జనసేనపై మూకుమ్మడి దాడి..గమనిస్తున్న జనం!..జనసేన విజయం తధ్యం?

pawan kalyan vs media జనసేనపై మూకుమ్మడి దాడి..గమనిస్తున్న జనం!..జనసేన విజయం తధ్యం? జనసేనపై మూకుమ్మడి దాడి..గమనిస్తున్న జనం!..జనసేన విజయం తధ్యం? pawan kalyan vs media e1515332062611
Corrupt Political Parties, Telugu Media Attack Pawan Kalyan | JanaSena

స్ట్రాటజిక్ గా పవన్ కళ్యాణ్ ని..ఆయన పార్టీ జనసేనను ఆదిలోనే భూస్థాపితం చేయాలనే వైసీపీ-టీడీపీ తో పాటు వారికి కొమ్ముకాస్తున్న అన్ని మీడియా సంస్థల కుట్రలను జనం క్షుణ్ణంగా అవగాహన చేసుకుంటున్నారనేది వాస్తవం. ప్రజానాడిపై ఓ చిన్నిపాటి ఆవగాహన ఉన్నవారికి ఇది అర్ధమవుతుంది.

అవినీతితో నిండిపోయిన ప్రభుత్వాలు, వ్యవస్థలపై నోరువిప్పి పోరాడే ధైర్యం జనానికి లేకపోవచ్చు. కానీ ప్రజాస్వామ్యం..ఓటు అనే బలమైన ఆయుధాన్ని ఇచ్చినందుకు ఒకంత ప్రజలు ఇంకా ఆశాభావంతోనే ఉన్నారనేది వాస్తవికతతో కూడిన నిజం.

నలభై ఐదుసంవత్సరాల వయసులోనే చిత్రపరిశ్రమ ఇచ్చిన మహోన్నతస్థానాన్ని వదులుకొని ప్రజలసమస్యలను తన రాజకీయపార్టీ ద్వారా పరిష్కరించే ప్రయత్నం చేస్తానంటూ జనంలోకి వస్తున్న పవన్ కళ్యాణ్ పై మీడియా..వారివెనకున్న రాజకీయపార్టీల మూకుమ్మడిదాడి ప్రజలను విస్మయానికి గురిచేస్తుండడంతో పాటు ఆందోళనచెందేలా చేస్తున్నాయనడంలో సందేహాలవసరమే లేదు.

మీడియా అండలేని జనసేనకు సోషల్-డిజిటల్ మీడియా దేవుడిచ్చిన ఓ వరంగా భావించాలి. మీడియా-పార్టీల కుట్రలను ఎప్పటికప్పుడు ఎండగట్టే ప్రయత్నం చేస్తూ ప్రజలకు నిజాలను చేరవేసే పనిని యువత భుజానెత్తుకుందనే వాస్తవికతను గమనిస్తే రాజకీయవిప్లవం
ప్రస్తుతం ఎంతఅవసరమో ఇట్టే అవగతమవుతుంది.

జనసేన విజయం?

నేటి ‘సాంకేతికత-సమాచార’ సాధనాల పై అవగాహనలేని తెలుగు మీడియా తాము నమ్మిన పాతపద్ధతులనే ( ఉదాహరణకు ప్రజారాజ్యం పై చేసిన దాడి) తూచా పాటిస్తూ జనసేనపై కూడా పీఆర్ఫీ పై ప్రయోగించిన స్ట్రాటజీనే అమలుచేస్తుండడాన్ని జనం పూర్తిగా అర్ధంచేసుకుంటున్నారనేది వాస్తవం.

అంటే జనసేనపై మీడియా (నడిపిస్తుంది పార్టీలే) చిమ్ముతున్న విషం జనసేనకు పరోక్షంగా విజయాన్ని చేకూరుస్తుందనే వాదనలో వాస్తవికత దాగిఉంది.

మితిమీరిన మీడియా ప్రవర్తన ప్రజలను చైతన్యం చేస్తుండడంతో పాటు జనసేన అభిమానుల ఐక్యతను బలపరుస్తుండడం గమనార్హం.

దగాచేయబడ్డ సామాన్య పౌరుడు మీడియా కుట్రలపై గళంవిప్పే ధైర్యం ప్రస్తుతం చేయలేకపోయినా ప్రజాస్వామ్యం ఇచ్చిన ఓటు విలువను అర్ధంచేసుకుంటున్నారనేది వాస్తవం.

జుగుప్సాకరంగా మారిన మీడియా..పరోక్షంగా మాత్రం ప్రజల్లో చైతన్యం తెస్తూ మార్పు కు దోహదపడుతున్నందుకు ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఎంతైనాఉంది.

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com