గ్రేటర్ ఎన్నికల్లో ‘పవన్ ‘ పోటీ చేస్తానంటే ఓకే

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తామంటే, ఆ పార్టీ ని కూడా కలుపుకు పోతామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన లేదని ఇటీవల పవన్ కళ్యాణ్ స్పష్టం చేసిన విషయం తెల్సిందే. అయినా గ్రేటర్ లో పోటీ చేయాలని పవన్ ప్యాన్స్, జనసేన కార్యకర్తలు కోరుకుంటున్నారు.

పవన్ కలిసి వస్తే  మేలు
గ్రేటర్ ఎన్నికల్లో పవన్ తమతో కలిసి పోటీ చేస్తే తమకు మేలు జరుగుతుందని బిజెపి, టిడిపి నేతలు భావిస్తున్నారు. త్వరలోనే జరిగే గ్రేటర్ ఎన్ని కల్లో మిత్ర పక్షంగా పోటీ చేయాలని ఈ రెండు పార్టీ లు నిర్ణయించాయి. గ్రేటర్ పరిధిలో రెండు పార్టీలకు క్షేత్రస్థాయి లో మంచి బలమే ఉంది. తమ బలానికి తోడు పవన్ లాంటి ప్రజాకర్షణ కలిగిన నేత తమతో జట్టు కడితే ఎన్నికల్లో సునాయాసంగా విజయం సాధించ వచ్చునని బిజెపి, టిడిపి నేతలు భావిస్తున్నారు.

సాధారణ ఎన్నికల్లో పవన్ ప్రచారం
సాధారణ ఎన్నికల్లో టిడిపి, బిజెపి తరుపున పవన్ ప్రచారం చేశారు. పవన్ ప్రచారం టిడిపి, బిజెపి కి ఎంతో మేలు చేసింది. గ్రేటర్ పరిధి లో సాధారణ ఎన్నికల్లో చేసిన ప్రచారం మంచి ఫలితాన్ని ఇవ్వడం తో జనసేన కూడా తమతో కలిసి పోటీ చేస్తే బాగుంటుందని అభిప్రాయం తో టిడిపి, బిజెపి నేతలు ఉన్నారు. ఇదే విషయాన్ని బిజెపి నేత కిషన్ రెడ్డి మీడియా కు చెప్పారు.

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com