జనసేనానికి విద్యార్థుల కృతఙ్ఞతలు!! జాగ్రత్తపడ్డ సాక్షి!!

Here's an another reason why Sakshi media hates Pawan Kalyan జనసేనానికి విద్యార్థుల కృతఙ్ఞతలు!! జాగ్రత్తపడ్డ సాక్షి!! జనసేనానికి విద్యార్థుల కృతఙ్ఞతలు!! జాగ్రత్తపడ్డ సాక్షి!! janasena vs sakshi e1504732744537
Here’s an another reason why Sakshi media hates Jana Sena party and its chief Pawan Kalyan

వ్యవసాయ విజ్ఞాన విశ్వవిద్యాలయం విద్యార్దుకులకు నష్టం కలిగించేలా ఉన్న జీఓ నెంబర్ 64 ను ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలసి విద్యార్థులు విన్నవించుకోవడంతో..ఈ విషయంపై ప్రభుత్వానికి లేఖరాశారు. ఈ విషయంపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వాని జీవోను రద్దు చేసింది.

విద్యార్థుల డిమాండ్ కు సానుకూలంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. టీడీపీ సర్కారుకు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ సమస్యను పరిష్కరించిన సీఎం చంద్రబాబుకు, మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు పవన్.

మరోపక్క…విద్యార్థులు పవన్ కళ్యాణ్ ను తమ ధన్యవాదాలు తెలిపారు. ఎన్ని ఆందోళనలు చేసినా ప్రభుత్వం మా విన్నపాన్ని వినకుండా పెడచెవిన పెట్టిందని…చివరిగా పవన్ ను కలిస్తే తమ సమస్యపై పోరాడతారేమో అన్నఆశతో కలిస్తే…కలిసిన కొద్దిరోజులకే సమస్యను పరిష్కరించారని భావోద్వేగానికి లోనయ్యారు విద్యార్థులు.

ఈ అంశంపై దాదాపు అన్ని మీడియా సంస్థలు కూడా కొద్దో గొప్పో వార్తలు ప్రసారం చేశాయి. ఒక్క వై ఎస్ జగన్ &కో కు సంబందించిన సాక్షి మీడియా తప్ప. కనీసం వార్తను వార్తగా కూడా ప్రసారం చేయకపోవడం వారికి పవన్ పై ఉన్న విద్వేషాన్ని తెలియచేసింది.

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com