి తెలుసో లేదా తెలిసినా ఏమి జరిగితే మాకెందుకు..విమర్శ చేస్తే సరిపోయా అని అనుకున్నారోగానీ.. పవన్ చేసే పాదయాత్రలో అవాంఛనీయ సంఘటను జరిగే అవకాశాలు మెండుగా ఉంటాయనేది చాలామంది రాజకీయ విశ్లేషకులకు తెలుసు.

జనసేన కొత్త పార్టీ. క్షేత్రస్థాయి అభిమానులైతే ఉన్నారుకానీ క్యాడర్ లేదు. అదీ గాక..స్వచ్ఛమైన రాజకీయాలకోసం నడుం బిగుస్తున్న పార్టీ. మరి ఇలాంటి పార్టీని తొక్కడానికి క్షేత్రస్థాయిలో ధన బలమున్న చరిత్రగలిగిన పార్టీలు అవాంఛనీయ సంఘటనలు సృష్టించకుండా ఉంటాయి అనుకోవడం చాలా మూర్ఖత్వం.

ఇవన్నీ ఆలోచించే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ “నా పాదయాత్రలో అవాంఛనీయ సంఘటనలు నాకిష్టం లేదు” అనే వ్యాఖ్యలు చేశారు. ప్రజలపట్ల ప్రాణాల విలువ ఆయనకు తెలుసుకాబట్టే ఆ వ్యాఖ్యలు చేశారు అనేది ఆయన్ను అర్ధంచేసుకున్న వారు నమ్మే నిజం. దీన్ని బట్టి భరద్వాజ్ లాటి వారు ఏ కోవకు చెందినవారో అర్ధం చేసుకోవచ్చు.

ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి పాదయాత్ర ఒక్కటే మార్గం కాదు:

వేరే ప్రాత్యామ్న్యాయ మార్గాలద్వారా కూడా ప్రజల సమస్యలను తెలుసుకుపోవచ్చు. చిన్న చిన్న మీటింగుల ద్వారానో, లేదా వేరే ఆధునిక పద్దతిని ఉపయోగించో ప్రజలతో మమేకమై సమస్యలను సేకరించొచ్చు. అనేది పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల సారాంశం. ప్రజలతో మమేకమవ్వాలంటే చాలా అధునాతన పద్ధుతులే ఉన్నాయి. కూర్చొని హోమ్ వర్క్ చేసి, ప్లానింగ్ చేస్తే ప్రజలతో మమేకమయ్యే అత్యాధునిక పద్ధతులు అనేకం.

టెక్నాలజీ తెలియని, తెలుకోవాలనే ప్రయత్నం చేయలేని వారు…వారికి తెలిసిన విధ్యే గొప్పదని నమ్మి వారి అజ్ఞానంతో ఇట్టే దొరికిపోతారు. భరద్వాజ్ లాంటి వారి వ్యాఖ్యలు అలాంటివే అనడంలో సందేహం లేదు.

రాజకీయాలు మారాయి. ప్రసార, ప్రచార మాధ్యమాలు మారాయి. ప్రజలూ మారారు. కానీ ఇంకా భరద్వాజ్ లాంటి వారు మాత్రం వారికి తెలిసిన ఎన్ఠీఆర్, వైఎస్సార్ నాటి రాజకీయాలే మాట్లాడుతూ వారిని వారే ఆయోమయులుగా చిత్రీకరించేసుకుంటున్నారు.

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com