బాక్సైట్ తవ్వకాలపై “బాబు” చెప్పిన నిజాలు …

విశాఖ మన్యం లో బాక్సైట్ తవ్వకాలపై స్థానిక గిరిజనులతో చర్చించాకే తెలుగుదేశం ప్రభుత్వం  తుది నిర్ణయం తీసుకుంటుందని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. 2008 లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జారీ చేసిన జీవో 222 ను, ఆనాటి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను రద్దు చేస్తున్నట్లు అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. బాక్సైట్ తవ్వకాలను గిరిజనులు, ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెల్సిందే.
వైఎస్ హయాం లో అనుమతులు

అయితే బాక్సైట్ తవ్వకాలకు తమ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదన్న చంద్రబాబు, గతం లో వైఎస్ తన సొంత మనుషులకు లబ్ధి చేకూర్చేందుకు తవ్వకాలకు అనుమతులు ఇచ్చారని విమర్శించారు. తొలుత జిందాల్ కంపెనీకి 25 లక్షల టన్నుల బాక్సైట్ నిక్షేపాలను తొమ్మిది వేల కోట్ల పెట్టుబడులకు సరఫరా చేయాలని నిర్ణయించారని, కానీ ఈ నిర్ణయాన్ని అమలు చేయలేదన్నారు.

తెర పైకి రస్ అల్ ఖైమా 

రస్ అల్ ఖైమా అనే సంస్థ ను తెర పైకి తీసుకు వచ్చారని, రస్ అల్ ఖైమా పరిశ్రమ పెడితే, ప్రభుత్వం వారికి బాక్సైట్ నిక్షేపాలను సరఫరా చేసే విధంగా ఒప్పందని కుదుర్చుకోవాలని ఆనాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రతిపాదిస్తే వైఎస్ కొట్టి పారేశార న్నారు.
ఆన్ రాక్ ఏర్పాటు

జెర్రెల్లా లో రస్ అల్ ఖైమా కు గనులు కేటాయించగానే, రస్ అల్ ఖైమా, పెన్నా గ్రూప్ కలిసి ఆన్ రాక్ సంస్థను స్థాపించాయని వివరించారు. సభ లో బాక్సైట్ తవ్వకాల పై చర్చ జరిగితే వైస్సార్ కాంగ్రెస్ పార్టీ బండారం బయట పడుతుందనే ఆ పార్టీ అధినేత పలాయన వాదం అందుకున్నారని ఎద్దేవా చేశారు. గిరిజనుల సంక్షేమం దృష్టి లో పెట్టుకుని బాక్సైట్ తవ్వకాల పై తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com