‘గోన గన్నారెడ్డి’ అదరహో! ఆ పాత్రను అంత బాగా చెక్కింది ఎవరో తెలుసా?

‘Gona Ganna Reddy’ role in Rudramadevi receives overwhelming response

ఎన్నో సార్లు వాయిదా పడ్డ తరవాత ఎట్టకేలకు నిన్న విడుదల అయిన రుద్రమ దేవి సినిమా కొందరు అదరహో అంటుంటే మరికొందరు తుస్ మంది అంటున్నారు. కానీ ఘంటా పదంగా అందరూ చెబుతున్న ఒకేఒక్క మాట ఏంటంటే ఈ సినిమా లో గోన గన్నా రెడ్డి క్యారెక్టర్ అదిరిపోయింది అని, ఆ పాత్ర వరకూ సినిమా లో అసలు తిరుగే లేదు అని అంటున్నారు.

గుణ శేకర్ చెప్పిన గోన గన్నా రెడ్డి పాత్ర బాగుంది కానీ దాని ఎలివేషన్ సరిగ్గా లేదు అని అనిపించిన బన్నీ అప్పట్లో ఈ సినిమా చేయడానికి ఆలోచిస్తూ ఉండగా గుణ స్వయంగా ఈ సినిమా కోసం పరుచూరి బ్రదర్స్ ని సంప్రదించినట్టు చెబుతున్నారు. కాసేపు ఒక పదిహేను నిమిషాలు తెరమీద కనిపించే పాత్ర కోసం పరుచూరి బ్రదర్స్ స్వయంగా ఈ సీన్ లు రాసారట.

ఫిలిం నగర్ లో వినిపిస్తున్న కహానీ మాత్రం వేరేగా ఉంది. ఫండింగ్ విషయం లో నిర్మాతగా కంటే ఫైనాన్షియర్ గా ఉండడానికి ఇష్టపడ్డ అల్లూ అరవింద్ గుణ శేకర్ రుద్రమ దేవి స్క్రిప్ట్ చదివిన తరవాత తన కొడుకు అల్లూ అర్జున్ కి కూడా ప్రత్యేక పాత్ర ఇవ్వాలి అని షరతు పెట్టారట. దానికి ఓకే చెప్పిన గుణ అప్పుడు రంగం లోకి గోన గన్నా రెడ్డి క్యారెక్టర్ ని దింపారు . అల్లూ అర్జున్ వేస్తున్న గోన గన్నా రెడ్డి పాత్ర ని మరింత పవర్ ఫుల్ గా కోరిన అల్లూ అరవింద్ కి పరుచూరి బ్రదర్స్ దీనికి పర్ఫెక్ట్ అనిపించడంతో అనుష్క సీన్ ల కంటే సినిమా లో గోన గన్నా రెడ్డి పాత్ర బాగా ఫేమస్ అయిపొయింది. పరుచూరి సోదరులు రాసిన సీన్ లు ఎంత బాగున్నాయి అంటే సినిమా చూసి వచ్చిన ప్రతీ వారూ అనుష్క గురించి కంటే ముందు అల్లూ అర్జున్ గురించే మాట్లాడుతూ ఉండడం విశేషం

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com