జనసేనపై కులమీడియాల కొత్త స్ట్రాటజీలు!! జరభధ్రం!

Here 's How Mainstream media plays a political strategy against Jana Sena and its chief Pawan Kalyan   pawan kalyan జనసేనపై కులమీడియాల కొత్త స్ట్రాటజీలు!! జరభధ్రం! janasena and media
Here ‘s How Mainstream media plays a political strategy against Jana Sena and its chief Pawan Kalyan

కొన్ని నెల‌ల క్రితం సీ(ఏ)బీఎన్ ఆంధ్ర‌జ్యోతి ఒక స‌ర్వే వేసింది.. ఉన్న ప‌ళంగా ఎన్నిక‌లు వ‌స్తే., జ‌న‌సేన‌కి 2 శాతం ఓట్లు మాత్ర‌మే వ‌స్తాయ‌న్న‌ది ఆ స‌ర్వే సారాంశం.. ఈ స‌ర్వే ఆ ప‌చ్చ ప‌త్రిక‌, చాన‌ళ్ల‌లో వేశాక‌., చాలా రోజులు జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు అంతా., దానికి కౌంట‌ర్ ఇచ్చే ప‌నిలో నిమ‌జ్ఞ‌మ‌య్యారు.. అందుకోసం కొంత మంది అయితే రోజు వారీ కార్య‌క్ర‌మాల‌కు., సేవ‌ల‌కు కూడా విరామం ఇచ్చారు.. ఆ త‌ర్వాత చాలా స‌ర్వేలు గంద‌ర‌గోళం సృష్టించాయి.. కొంద‌రు జ‌న‌సేన‌కి ప్ల‌స్ అంటే., కొంద‌రు టీడీపీకి ప్ల‌స్ అని., ప్ర‌జాభిప్రాయానికి సంబంధం లేకుండా ఇలా ఎవ‌రికి ఇష్టం వ‌చ్చిన‌ట్టు వాళ్లు అంకెల గార‌డీ చేశారు.. ఆ స‌ర్వేల‌పై అంతా స్పందిస్తూనే ఉన్నారు.. తాజాగా బెజ‌వాడ మాజీ ఎంపి ల‌గ‌డ‌పాటి పేరు మీద ఓ స‌ర్వే హ‌ల్ ఛ‌ల్ చేస్తోంది.. అదీ సోష‌ల్ మీడియాలో మాత్ర‌మే.. ఎక్క‌డ ఎన్నిక‌లు జ‌రిగినా., త‌న‌కు సంబంధం ఉన్నా లేకున్నా., అవ‌స‌రం ఉన్నా లేకున్నా., త‌న‌కు చేత‌నైన ప‌ని ఇదేనంటూ స‌ర్వేల మీద స‌ర్వేలు వేసే ల‌గ‌డ‌పాటి.. త‌న స‌ర్వేల‌న్నీ మీడియా ముఖంగానే ప్ర‌క‌టించారు.. ఆశ్చ‌ర్య‌క‌రంగా తాజా స‌ర్వే రిపోర్టు సోష‌ల్ మీడియాలో మాత్ర‌మే హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.. ఇంత వ‌ర‌కు ఈ స‌ర్వేపై ఆ జ‌గ‌డ‌పాటి నోరు విప్పింది కూడా లేదు.. దీనిపై చ‌ర్చ మాత్రం విస్తృతంగా సాగుతోంది..

