సంక్రాంతి కి “యంగ్ టైగర్” సినిమా ఖాయం !

యంగ్ టైగర్ ఎన్ టి ఆర్ హీరోగా నటిస్తున్న నాన్నకు ప్రేమ తో సినిమా రిలీజ్ పై నెలకొన్న డైలమా నిర్మాత క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమా షూటింగ్ పార్టు పూర్తి కాకపోవడం, ప్రస్తుతం పాటల చిత్రీకరణ జరుగుతుండడం తో అనుకున్న సమయానికి రిలీజ్ అవుతుందా? లేదా ? అన్న అనుమానాలు ఫిల్మ్ నగర్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

ముందు నిర్ణయించిన తేదీ కే రిలీజ్

నాన్నకు ప్రేమతో సినిమా ను ముందుగా నిర్ణయించిన తేదీ కే సంక్రాంతి పండుగ సందర్భంగా సినిమా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నాయి . వచ్చే నెల 13 వ తేదీన ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు నిర్మాత స్పష్టం చేశారు. ఈ నెల 27 వ తేదీన హైదరాబాద్ లోని శిల్ప కళా వేదిక లో ఆడియో రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

27 న ఆడియో రిలీజ్ 

నాన్నకు ప్రేమ తో సినిమా ఆడియో రిలీజ్ తేదీపై కూడా సందిగ్దత సరికాదని భావించిన దర్శక, నిర్మాతలు ఈ నెల 27 వ తేదీన నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ కు పితృ వియోగం కలగడం తో ఇంకా ఒక పాట కంపోజింగ్ బ్యాలెన్స్ లో ఉండడం తో, ఆడియో రిలీజ్ పై అనుమానాలు నెలకొన్నాయి. అయితే ఈ నెల 27 వ తేదీ లోగా పాట కంపోజింగ్ పూర్తి చేసి ఇస్తానని రాక్ స్టార్ దర్శక, నిర్మాతలకు భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. దానితో ఈ నెల 27 వ తేదీన ఈ సినిమా ఆడియో రిలీజ్ కు రెడీ అవుతున్నారు దర్శక, నిర్మాతలు.

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com