అయితే ఈ స‌ర్వే ఏం చెప్పాల‌నుకుటోంది.. ప్ర‌జ‌ల్ని త‌ప్పుదోవ ప‌ట్టించేందుకా..? జ‌న‌సైన కార్య‌క‌ర్త‌ల మాన‌సిక స్థితిని ప్ర‌భావితం చేసేందుకా..? మొన్న‌టి వ‌ర‌కు అస‌లు జ‌నంలో జ‌న‌సేన లేద‌న్న స‌ర్వేలు.. ఇప్పుడు జ‌న‌సేన‌కి ఎందుకు అనుకూలంగా వ‌స్తున్నాయి..? ఇందుగ‌ల మ‌ర్మం ఏంటి..? 2009లో ఓ పార్టీ తెలుగు రాష్ట్ర రాజ‌కీయాల్లోకి సంచ‌ల‌నాత్మ‌క ఎంట్రీ ఇచ్చిన‌ప్పుడు., పార్టీ ఆవిర్భావం నుంచి అంత‌రించే వ‌ర‌కు ఓ పేరు మోసిన మీడియా సంస్థ‌లో కీల‌క బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తూ.. పూర్తి వ్య‌వ‌హారానికి ప్ర‌త్య‌క్ష సాక్షిగా ఉన్న నేను కొన్ని నిజాలు ఇక్క‌డ పంచుకోక త‌ప్ప‌దు.. ఆ నాడు రాష్ట్ర రాజ‌కీయాల్లో తీవ్ర‌మైన అనిశ్చితికార‌ణంగా., మొద‌ట మేం ఎవ‌రి ప‌క్షం కాదు అని చెప్పుకునే స‌ద‌రు మీడియా సంస్ధ‌., కొత్త పార్టీని ఆహ్వానిస్తూ., మ‌ద్ద‌తు తెలుపుతూ.. మీరు వ‌స్తే ఏదో జ‌రుగుతుంది.. అనే మైకం అనే వ‌ల విసిరింది.. ఆ పెద్ద మ‌నిషికి ఆలోచించుకునే అవ‌కాశం., ఊపిరి పీల్చుకునే ఛాన్స్ కూడా ఇవ్వ‌లేదు.. అటు ఇటుగా ఉన్న ఆలోచ‌న‌ని., అటు వ‌ద్దు ఇటే ర‌మ్మంటూ బ‌ల‌వంతంగా లాగింది.. తీరా వ‌చ్చాక త‌ప్పులు వెత‌క‌డం మొద‌లుపెట్టింది.. ఇక్క‌డ అస‌లు మీ ఉద్దేశం ఏంటి..? అని ప్ర‌శ్నించాల‌ని ఉన్నా., ఆ నాడు నా శ‌క్తి స‌రిపోలేదు.. కానీ ఆ సంస్థ‌తో పాటు దాదాపు 80 శాతం మీడియా అంతా ఆ పార్టీని ఓడించేందుకు శ‌క్తివంచ‌న లేకుండా కృషి చేసింది.. ప్ర‌తి అడుగులోనూ లోపాల‌ను మాత్రమే జ‌నానికి చూపింది.. ఈ రాత‌ల వెనుక రాజ‌కీయ‌దురుద్దేశం మాత్ర‌మే ఉంద‌ని అప్ప‌ట్లోనే ఖ‌చ్చితంగా అర్ధం అయ్యింది.. ప్ర‌జ‌లు మార్పు కోరుకున్నా., వీరు మాత్రం కోరుకోరు.. త‌మ శ‌క్తినంత‌టినీ ఉప‌యోగించి ప్ర‌జ‌ల ఆలోచ‌న‌ల్ని కూడా ప్ర‌భావితం చేసేస్తారు..

ఇప్పుడు ఇలాంటి వ్యూహ‌మే జ‌న‌సేన చుట్టూ అల్లే ప్ర‌య‌త్నం జ‌రుగుతున్న‌ట్టుగా క‌న‌బ‌డుతోంది.. ప్ర‌స్తుతం తెలుగు రాష్ట్రాల్లో స‌మ‌స్య‌ల ప‌రిష్కార కేంద్రంగా ఉన్న జ‌న‌సేన‌., ఆ పార్టీ అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కి నానాటికీ జ‌నంలో ఆధ‌ర‌ణ పెరుగుతోంది.. ఒక్కో స‌మ‌స్య ఆయ‌న ప‌రిష్క‌రిస్తుంటే., జ‌న‌సేనపై జ‌నం న‌మ్మ‌కం బ‌ల‌ప‌డుతూ వ‌స్తోంది.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు స‌ద‌రు గ్రూప్ ఆఫ్ మీడియా సంస్థ‌లు జ‌న‌సేన‌, జ‌న‌సేనానిపై విమ‌ర్శ‌ల‌కే ప్రాధాన్యం ఇచ్చాయి.. వార్త నెగెటివ్ అయినా, పాజిటివ్ అయినా., ప‌వ‌న్ వార్త‌ల‌కి భారీగా రేటింగ్స్ వ‌స్తుండ‌డంతో.. ఆయ‌న ప్ర‌తి అడుగునీ ద‌గ్గ‌ర‌గా గ‌మ‌నిస్తూ వ‌చ్చాయి.. రాను రాను ప‌రిస్థితులు మారాయి.. జ‌న‌సేన‌కు జ‌నాధ‌ర‌ణ పేరుగుతున్న నేప‌ధ్యంలో., ఇలాంటి మీడియా సంస్థ‌ల‌పై వ్య‌తిరేక‌త కూడా పెరుగుతూ వ‌స్తోంది.. సోష‌ల్ మీడియాని ఆశ్ర‌యించే వారి సంఖ్య పెర‌గ‌డం., ప్రింట్, ఎల‌క్ట్రానిక్ మీడియాకు ఆధ‌ర‌ణ త‌గ్గడం జ‌రుగుతూ వ‌స్తోంది.. కొన్ని సంద‌ర్బాల్లో స‌ద‌రు మీడియా సంస్ధ‌లు వార్త‌ల కోసం సోష‌ల్ మీడియానే ఆశ్ర‌యించాల్సి వ‌స్తోంది.. దీంతో ఇప్పుడు వ్యూహం మారింది.. జ‌న‌సేన‌కి అనుకూలంగా వార్త‌లు వ‌స్తున్నాయి.. ఆఖ‌రికి జ‌న‌సేన‌ని త‌మ ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్దిగా భావించి., నిత్యం టార్గెట్ చేసే ప్ర‌తిప‌చ్చ మీడియా సాక్షితో స‌హా..

ఇప్పుడు తాజా వ్యూహం ఏంటి.. జ‌నాన్ని న‌మ్మించ‌డం.. మేం ఎవ‌రు మంచి అయితే., వారికే మ‌ద్ద‌తు ప‌లుకుతామ‌న్న న‌మ్మ‌కాల‌న్ని బ‌ల‌ప‌ర్చ‌డం.. నాలుగు సార్లు మంచి అన్న నోటితో ఒక సారి చెడు అంటే.., ఏం జ‌రుగుతోంది..? అవును మంచిగా ఉన్న‌న్నాళ్లు మేమంతా మ‌ద్ద‌తు ప‌లికాం.. ఇప్పుడు అక్క‌డ ఏదో ఉంది కాబ‌ట్టే., దాన్ని మీ దృష్టికి తీసుకువ‌స్తున్నాం అని చెప్పుకునే ప్ర‌య‌త్నం.. అక్క‌డ ఏం లేక‌పోయినా మంచి అని చెప్పిన నోళ్లే చెడు అని చెప్ప‌డం ద్వారా., జ‌నం దృష్టిని మ‌ళ్లించ‌డం.. ఎవ‌రికి ఓటు వేయాల‌న్న విష‌యంలో విష‌యంలో గంద‌ర‌గోళంలో ఉన్న ప్ర‌జ‌లు., కొత్త‌ద‌నాన్ని ఆహ్వానించే స‌మ‌యంలో., ఛీ వ‌ద్దు.. దాని వ‌ల్లా ఒరిగేది ఏమీ ఉండ‌దు అని చెప్పే ప్ర‌య‌త్నం.. ఎవ‌రైనా ఇంతే కాబ‌ట్టి., అనుభ‌వానికే పట్టం క‌ట్టాలంటూ మ‌ళ్లీ జ‌నాన్ని మోస‌గించ‌డం.. ఆ నాడు అభిమ‌న్యుడి సంహారానికి ఉప‌యోగించిన ప‌ద్మ‌వ్యూహం కూడా., మీ వ్యూహం ఎదుట బ‌లాదూర్‌.. మీరు మాత్రం అ కురుసామ్రాజ్యాధినేత‌ల వారుసులే క‌దా మ‌రి.. అధికారం కోసం ఎంత వ్యూహాలు అయినా ప‌న్నుతారు.. ఇక్క‌డ జ‌న‌సేనుడు ఎలాంటి వ్యూహాన్న‌యినా ఛేదించ‌గ‌ల అర్జునుడు జ‌ర‌భ‌ద్రం.

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com